పట్టభద్రుల ఓటర్ల నమోదును ఉద్యమంలా చేపట్టాలి-జంగా రాఘవరెడ్డి*

 

 

ఎలకంటి నరేష్ తెలంగాణ బ్యూరో చీఫ్ పుడమిటివి

వరంగల్–నల్గొండ–ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రక్రియను విజయవంతం చేయాలని తెలంగాణ స్టేట్ ఆయిల్‌ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా జంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ… పట్టభద్రుల ఓటర్ల నమోదుపై పార్టీ శ్రేణులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, అర్హులైన ప్రతి పట్టభద్రుడిని గుర్తించి ఓటరుగా నమోదు చేయించేలా కృషి చేయాలన్నారు. ఓటర్ల నమోదు ప్రక్రియపై పట్టభద్రులకు అవగాహన కల్పిస్తూ, నమోదు కార్యక్రమాన్ని సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాలని కోరారు.

వరంగల్–నల్గొండ–ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామ్‌రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి విజయానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

పార్టీ శ్రేణులందరూ ఐక్యంగా పనిచేస్తూ, అర్హులైన పట్టభద్రులందరికీ ఓటు నమోదు ప్రక్రియలో సహకారం అందించాలని జంగా రాఘవరెడ్డి కోరారు. పట్టభద్రుల ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి గ్రామంలో నాయకులు, కార్యకర్తలు చొరవ తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *