పుడమిటివి జనసాహిత్యం
ఓరుగల్లు అక్షర దిక్కార స్వరం

పొట్లపల్లి శ్రీనివాసరావు
9849254078
హనుమకొండ
మౌనంగా నిలిచిన గదిలో
ప్రశ్నలతో నాలుగు గోడలు
హృదయం నిండా కన్నీటి బరువు
ఏ దారి తొక్కలో తెలియని కాళ్లు
ఆశ ఒకవైపు చీత్కారం మరోవైపు
ప్రేమ ఒకవైపు లేమి ఒకవైపు
కంటి నిండా దిగులు కడుపులోకలవరం
నిర్ణయం ఏదైనా గుండెను కోసే కత్తిలా
తప్పొప్పుల నిగ్గుతేల్చ
ఈ కవితకు శక్తి చాలదు తల్లీ
గాయమైన హేయమైన
భారము మోసేది నీవే తల్లీ
న్యాయాన్యాయాల తీర్పు కాదు
మాటల్లో సాంత్వన చేకూరాలి
దారి ఏదారి ఎంచుకున్న విలువైనదే
చట్టాలను ఒప్పించే ఆరోగ్యానికి లోబడి
నీవిప్పుడు ఒంటరి కాదు నీ వెనుకే
ఒక సమూహం నడుస్తుంది చూడు
నాలుగు రోడ్ల కూడలిలో
నీవు ఒక వెలుగు రేఖవుతావు చూడు
నీ అడుగే ఒక నూతన తీర్పు
రేపటి ఉదయానికి సంతకం