పొగాకు రజిత కవయిత్రి
పిజిటి కొత్తగూడ
ఒక్క సిరా చుక్క
లక్షల మెదల్ల కదలిక
కాళోజికి లేదు ఏ అంతమిక
విను వీధిలో విహరించిన మచ్చు తునక
అది పూర్వపరాలకలయిక
మండే అగ్నికనిక
విసిరింది జ్వాలలిక
అన్యాయాన్ని తునా తునక
బేషజాలం లేదు
బేధ భావం లేదు
చేతిగీత కాదు
కర్మఫలం లేదు
కాల్పానిక కవిని కాను
యధార్థ వాదిని నేను
అవినీతికి అంతం నేను
మాతృ భాషకు రూపం నేను
సత్యజీవ స్వరూపం నేను
అక్షరాల అమ్ముల పొదిలో
ఆయుధమై
నాగొడవకు ఆద్యంతం
వెన్నెముకనై
