ఎంవిఆర్ భవనం నుండి
పుడమిటివి జనసాహిత్యం
నాగబెల్లి జితేందర్ సామ్రాట్
ఎడిటర్ ఇన్ చీఫ్ పుడమిటివి ఎంవిఆర్ మానవ వికాస రచనలు
ఒకప్పుడు స్వతంత్ర్య రాజ్యాలుగా స్వయం పాలకులుగా విరాజిల్లిన నేటి భౌగోళిక భారత దేశాన్ని తురస్కరులు, ఆంగ్లేయుల ఆక్రమణకు గురై తమ అస్తిత్వాన్ని కోల్పోయాయి. ఆంగ్లేయులు కుట్రపూరితంగా రాజ్యాలను కూల్చి పాలకులై భాషపైన సంపదపైన తమ ఆధిపత్యాన్నికొనసాగించారు. నేరుగా తమ రాజ్యాన్ని ఆంగ్లేయులకు అప్పగించని హైదారాబాద్ రాజ్యం స్వతంత్ర దేశంగా పాలన సాగించినప్పటికి పరిపాలన ముఖ్య నిర్ణయాలన్నీ లండన్ కేంద్రంగా బ్రిటీష్ రూల్స్ తో కొనసాగాయి.
దక్షిణ భారత దేశం, ఉత్తర భారతదేశం భాష పరంగా మత విశ్వాశాల పరంగా, సంస్కృతి, ఆహరపు అలవాటులల్లో సైతం భిన్నమైన జీవితమే.దక్షిణ భారత దేశం శైవ క్షేత్రాలకు నిలయంగా, అడ్డబొట్లు సాంప్రదాయం కనిపిస్తుంది. ఉత్తర భారత దేశంలో వైష్ణవ క్షేత్రాలు నిలువు బోట్ల సంప్రదాయం కనిపిస్తుంది. శైవమతం వైష్ణవ మతాలతో పాటు జైన బౌద్ధ మతాలు దేశంలో ఎక్కువగా ప్రజలు ఆచరించారు.చిన్న చిన్న రాజ్యాలు, సామ్రాజ్యాలు, ఏలిన భారత దేశంలో జరిగిన యుద్దాలు శైవ, వైష్ణవ విశ్వాశాలను ఆచరించేవారిమధ్య, జరిగినవే.
దక్షిణ భారత దేశంలోని డెక్కన్ పీఠభూములుగా కొలిచే తెలంగాణ హైదరబాద్ రాజ్యం శైవ, వైష్ణవమతానికి, జైన ,బౌద్ధ మతాలకు నిలయంగా చెప్పవచ్చు.
హైదరబాద్ రాజ్యం తెలంగాణతో పాటు,మహారాష్ట్రలోని గుల్బర్గా, నాందేడు వరకు తమ పాలనను కొనసాగించింది. ప్రపంచ దేశశాలల్లో ఒక సంపన్న దేశంగా పరిగణించబడింది. నిజాం పాలకులు ,అభివృద్ధి తో పాటు,ప్రజలపైన సాగించిన ఆకృత్యాలకు వ్యతిరేకంగా ప్రజల నుండితిరుగుబాటుమొదలయ్యింది.
మరో వైపు అనేక రాజ్యాలను ఆక్రమించుకొని పాలన చేస్తున్న బ్రిటిష్ పాలకులు ప్రజలపై చేస్తున్న అరాచకాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆంగ్లేయుల పై అలుపెరుగని పోరాటం కొనసాగుతున్న సమయంలో,ఆంగ్లేయులకు వ్యతిరేఖంగా ఉద్యమాలు చేస్తున్న కాంగ్రెస్ కమ్యునిస్టు, ఆర్యసమాజ్ నాయకులు నిజాం వ్యతిరేక పోరాటానికి నాయకత్వం వహించారు.
నిజాం నవాబ్ పాలనతో రజాకార్ల ఆకృత్యాలకు ప్రజలు బలి అయ్యారు. ప్రతిపల్లె తిరుగుబాటు జెండా ఎగురవేసింది. అత్యంత క్రూరుడు పాశవిక ఆలోచన కలిగిన కాశిం రజ్వీ నేతృత్వంలో ఏర్పడిన రజాకారులలో ముస్లింలతో పాటు ఆధిపత్య భావజాలం కలిగిన దొరలు భూస్వాములు , నిజాం ఎంగిలి, మెతుకులకుఆశపడ్డ వాళ్ళు సాధారణ ప్రజలపైన,, నిజాం వ్యతిరేక పోరాటల పైన ఉక్కుపాదం మోపి అనేక అరచాకాలు చేశారు. నిజాం రజాకార్లఆకృత్యాలకు వ్యతిరేకంగా ముస్లింలు సైతం పోరాటం చేసి ప్రాణాలను కోల్పోయారు.
మహిళలపట్ల విచక్షణ రహితంగా ఒంటిపై దుస్తువులు లేకుండా బతుకమ్మ లాడించిన రజాకార్లను తన్ని తరిమెందుకు వీరనారి ఐలమ్మ లాంటి మహిళ శక్తులు పోరాటంలో పాల్గొని కదం తొక్కారు.
తెలంగాణలో ఏ ఇళ్లును కదిలించిన. ఆ పల్లెలు నిజాం రజాకార్ల ఆగడాలకు ఎలా బలి అయ్యాయో రాయబడని చరిత్రలు వెలుగు చూడని చరిత్రలు ఎన్నోవున్నాయి.
నిజాం వ్యతిరేక పోరాటంలో ప్రతి గ్రామంలో బురుజులు ఏర్పాటు చేసుకొని కమ్యూనిస్టులు, ఆర్య సమాజ్ కార్యకర్తలు గ్రామ రక్షక దళాలతో గ్రామములోకి రజాకార్లను అడుగుపెట్టకుండా నిరంతరపోరాటం చేశాయి. కాంగ్రెస్, కమ్యూనిస్టు, ఆర్యసమాజం నిజాం వ్యతిరేక పోరాటంలో ప్రజలను కదిలించడంలో ప్రముఖ పాత్రపోషించాయి.
ప్రతి పల్లెల్లో రజాకార్లు సృష్టించిన అరాచకాలతో ప్రజలు జీవించే పరిస్థితి లేకుండా పోయింది. అనేక మంది ప్రజలు నిజాం వ్యతిరేక పోరాటంలో తమ ప్రాణాలను కోల్పోయారు.
నిజాం సైన్యం అంటే ముస్లిములె కాదు గ్రామాల్లో నివశించే ఆధిపత్య భావజాలం కలిగిన ముస్లిం లు కానటువంటి దొరలు,నిజాం రాజకార్లకు అండగా వుండి వారికి మద్దతు ప్రకటించడం, నిజాం వ్యతిరేకత పోరాటంలో పాల్గొన్న ఉద్యమ కారులను అణచివేయడంలో కీలక పాత్ర పోషించారు.
కడవెండి, వీరాబైరాన్ పల్లి ,పర్కాల, ప్రాంతాలు మరో జలియన్ బాగ్ కు మించి తలపించేలా ఉద్యమకారుల నెత్తుటీతో తడిచిపోయాయి.అనేక మంది ఉద్యమకారులను నిజాం సైన్యం అతి దారుణంగా చంపివేసింది.ప్రజల మాన ప్రాణాలను దోచుకుంది. ప్రజలు ఉవ్వెత్తున ఉద్యమాలు చేయడానికి కారణమయ్యింది.
ఒక వైపు ఆంగ్లేయుల పాలనపై ప్రజల పోరాటాలు గాంధీజీ నేతృత్వంలో కొనసాగుతుండగా అల్లూరి భగత్ సింగ్,సుభాస్ చంద్రబోస్ లాంటి వాళ్ళే కాకుండా స్వాతంత్ర్య పోరాటానికి అంకితమై తమ పేర్లను కూడా ప్రకటించుకోని యోధులు ఉద్యమంలో నేలకొరిగిన కిరటీలు ఎందరో ఉన్నారు,
స్వాతంత్ర్యం మా జన్మ హక్కు అని పసి పిల్లల నుండి వృద్ధుల వరకు స్వాతంత్ర్య పోరాటంలో పిడికిళ్లు ఎత్తడంతో బ్రిటీష్ పాలకుల్లో వనకు పుట్టింది ప్రజల పోరాటాన్ని తట్టుకోలేని రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యం తోక ముడిచి ఈ దేశం నుండి పారిపోయారు. ఆగష్టు పదిహేను 1947 లో స్వాతంత్ర్యం పొంది సంబరాలు జరుపుకుంటున్న సమయంలో తెలంగాణలో నిజాం అరాచకాలు పెరిగాయి ఇంకా దారుణంగా ఉద్యమకారులను అణచివేశారు.
ఒక వైపు దేశం మొత్తం త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుంటే మరో వైపు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి ఎత్తుపట్టిన వారిని చంపడం, చిత్ర హింసలకు గురిచేయడం జైళ్లలో బంధించడం చేస్తూ రజాకార్లు తమ అరచాకాలను క్రూరత్వాన్ని ఇంకా ఎక్కువగా కొనసాగించారు. దీంతో తమ మాన ప్రాణాలకు రక్షణలేక పోవడంతో పోతే ప్రాణాలు పోతాయి నిజాం రాజ్యాన్ని పారద్రోలాలని ప్రజలు సామూహికంగా నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నారు.
నిజాం సైన్యం, రజాకార్లు ప్రజల పోరాటాన్ని అణిచివేసే ప్రయత్నం చేసిన ఇంకా ఉద్యమం ఉదృతం అవుతున్న తరుణంలో అప్పటికే స్వతంత్ర దేశంగా ఏర్పడిన పాకిస్తానులొ విలీనం చేయాలనే కుట్రను అమలు చేసే అవకాశం వుందని గ్రహించిన భారత ప్రభుత్వం తమ సైన్యంతో ఇక్కడి పోరాటయోధులకు మద్దతు ప్రకటించి నిజాం సైన్యాన్ని రజాకార్లను తిప్పికొట్టింది.
సర్దార్ వల్లభాయి పటేల్ చేసిన సైనిక చర్యతో నిజాం లొంగిపోయాడు. హైదరబాద్ స్వతంత్ర రాజ్యంమైన,ఆ క్షణమే భారత దేశంలో కలిసి పోయింది.
తెలంగాణ విమోచనమా, విముక్తిన, విద్రోహమా, స్వాతంత్ర్య దినోత్సవమా అనే అంశంపై అనేక చర్చలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.
నిజాం రాజ్యంపైన పోరాటం చేసిన ప్రజలు, ఉద్యమకారులు నిజాం పాలననుండి విముక్తి పొంది స్వాతంత్ర్యంసాధించుకున్నారు. హైదారాబాద్ రాజ్యాన్ని నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ స్వాతంత్ర్య పోరాట యోధులు నాయకుల ఆలోచన మేరకు భారత దేశంలో విలీనం చేశారు.
బ్రిటీష్ పాలన నేరుగా లేని తెలంగాణ ప్రాంతానికి ఆగష్టు 15 న స్వాతంత్ర్యం రాలేదు పదమూడు నెలల తర్వాత తెలంగాణ నేల నిజాం నుండి స్వేచ్చ గాలులు పీల్చుకుంది. తెలంగాణ ప్రతి బిడ్డకు తమకోసం ప్రాణాలు అర్పించిన యోధుల సాక్షిగా సెప్టెంబర్ 17 స్వాతంత్ర్య దినోత్సవమే. ప్రజాపాలన దినమే.
ఉత్తరభారతం లోని ఉత్తరప్రదేశ్, డిల్లి,ఆంధ్ర రాయల సీమ ప్రాంతాలు బ్రిటీష్ ఏలుబడిలో వుండటం వల్ల అక్కడ పోరాటాలు చేస్తున్న కాంగ్రెస్,కమ్యునిస్టు ఆర్యసమాజ్ నాయకులు తెలంగాణలో నాయకత్వం వహించారు. మొత్తం భారత దేశం పోరాటంలో ఉత్తర భారతీయుల నాయకత్వం కొనసాగింది. హైదారాబాద్ రాజ్యంలో పోరాటాలకు ఆంధ్ర ప్రాంత నాయకులు ప్రజలు ఉత్తర భారతీయుల నాయకత్వం వుండటం తెలంగాణ ప్రజలు నాయకులు భారత్ లో విలీనం కావడానికి భారత్ దేశం ఐక్యతకు తోడయ్యి సర్దార్ వల్లభాయ్ పటేల్ కు భారత ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించి సుస్థిర భారత దేశాన్ని నిర్మించడంలో తెలంగాణ ప్రజలు కీలక పాత్ర పోషించారు
తెలంగాణ ప్రజల ఉద్యమ స్ఫూర్తి ఇప్పటికీ దేశంలో కొనసాగుతుంది అందుకే సెప్టెంబర్ పదిహేడు స్వాతంత్ర్య దినమే ప్రజల పోరాట ఫలితమే ప్రజాపాలనకు వేసిన అడుగులే. తెలంగాణ ప్రజల పోరాటమే, ప్రపంచంలో అగ్రరాజ్యాంగ విరాజిల్లిన నిజాం రాజ్యం, ప్రజా పోరాటలకు తలోగ్గి ఇక్కడి నుండి నైజాం పాలకులు పారిపోయారు. భారతదేశంలో కలిసిపోయిన తెలంగాణ సెప్టెంబర్ 17న స్వాతంత్ర్య వేడుకలను జరుపుకోని పల్లె పెల్లేనా త్రివర్ణ పతాకాన్ని ఎగురా వేశారు. ఈ నేలకు స్వాతంత్ర్య దినం ఆగస్టు 15,కాదనేది సత్యం సెప్టెంబర్ 17 స్వాతంత్ర్య జెండా ఎగురవేసి భారత దేశంలో కలిసిపోయింది.
అందుకే సెప్టెంబర్ 17 తెలంగాణ అమరుల ఆశయాలు సిద్దించిన స్వాతంత్ర్య దినమే. మన పోరాటయోధులకు నివాళులు అర్పిస్తూ ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగురవేద్దాం. మన అమరులకు ఆశయాలనుఎలుగెత్తి చాటుదాం.

