ఒకరిని మోసం చేయాలనే గుణం మాత్రం చాలప్రమాదకరం

మధన్న మాట

గాడిపల్లి మధు సీనియర్ జర్నలిస్ట్

నెంబర్ : 9440146261

ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉంటే అదే మనకు ఐశ్వర్యం ఐస్క్రీమ్ తిన్నా కరిగి పోతుంది తినకపోయినా కరిగి పోతుంది జీవితం కూడా అంతే నీవు మళ్ళీ పుడుతావో లేదో కూడా తెలియదు టైం టు టైంకి తినండి పడుకొండి ఎక్కువ ఆలోచించకండి ఆరోగ్యాలు జాగ్రత్త.

అబద్దాలతో బతకడం అలవాటు పడిన వారికి నిజం చేదుగా అనిపిస్తుంది నక్కలా కుక్కలా వేషం వేయవచ్చు కానీ కుక్కలా విశ్వాసంగా ఉండలేరు కొంతమంది మనుషులు కూడా అంతే మంచిగా నటించ వచ్చేమో కానీ వాళ్ల స్వభావం ఎప్పటికీ మారదు

మనుషుల్ని నమ్మడం తప్పు కాదు కానీ గుడ్డిగా నమ్మడమే తప్పు ఎందుకంటే ఈరోజుల్లో ముసుగు వేసుకున్న మనుషులే ఎక్కువ మనసున్న మంచి మనసులు తక్కువ .

ధనవంతుడు సముద్రం లాంటివాడు ఒకరి దాహం కూడా తీర్చలేడు గుణవంతుడు బావిలాంటివాడు ఊళ్లో అందరి దాహం తీరుస్తాడు సంపాదించడం

అంటే కేవలం డబ్బులు మాత్రమే కాదు విలువైన మనుషుల జీవించడమే ఎవరు అందుకోలేనినంతగ సంపాదించినట్లు కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని గట్టెక్కించే వారిని సంపాదించాలి ఆపదలో ఉన్నప్పుడు మనల్ని ఆదుకునే వారిని సంపాదించాలి

బాధలో ఉన్నప్పుడు మనలో ధైర్యాన్ని నింపే వారే నిజమైన ఆత్మీయులు ధర్మబద్ధమైన జీవన విధానంతో నలుగురికి సహాయపడటమే అసలైన ఆస్తి మన దగ్గర ఒకరికి సాయం చేసేంత ధనం లేకపోయినా పరవాలేదు ఒకరిని మోసం చేయాలనే గుణం మాత్రం చాలప్రమాదకరం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *