కవి నేత్రం పుడమిటివి జన సాహిత్యం
పొగాకు రజిత పిజిటి కొత్తగూడ
అమ్మగర్భగుడిలో సేదతీరిన
అనుబంధమై జన్మ జన్మల
పేగుబంధమై రక్తసంబంధమై
అన్నా చెల్లెల అనురాగమై ఆత్మ బంధమై
విడతీయనిఆత్మీయరాగమై
ధరణికి తోబుట్టువులై
పగలు భాస్కరుడై నిశకి తమ్ముడై
నిమిళిత నేత్రాలై వెలుగు జిలుగులనెడి
మమకార కాంతులను కురిపించే కనురెప్పలై
సోదరి మనసెరిగి పాదాలను కందనీయక
నేనున్నాను నేనే వున్నానంటూ
ప్రేమను కురిపిస్తూ
తల్లిదండ్రులను మైమరిపిస్తూ
నీశీధిలో వెలుగులు చిందిస్తూ
బావమెల్గాంచుతు
సౌభాగ్యాన్ని ఆకాంక్షిస్తూ
అంతులేని ఆనందాన్ని అందిస్తూ
బరువెక్కిన
మనస్సులను సంబాలలిస్తూ
జన్మజన్మల నీడై నా వెంట వస్తూ
మాగుండెకొవెలలో కొలువు దీరుతూ
తోబుట్టువులను ఆశీర్వదిస్తున్న
అను జన్ములారా
అన్నలార తమ్ముళ్ళారా
మీకు కుసుమ కోమల
మనస్సులతో ఆత్మీయ
రాఖీ వందనాలు వందనాలు
