
నాగబెల్లి జితేందర్ సామ్రాట్
ఎడిటర్ ఇన్ చీఫ్ పుడమిటివి
ఉమ్మడి వరంగల్ జిల్లాకే కాదు తెలుగు రాస్ట్రాలల్లో మీడియారంగంలో నిబద్దతగా పనిచేస్తూ అంచలంచెలుగా ఎదుగుతూ తెలంగాణ రాష్ట్ర ఐ అండ్ పిఆర్ అడిషనల్ డైరెక్టర్ గా పదోన్నతి పొందిన డిఎస్ జగన్ సార్ కు అభినందనలు.
ప్రస్తుతం మహబూబాద్ జిల్లాలోని ఉగ్గంపల్లి మారుమూల పల్లె లో జన్మించిన జగన్ సార్ తన తల్లిదండ్రులు తమ పిల్లలు విద్యారంగంలో ఎదగాలన్న కోరిక,ఉన్నత స్థాయిలో నిలబడాలన్న తపన జగన్ సర్ నెరవేర్చారు.కనీస సౌకర్యాలు, వసతులు లేని మారుమూల పల్లెనుండి విద్యావంతుడిగా ఎదిగి ప్రభుత్వ ఉద్యోగంలో చేరారు.
ఉద్యోగ జీవితం ప్రారంభం నుండి ఐ అండ్ పిఆర్ లో తన విధులను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ ప్రత్యేకగుర్తింపు పొందారు. మీడియా రంగానికి, జర్నలిస్టులకు,సాంస్కృతిక విభాగం కళాకారులకు ఆత్మీయనేస్తంగా కుటుంబ సభ్యుడిగా వున్నారు.
అందరి మనిషిగా ఎవరిని నొప్పించకుండా ముక్కు సూటిగా మాట్లాడటం జగన్ సార్ ప్రత్యేకత పాలసి విషయాలల్లో తన వాళ్ళు పరాయి వాళ్ళు అని భేదం లేకుండా విధులని నిర్వర్తించడం వల్లనే, జగన్ సార్ సమర్థవంతమైన అధికారిగా గుర్తింపు పొందారు.
ఆంధ్రజ్యోతిలో పనుచేస్తున్న కాలం నుండి పాతికెళ్ళ పరిచయం వున్నా జగన్ సర్ అడిషనల్ డైరెక్టర్ కావడం అభినందనీయం.
జగన్ సర్ కు అభినందనలు