నేను మీ రాలచెట్టును

 

పుడమిటివి జన సాహిత్యం
ఓరుగల్లు అక్షరదిక్కార స్వరాలు

పోగాకు రజిత వీరాస్వామి
పిజిటి తెలుగు కొత్తగూడ

స్వగతం చెప్పుకునేంత గొప్ప దాన్నికాదు
అలాగని గతాన్ని మర్చి పోలేను
మునుపే నయం సామెత
నేను చూసిన నా అక్షరపల్లెకు
ఆనవాలమై నిలిచింది

నాకింకా గుర్తున్నాయి

నాచిననాటి లేలేత  చిగురు జ్ఞాపకాలు
నా ఆరెపల్లి విలువల వెలుగుల్లో
చింతచెరువుల తామేర తుంపరలో
తురకల చెరువు గట్టుపై నడిచిన
కన్నెపిల్ల వయ్యారి నడకల్లో
అమ్మలక్కల సద్దుల మూటల్లో
పైరు పంటల్లోపచ్చని పొలాల్లో
ఆప్యాయత వెలుగు జిలుగుల్లో
దాన్యం నిండిన రైతు కళ్ళల్లో

కల్లు వంపే గౌడన్నల ర్యాకల్లో

కళాభారతి కన్న బిడ్డల్లో

విప్లవవీరుల బాటల రవికిరణాల్లో
బడిపరుగుల్లో గుడి నీడల్లో
పెద్దల జాడల్లో నడిచిననాపల్లె
నా కోటారీ కొమ్మల
చిగురులకు సైతం కానరానంత
దూరంగా భారంగా
పరిగెత్తి పరిగెత్తి అలసిసొలసి
నిద్రాణమై ఎత్తుభవనాల్లో
గాజు గోడల్లో
కళాపి చల్లని ముంగిలిలో
ఎదిగి ఒదిగి పండిరాలిన పత్రాల్లో నిలిచి
గుండెలవిసేల ఒంటరినై
చితిమంటలసాక్షిగా  రోదిస్తున్న..

నా పల్లెను చూసి
శిథిలజీవినయి జీవిస్తున్న మౌన సాక్షినైనా
జ్ఞాన యోధుల నేస్తాన్ని
నేను మీ రాలచెట్టును

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *