ఎంవిఆర్ భవనం నుండి
పుడమిటివి జనసాహిత్యం
వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ
నాగబెల్లి జితేందర్ సామ్రాట్
ఎడిటర్ ఇన్ చీఫ్ పుడమిటివి న్యూస్ ఎంవిఆర్ పబ్లికిషన్స్
కన్నతల్లినే కదా బిడ్డలభవిష్యత్ కోసం తల్లడిల్లెది. ఎదిగిన బిడ్డలు వెన్నముఖలై నిలబడుతారని కలలు కనేది ,తన గర్భగుడిలో తొమ్మిది నెలలు మోసి పురటి నొప్పులు భరించి భరించి ఊపిరి పోయిన ఫర్వాలేదని చావు అంచులను ముద్దాడి నీకు ఊపిరి పోసి నువ్వు పుట్టగానే అన్ని మర్చిపోయి. ఏలోటు రాకుండ ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపిందో, జన్మకు కారణమైన తండ్రి కష్టాన్ని కంటికి రెప్పల కింద దాచుకొని కన్నీళ్లను దిగమింగుకొని బిడ్డలకు ఆకలి అనేది తెలియ కుండా తమ పేగులు వడిపెట్టిన లెక్కలేని రోజులు కడుపు మాడ్చుకొని జీవించింది కాసింత తెలిస్తే బాగుండు.పిల్లలకు అర్ధం కాకుండా సమాజానికి తెలియకుండా ముఖంలో చిరునవ్వు చెదరకుండా పిల్లల కోసం బతుకుతున్నది .
వ్యసనాల భారినపడి, మద్యం,మత్తుపదార్థల కొరల్లో చిక్కుకొని రోడ్ల మీద రక్తంపారి, కళ్ళముందే ఊపిరి ఆగిపోతే, ఏ గంజాయో, కోకైనో,నరనరానా డ్రగ్స్ ఇంజక్ట్ చేసుకొని, మనిషన్నదే మరచి మంచానపడి ప్రాణాలు వదిలి చెట్టంత కొడుకు కాష్టంలో కట్టెల్లో కాలి బూడిదయి, మట్టిలో కలిసిపోతే ఆ తల్లి కడుపుకోతను కన్నీటి దారను ఎవరు ఆపగలరు తన ఎత్తుకొడుకు నేలరాలిపోతే ఆ తండ్రి బరువుఎక్కిన గుండెను ఎవరు ఓదార్చ గలరు.
దేశవ్యాప్తంగా డ్రగ్స్ సేవించి రోడ్డు ప్రమాధాలకు గురై లక్షలాది మంది యువకులు తమ యవ్వన జీవితాన్ని మట్టిపాలు చేస్తున్నారు. తమ బిడ్డల్లో ఒకరిని దేశ రక్షణ కోసం కని వీరుడిగా నిలబడు శత్రువుకు తలవంచకుండా వీరమరణం పొందు బిడ్డా అని తన పురుటి నొప్పులను దేశసేవకై త్యాగం తల్లులు అదే వీర మాతలకు పురుడు పోసిన,పంజాబ్ రాష్ట్రంలో డ్రగ్స్ భారిన పడి తమ బిడ్డలు తమ కళ్ళ ముందే ప్రాణాలు వదిలిస్తుంటే ఆ తల్లుల రోధన ఎవరు ఆపగలరు, పంటల సాగులో,ముందుకొచ్చిన యువరైతులకు పురుడు పోసిన హర్యాన రాష్ట్రం మత్తులో ఊగి పోతుంటే తమ తల్లుల కన్నీటి వేదనతో పాటు పచ్చని పొలాలు దుఃఖ సంద్రమై గొల్లున ఏడుస్తున్నాయి.
తెలంగాణలో డ్రగ్స్ భారిన పడి యువశక్తి నిర్వీర్యం అయిపోతుంటే ప్రభుత్వ యంత్రాంగం పోలీస్ శాఖ నిరంతరం నిఘాపెట్టిన, ఉక్కుపాదం మోపిన,చాపకింద నీరుల నగరాలు, పట్టణాలు పల్లెల్లో విస్తరిస్తూనే వున్నాయి. “విద్యావంతుల మేధస్సుకు’ చెదలు పట్టిస్తున్నాయి. ఇప్పుడుబడిలోకి చొరబడి “బాల్యాన్ని’ చిదిమెస్తున్నాయి. ఇది ముందు ముందు అందరిని ఆవహించి కొద్దీకాలంలోనే ప్రమాద డంకను మోగించి ఎన్ని ప్రాణాలను తీస్తుందో, ఎంతమంది జీవితాలను బలి తీసుకుంటుందో తెలియదు.అసలు మత్తులో ఎలాంటి దురాఘాతాలకు పాల్పడుతారో ఎన్ని కటుంబాలు వీధిన పడుతాయో ఆ భయంకరమైన రాబోయే రోజులనుతలచుకుని,ఊహిస్తేనే ఒళ్ళు జలదరిస్తుంది. అలాంటి పరిస్థితులు రాకుండా వరంగల్ పోలీస్ శాఖ తెలంగాణ రాష్ట్రంలోనే గొప్ప నిర్ణయానికి శ్రీకారం చుట్టింది
వీరనారి చాకలి ఐలమ్మ వీరత్వాన్ని చాటిన నేల అనేక ఉద్యమాలకి పురుడు పోసిన జనగామ జిల్లాలో మహిళచైతన్యంవెలకట్ట లేనిది సార వ్యతిరేక ఉద్యమాలు రజాకార్లను తన్ని తరిమిన పోరాటంలోనే కాదు,ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏ పోరాటం జరిగిన వేదికగా నిలిచిన జనగామ జిల్లా నుండే డ్రగ్స్ రహిత సమాజం కోసం వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేత, ఆలోచనలను జనగామా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రత్యేక చొరవ తీసుకొని దేశంలోమహిళలు డ్రగ్స్ నివారణపై భాద్యతతీసుకునే విధంగా ఒక కొత్త ఆలోచనకి పురుడు పొశారు.ఈ ప్రయోగం తెలంగాణాలోనే కాదు దేశంలోనే మొదటిది కావచ్చు.
పసిపిల్లల ఆరోగ్యం నుండి మొదలుకుంటే మధ్యాహ్నం భోజనంతో పాటు అనేక అంశాలాల్లో పల్లెల్లో పట్టణాలల్లో మహిళలు చురుకుగా సేవలు అందిస్తున్నారు. బడిలో కాలేజీలో ఎక్కడ ఏమి జరిగిన మహిళలకి సమాచారం వెంటనే చేరుతుంది. మహిళా శక్తిని ఏ శక్తి ఆపలేదు కదా మహిళలల బాగ స్వామ్యంతో డ్రగ్స్ రహిత సమాజం కోసం ముందుకిసాగితే జనగామ ఉమ్మడి వరంగల్ కే కాదు దేశానికి ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుంది.
వరంగల్ కమిషనరేట్ పరిధిలి 26లక్షల మంది జనాభా వుంటే 3వేల మంది పోలీసులు ఉన్నారని అధికారిక లెక్కలు చెప్పు చున్నాయి. ఇగ రాష్ట్రంలో దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చెప్పవచ్చు.. ఇప్పటికే కుటుంబ తగాదాలు, భూసమస్యలు, రాజకీయ గొడవలు, దొంగతనాలు, హత్యలు,, హత్యయత్నాలు అనేక సమస్యలు వీటికి తోడు విస్తరిస్తున్న డ్రగ్స్ మాఫియా బానిసవుతున్న యువత అందరిని కలచి వేస్తుంది..
వీటిని అరికట్టాలంటే ఒక్క పోలీస్ వ్యవస్తనో అధికారికారిక యంత్రాంగామో సరిపోదు.అలాఅయితే అరికట్టడం అసాధ్యమే. “ప్రజలు భాగస్వామ్యం’ కావాలి కుటుంబాలు ముందుకు రావాలి,తమ పిల్లల ప్రవర్తనపై నిఘా పెట్టాలి నిరంతరం పిల్లల పట్ల అప్రమత్తంగా వుండాలి. అన్ని రంగాల్లో విస్తరించిన మహిళల చేతుల్లోకి డ్రగ్స్ నివారణ చర్యలు వెళ్ళితే, వేగవంంతంగా సక్సెస్ కావచ్చు, ఇది ఉద్యమంల సాగాలి అప్పుడే డ్రగ్స్ రహిత సమాజం ఏర్పడుతుంది.
మహిళలను బాగస్వామ్యం చేస్తూ డ్రగ్స్ రహిత సమాజం కోసం కొత్త ఆలోనతో ముందుకు సాగుతున్న పోలిష్ కమిషనర్ శ్వేత, జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కు ప్రజలు సంఘీభావం ప్రకటిస్తున్నారు. మీ ఆలోచనలు సక్సెస్ కావాలి యువశక్తి తెలంగాణ అభివృద్ధికి దేశాభివృద్ధికి ఉపయోగపడాలని పుడమిటివి కోరుకుంటుంది.

