పుడమిటివి జర్నలిస్ట్ కాలం

మధన్న మాట
గాడిపల్లిపల్లి మధు -సీనియర్ జర్నలిస్ట్
సెల్ నెంబర్ – 9440146261
అందరం కీలు బొమ్మలమే
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు తల పొగరుతో తిరిగిన వారిని తలదించుకునేలా చేస్తుంది.
తలదించుకొని బ్రతికిన వారిని ధైర్యంగా బతికేలా చేస్తుంది .
నవ్విన వారిని ఏడిపిస్తుంది ఏడిచిన వారిని నవ్వేలా చేస్తుంది కాలం చేతులో అందరం కీలు బొమ్మలమే
అబద్ధాలు మోసాలతో కీర్తి ప్రతిష్టలు ఎంత గొప్పగా నిర్మించుకున్నా అవి కుప్పకూలి పోవడానికి ఒక్క నిజం చాలు
అందుకే కష్టమైనా సరే నీతిగా బతకడమే మనిషికి ఉత్తమమైన మార్గం.
తియ్యటి నీరు నింపుకున్న బావి మౌనంగానే ఉంటుంది
అదే ఉప్పునీటితో ఉన్న సముద్రం ఎగిరి పడుతూ ఉంటుంది
అలాగే అజ్ఞాని అరుస్తూ ఉంటాడు జ్ఞాని మౌనంగా ఉంటాడు.
పుస్తకాలు చదివిజ్ఞానం సంపాదించుకోవడం మంచిదే కానీ మనుషులను చదవడం మర్చిపోకు
ఎందుకంటే ఇప్పటి లోకంలో జ్ఞానం కంటే లోకజ్ఞానం చాలా ముఖ్యం సంపాదనలో పడి చిన్న చిన్న సంతోషాలను కోల్పోకండి
తర్వాత ఎంత కూడా పెట్టినా పోయిన కాలం వయసు తిరిగి రాదు.
ప్రతి సందర్భాన్ని ఆస్వాదించండి తుపాకులు బాంబులతో సాధించేది ఏమీ లేదు
బూడిద తప్ప తీవ్రవాదాన్ని అరికడదాం శాంతిని నెలకొలుపుదాం మన దేశాన్ని కాపాడుకుందాం.