పుడమిటివి న్యూస్
ఎలకంటి నరేష్ పుడమిటివి తెలంగాణ బ్యూరో చీఫ్
తెలంగాణా యాంటీ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు, వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన 106 కేసులకు సంబంధించి, స్వాధీనం చేసుకున్న 967.864 కిలోల గంజాయిని, సుమారు రూ. 4,83,93,200 (రూ.4.83 కోట్ల) విలువైన గంజాయిని, డ్రగ్ డిస్పోజల్ కమిటీ వారు నిబంధనల ప్రకారం ధ్వంసం చేశారు.
డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్, ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ ఆధ్వర్యంలో, ఈరోజు హనుమకొండ మండలం అమ్మవారిపేట గ్రామ శివారులో ఉన్న కాకతీయ మెడిక్లీన్ సర్విస్ వారి భస్మీకరణ ప్లాంట్ లో గంజాయి ధ్వంస కార్యక్రమాన్ని నిర్వహించారు.
మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ నిరంతరం చర్యలు చేపడుతోందని, మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటూ, మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి పోలీస్ శాఖ కృషి చేస్తోందని డీసీపీ అంకిత్ కుమార్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ(పరిపాలన) రాయల ప్రభాకర్ రావు, సీసీఆర్బీ ఏసీపీ డేవిడ్ రాజు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
