నువ్వు నిజంగ మా రుద్రమ్మవ్వే

 పుడమి టివి కవిత్వం

నాగబెల్లి జితేందర్ సామ్రాట్  ఎడిటర్ ఇన్ చీఫ్

ఏపుగా పెరిగే పంట

ఎదగకుండా అడ్డంకి అయ్యిందని
పచ్చనిగడ్డిని నిప్పులు చేసింది

మురిపిస్తూ మూతెడుమందు
కలుపును కాసింత సేపులోనే
మాడేటట్లు చేసి
రైతుకు ఊరట నిచ్చింది
ఎప్పుడంటే అప్పుడు నీకు నేనేనంటూ

అటుకేక్కిదాక్కుంది.
పండినపంటకు గిట్టుబాటు రాక

చేసిన అప్పులు తీర్చలేక మందిమాటలతో
బతకలేక చద్దామనుకుంటే
నేను లేనా అనుకుంటూ
అటుకుమీదున్న
మందు కాసింత కడుపులో పడి దేహమంత
కాల్చి పచ్చని కుటుంబాన్ని
నిప్పులపాలు చేసింది,
భారాన్ని మోయలేక
బతుకును చాలీంచాలనుకునే రైతన్నకు
దయ్యమై ఇంట్లోనే పడివున్నా
గడ్డిమందు తాగి

పోయిన పానాల మీద లెక్కలెవ్వరికి తెలుసు,
సచ్చినోళ్లు అవమానంతో
సంపబడ్డోళ్ళు

అందరికిఅన్నం మెతుకులై
ఆదరణలేని నా దేశ ఎన్నముఖలయినోళ్లు

వాళ్ళ సావు ఎవడికి అవసరం
కంపెనోడి బలుపుకు బలం ఇచ్చేటోళ్లు ఉండగా
నోరువిప్పని సంఘసేవకులండగా

పంటకు అడ్డంకి అనుకుంటే
పచ్చిగడ్డిని కలుపు మొక్కల్ని
కోడవిలితో ఏరేయ్యాలని
నిలబడి
మట్టిని మాడ్చి మనుషుల్ని మింగే మహమ్మారి మీద
ఒక్క గొంతు దేశం పిక్కటిల్లెల
నినదించింది
పారాక్వాట్ గడ్డి మందు
ఈ దేశం నుండి తరిమెయ్యమని
కాదు కాదు
భూమిపైన కానరాకుండ చేయ్యమని
ఆ ఒకేఒక్కమాట
పార్లమెంట్ ను కదిలించింది
అందరిలో ప్రశ్నలై ఉదయించింది
నిషేధం విధించే విధంగా
దేశనేతలను కదిలించింది.

నాడి పట్టుకొని పానాలు పొసే

చేతులు కావడం వల్లనేమో
పానం విలువ తెలిసిన మనిషి కాబట్టే కావచ్చు
రైతన్నల పానాలు పోకుండా
రక్షణ కవచమై నిలబడింది
మహిళల ఆరోగ్యం మీద
ఈదేశ ప్రజల హక్కుల మీద
కాజీపేట కోచ్ ఫ్యాక్టరి కోసం
ఓరుగల్లు గడ్డపై విమానం ఎగరాలని
పోరాటలకు పురుడు పోసిన

విద్యావంతులను కన్న ఈ నేలపై
పరిశ్రమలు వర్ధిల్లాలని
ఇక్కడిమనుషుల కోసం
రేపటి భవిష్యత్ కోసం
అక్షరాలలో ప్రశ్నల కావ్యంగా కనిపించి
దేశం ముందు నిలబెట్టింది.
ఈ మట్టికోసం తొంబైఏళ్ల వయసులో సైతం బరిగీసి
నిలబడిన కాకతమ్మ
పుత్రిక వీరత్వాన్ని హద్దుకొన్న వారసత్వమై
డాక్టర్ కావ్యగ కనిపిస్తున్న

నువ్వు నిజంగా మా రుద్రమ్మవే
తల్లీల ఈనేలను ప్రేమిస్తున్న
మా ఓరుగల్లు మట్టిబిడ్డవే
నా దేశ త్రివర్ణ పతాకంలో రెఫరెఫలాడే మహిళా శక్తివే
ప్రజల గొంతుకులని డిల్లిలో వినిపిస్తున్న

మా వరంగల్ నాయకత్వానివే.
మా అందరి ఆడబిడ్డవే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *