జర్నలిస్ట్ కాలం
మధన్న మాట
గాడిపల్లి మధు-సీనియర్ జర్నలిస్ట్ 19/06/2026

ఊర్లో ఉన్న రాజకీయ నాయకులతో తిరుగుతున్నంత మాత్రాన నువ్వు లీడర్ కావు
ఎందు కంటే నువ్వు వాళ్ళ దృష్టిలో కేవలం చెంచాగిరి మాత్రమే.
భయపడుతూ బ్రతికితే బ్రతుకంతా బానిసత్వమే
తెగించి బ్రతికితే నీ చివరి శ్వాస వరకు నీకు నువ్వే రాజువి.
జీవితం అనేది వద్దనుకుంటే పోయేది కాదు రాసుకుంటే వచ్చేది కాదు
జీవితం ఒక రంగస్థలం నీవు నేను అందరం పాత్రధారులం
రాసేవాడు పైన ఉన్నాడు నటించే వాళ్ళు మనతో ఉన్నారు.
తగ్గి బతుకు కానీ తలదించుకుని బ్రతకకు
పౌరుషంగా బతుకు కానీ పిరికివాడిగా కాదు.
ఉన్నంతలో తిను కానీ పిసినారిగా బ్రతకొద్దు
సాయం చేయకున్న పర్వాలేదు
కానీ మోసం చేయవద్దు
అవసరాలకు సంపాదించు కానీ డబ్బే జీవితం అనుకోవద్దు.
కష్టం వస్తే కన్నీళ్లు తుడవడానికి ఎవడు రాడు కానీ నువ్వు పడిపోతే చూసి నవ్వడానికి ఊరంతా వస్తారు.
ఒకరి సాయం కోసం ఎదురు చూడకు నీ కాళ్ళ మీద నిలబడి నీ చేతలతో నీ తలరాతను మార్చుకో
తోడు కోసం వెతికేవాడు తోలుబొమ్మ అవుతాడు ఒంటరిగా పోరాడే వాడు ఒక చరిత్ర అవుతాడు.
నీ గెలుపుని నువ్వే నిర్మించుకో ఒకరి అండ చూసుకోని కాదు
లక్ష్యం కోసం పనిచేస్తున్నప్పుడు పిచ్చివాడిలా కనిపిస్తావు కానీ గెలిచాక గొప్పవాడిలా అనిపిస్తావు.