ఎంవిఆర్ భవనం నుండి
పుడమిటివి జనసాహిత్యం
నాగబెల్లి జితేందర్ సామ్రాట్
ఎడిటర్ ఇన్ చీఫ్ పుడమిటివి ఎంవిఆర్ మానవ వికాస రచనలు పబ్లికేషన్స్
పక్క ఊరికి రాఘవులు దొర పోతాన అనగానే వీరనాగులుకి ఎగిరిగంతేయాలనిపించింది. చంద్రయ్యకేమో లోపట వణుకుడు పుడుతాంది. దొర ఇంట్లో లేకుండా వుంటే. వీరుగాని ఎవ్వారం ఎట్లా ఉంటదో తెలుసు.అసలు దొర వీరుగాన్ని ఈశ్వరికి ఓనగాయలు తెంపియ్య మనుడెందో. ఇయ్యాల్నే ఊరికి పోవుడేందో అర్ధం కాక జుట్టంతా పీక్కుంటూ గాబర పడుతాండు.ఒరేయ్ వీరుగా దొర లేనప్పుడు మనం ఈడ ఎందుకు సెప్పు, ఏమన్న పొతే మనమీదనే దొంగతనం అంటగడుతరు.ఎల్లి పోదాం పదా అన్నడు, అరేయ్ సెంద్రిగా ఏమి మాట్లాడుతానవురా నోరు తెరవకు నీఅయ్యా … ఎమన్నా మాట్లాడితే ఈడనే తంతా నిన్ను దెబ్బకు సెంద్రయ్య మౌనంగా ఉండి పోయిండు.
గుర్రపు బండి పటాకుల లోపలికి వచ్చి దొర ఇంటి గల్వ ,ముందు ఆగింది.దొరసాని, రాఘవులు దొర,ఇద్దరు బండి ఎక్కిళ్ళో లేదో ఇగ వీరనాగులు పూనకం వచ్చినట్లు ఎగురురుడు మొదలు పెట్టిండు. వీరు ఎగురుడు చూసి,సెంద్రయ్యకు వణుకుడు పుట్టింది.
ఒరేయ్ వీరు ఎగరడం ఆపరా
ఎందుకు ఆపాలిరా సెంద్రిగా
నీ కాల్మోక్త ఎవరైనా చూస్తే సచ్చుడేరా
ఉకోర ఊకో. దొరనే కదరా ఈశ్వరికి ఓన గాయలు తెంపియ్యమన్నదీఅవును మరి జడసుకుంటానవెందిరా వద్దురా వీరు ఈడి నుండి బయటకు పోదాం. అరేయ్ వినవేందిరా .. ఏమి కాదు నువ్వు ఇంట్లకు పోయి నువ్వు పిలవరా ఈశ్వరిని
నేను పిలవరా వీరు
పిలవరా సెంద్రిగా.. నాకు కోపం దెప్పియ్యకు
సరే.అంటూ దర్వాజా కాడికెళ్ళి … సిన్న దొరసాని సిన్న దొర సాని అంటూ తలుపులు గొట్టిండు.
ఎవడురా పిలిచేది మంత్రాలు వళ్లిస్తూ రాఘవులు తల్లి తులసమ్మ తలుపులు తీసుకుంటూ బయటకు వచ్చింది.ఏందిరా సెంద్రిగా ఇప్పుడేమి పనిరా అంది తులసమ్మ..
సిన్న దొరసానికి ఓన గాయాలు కావాలని సెప్పింది. అగో ఆడవున్నా వీరుగాన్ని ఓనగాయాలు తీసుకరమ్మన్నాడు దొర.అందుకే అమ్మా
అది అడుగుడు బాగున్నది మీరు వచ్చుడు బాగున్నది ఇళ్ళు మైలపడతి ఎవలు పడితే వాళ్ళు ఇంట్లఅడుగుపెట్టుడేనా
నా మనవరాలు రాదుపో అన్నది.
ఇంట్లో సెత్తిరికోళ్ల మంచమీద కూసుండి. బాపమ్మ ఎవరితోనో మాట్లాడతాంది అని దబుక్కున లేచి దర్వాజకాడికి వచ్చింది ఈశ్వరీ,
బాపమ్మ నేనే వాళ్ళను రమ్మన్న బాపు కూడ సెప్పిపోయిండు…
ఏమి కాలంరా ఇది పిల్లలు ఎట్లా తయారవుతాళ్ళు
గా ఓనగాయలేందో తెంపుకరమ్మను… నువ్వు ఇంట్లకు పో బిడ్డా బాపమ్మ
నేను సెట్టు కాడికి పోతనే
నువ్వు అక్కడికెందుకు ఆడపిల్లలు బజారుకు పోవద్దు బిడ్డా నేను పోతనే బాపమ్మఅంటూ ఈశ్వరి అలిగింది
ఒరేయ్ సెంద్రిగా
ఆ సింతసెట్టు కాడికి మనువరాలిని తీసుకెళ్లి జప్పున తీసుకరావాలి అన్నది తులసమ్మ,
సరే నమ్మ అని వీరనాగులు, ఈశ్వరి, సెంద్రయ్య పటాకులు దాటి సెట్టు కాడికి వచ్చిళ్ళు
వీరనాగులు అందిన కాడికల్ల ఓనగాయాలు తెంపి ఈశ్వరి ఓనికొంగులో వేస్తున్నడు.
అగో గా కొమ్మ సాటున ఉన్న ఓనగాయలు కావాలి అవి నెనే తెంపుతా అన్నది. ఈశ్వరి
అమ్మ నువ్వెట్ల తెంపుతావు ఇప్పటికి ఇవి సరిపోతాయి ఇంటికి పోదాం అన్నాడు సెంద్రయ్య
లేదు లేదు నేనే తెంపుతా అని మంకు పట్టుపట్టింది ఈశ్వరి
వీరు నన్ను పైకి ఎత్తుతే నేను ఓనగాయలు తెంపుతా
వద్దు దొరసాని నేను ఎన్ని కావాలంటే అన్ని తెంపిస్తా లేదు లేదు నేనే తెంపుతా అన్నది సెంద్రయ్యకు భయం వేస్తంది. వీరనాగులు లోపల తెగ సంబరపడుతాండు
సరే దొరసాని అని ఒక్క వుదుటున ఈశ్వరి ని పైకి ఎత్తి భుజాల మీద నిలబెట్టిండు. ఈశ్వరి సెట్టు కొమ్మలను పట్టుకొని ఓనగాయలు తీసుకొని ఓని ఒడిలో వేస్తుంది. అగో గప్పుడే ఈశ్వరి,ఈశ్వరి అంటూ తులసమ్మ సెట్టు వైపుకు వస్తాంది. బాపమ్మ వచ్చేది చూసిన ఈశ్వరి వీరనాగులు భుజాల మీదినుండి కిందకు దూకబోయింది. అంతే వీరనాగులు రెండు సేతులతో ఈశ్వరిని కింద పడకుండా గట్టిగా పట్టుకున్నాడు.ఈశ్వరి వీరనాగులు చాతిపైన ఒరిగిపోయింది.
ఈశ్వరిని వీరనాగులు ఎత్తుకున్నది చూసిన తులసమ్మ సెట్టుకాడికి వచ్చి ఒరేయ్ వీరుగా సిన్న పిల్లను పట్టుకొని ఏమిచేస్తున్నావురా ఇది కలికాలమురా ఏమి నాశనగాలమురా దొర రాని నీ సంగతి సెప్పుత అంటూ ఇంకా వాని సేతుల్లోనే ఉంటావానే కిందికి దిగు అని మనవరాలును గట్టిగా అన్నది. ఐన ఈశ్వరి వీరనాగులును గట్టిగా పట్టుకున్నది
ఏమనిషివే కిందికి దిగు అన్నది మీ బాపుతోని సెప్పి మీ సంగతే చూస్తా ఇంటికి పా అన్నది. బాపమ్మ ఇగ నీకు తెలిసింది కదాబాపమ్మ,బాపుకి సెప్పు. నేను ఏమి చేసిన అని సెప్పుతావు. సెప్పు. మన అమ్మాయిని ముట్టుకున్నడన ఏమి మాట్లాడుతున్నావు. ఇంట్లోకి వచ్చి పసుపు నీళ్లతోని స్నానం చేసి మైల తియ్యాలే అన్నది అయితే వీరు ముట్టుకోవడం వల్ల నేను మైలపడ్డ కదా…తులసమ్మ, అవునే, అన్నది
ఏ వీరు ఇగ నువ్వు నన్ను ముట్టుకుంటే నాకు మైల పడ్డది అంట ఇగ నేను వాళ్ల మనిషిని కాను. ఇప్పుడే నన్ను లగ్గం చేసుకొని మీ ఇంటికి తీసుకపో అన్నది ఈశ్వరి. ఆమే మాటలకు వీరనాగులుకు ఏమి నోరు పెగలడం లేదు. ఈశ్వరి ఇంటికిపో అన్నడు. ఇంటికా ఎందుకు అన్నది ఈశ్వరి. ఇంతల సేంద్రయ్య వణుకుంటా సిన్న దొర సాని నీ కాళ్ళు మొక్కుతా తులసమ్మ సెప్పినట్టు ఇంటికి పో అన్నది అరేయ్ సెంద్రిగా ఏమి తెలవని నా బిడ్డని బయటకు తీసుకవచ్చి పిల్లను ఇట్లా జేత్తారురా వామ్మో లేదు తులసమ్మ అట్లా ఏమి లేదు….ఇక్కడ ఏమిజరగలేదు
సిన్న దొరసాని నువ్వు ఇంటికి పో అన్నడు. వీరనాగులు, గట్టిగా దగ్గరకు తీసుకుని నేను ఉన్నాను కదా నువ్వు ఇంటికి పో నిన్ను లగ్గం చేసుకునేది నేనే దొరసాని అని ప్రేమగా అరచేతిని నెత్తిమీద పెట్టి అనడంతో, తులసమ్మకు ఇంకా కోపం వచ్చింది. ఏ ఈశ్వరి ఇంటికి పోదాం పదా అన్నది. అయినా కదలక పోవడంతో,ఈశ్వరి సేతులు పట్టుకుని నెమ్మదిగా వీరనాగులు పటాకుల లోపల వదిలిపెట్టిండు.
