ఎంవిఆర్ భవనం నుండి
పుడమిటివి న్యూస
సిఎం రేవంత్ రెడ్డికి రాఖీ కడుతున్న మంత్రి సురేఖ
నాగబెల్లి జితేందర్ సామ్రాట్
ఎడిటర్ ఇన్ చీఫ్ పుడమిటివి ఎంవిఆర్ మానవ వికాసరచనలు
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తున్న దేవాదాయశాఖ మంత్రి కొండ సురేఖ మంత్రి పదవి పై ఉత్కంఠకు తెరపడనుందా!మీడియా లో వస్తున్న కథనాలకు వాస్తవాలకు సంబంధం లేదా. అసలు కొండా సురేఖ మంత్రి పదవి ఉంటుందా పోతుందా అనే అంశంపై ఎందుకు రచ్చ జరుగుతుంది స్వంత పార్టీ ఎమ్మెల్యేలే బాహ్యంగా ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు. ఇంత జరుగుతున్న కేబినెట్ మంత్రులు ఎందుకునోరు విప్పడం లేదు..కొండా దంపతుల ఏకైక పుత్రిక సుష్మిత పటేల్ రాష్ట్ర ముఖ్యమంత్రి పై నోరు జారడంపై వెనక స్వంత పార్టీ నేతలే వున్నారా ఇవి రాజకీయ విశ్లేషకులను సాధారణ ప్రజలను తోలుస్తున్న ప్రశ్నలు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా పరకాలలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం,జరిగిన భారీ బహిరంగ సభలో స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పై జరగబోయే ఎన్నికలల్లో రేవూరికే టికెట్ అని ప్రకటించారు. స్థానిక ప్రజలకి పార్టీ కార్యకర్తలకు కొత్త ఉత్సవాన్ని తెప్పించేందు మాట్లాడారు.ఇది ఏ నేతఅయినా మాట్లాడుతారు. మాట్లాడక పొతే ఒక రకంగా పార్టీకార్యకర్తలను నిరుత్సహానికి గురిచేసినట్లువుతుంది.దీనిపై కొండా సుష్మిత పటేల్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై పరకాల టికెట్ పై మాటలు జారింది.ఆమే స్థాయికి మించి మాట్లాడటం పై కాంగ్రెస్ శ్రేణులు జీర్ణించుకోలేకపోయాయి. ,
కొండా రాజకీయ వారసురాలిగా ఎదుగుతున్నసుస్మిత పటేల్ మాట్లాడటం ఇది కొత్త కాదు, గతంలో సైతం ముఖ్యమంత్రి పై మాటలు జారిన సుస్మితపటేల్ పై కొందరు కాంగ్రెస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. మళ్ళీ ముఖ్యమంత్రినే టార్గెట్ చేసి సుస్మిత పటేల్ మాట్లాడిన మాటలపై కాంగ్రెస్ పార్టీ హైకమెండ్ సీరియస్ గా తీసుకుంది. తెలుగురాష్ట్రలల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. కాంగ్రెస్ పార్టీ జాతీయఅధ్యక్షుడు ఖర్గే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ లు తెలంగాణ లో జరుగుతున్న రాజకీయ గందరగోళం పై తీవ్రంగాచర్చించినట్లు సమాచారం. తెలంగాణ విషయంలో నేరుగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, సి ఎల్ పి నేత రాహుల్ గాంధీలు,ఎప్పటికికప్పుడు సమాచారం సేకరించి స్పష్టత ఇవ్వనున్నట్లు సమాచారం.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీగా సోనియా గాంధీకి ప్రజలు మద్దతుప్రకటించినప్పటికీ, అంతర్గత రాజకీయాలు, సీట్ల పంపిణిలో జరిగిన అవకతవకలు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించిన కొందరు ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకొని పదేళ్ల పాటు భూస్థాపీతం చేశారు. ప్రాంతీయ పార్టీగా ఎదిగిన టిఆర్ ఎస్ పార్టీ తమకు ఎదురు ఎవరు లేరని భావిస్తున్న సమయంలో ప్రధాన రాజకీయ పార్టీలైన బిజెపి నుండి బండి సంజయ్, కాంగ్రెస్ నుండి రేవంత్ రెడ్డి లు టిఆర్ ఎస్ ను గద్దెదించే బలమైన శక్తులుగా ఏదిగారు. బండి సంజయ్ అనివార్యకారణాల వల్ల అధ్యక్షపదవి నుండి తప్పుకున్న తర్వాత రేవంత్ రెడ్డి మాట్లాడే ప్రతి మాటకు ప్రజల మద్దతులభించింది. పార్టీబలోపితానికి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా
మేడారం సమ్మక్క సారలమ్మ తల్లుల గద్దెల నుండి మొదలైన పాదయాత్రలో తమ అక్కలని ప్రకటించుకున్న సీతక్క, సురేఖలతో కలిసి నడిచిన అడుగులు కాంగ్రెస్ పార్టీ బలోపితానికి పునాదులు పడ్డాయి. రేవంత్ రెడ్డి ప్రతి మాటలు కేసిఆర్ పాలనకు చరమగీతం పాడాయి. కాంగ్రెస్ పార్టీని ప్రజలు భజానఎత్తుకొని
గెలిపించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే కాకుండా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొండా సురేఖ మంత్రి గా పనిచేశారు. కొండా మురళికి ప్రజల్లో క్రేజ్ వుంటుంది గతంలో వున్నా శాయంపేట నియోజకవర్గం నుండి పరకాల నియోజకవర్గంగా మారిన తర్వాత సైతం కొండాకుంటుంబానికి బలమైన ప్రజల మద్దతువుంటుంది ఆ నియోజకవర్గం ప్రజలు ఇప్పటికి తమ కుటుంబ సభ్యులుగా భావిస్తారు. పరకాలను వదిలివెళ్లక పోవడానికి ప్రజలతో కొండా మురళికుటుంబానికి వున్నా ఆత్మీయ బంధాలు కావచ్చు, బి ఆర్ ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలో వరంగల్ తూర్పు నుండి గెలిచినప్పటికీ వాళ్ళ చూపులు పరకాల వైపే అనేది స్థానిక ప్రజలు వినిపించే వాధన మళ్ళీ కాంగ్రెస్ టికెట్ స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డీకే అని సిఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం ప సుస్మిత పటేల్ జీర్ణిచుకోలేక పోవడం ఇదే అదనుగా స్వంత పార్టీ నేతలే సుస్మితతో ఏకంగా ముఖ్య మంత్రి పైనే ఆరోపణలు చేసే పరిస్థితికి తీసుక రావడం జరిగిందని రాజకీయవిశ్లేషకుల అంటున్నారు.
రాజకీయాల్లోకి కొండా మురళి, సురేఖలు అడుగు పెట్టిన తర్వాత గీసుగొండ మండలపరిషత్ అధ్యక్షురాలు నుండి మొదలుకుంటే రాష్ట్ర మంత్రిగా కొనసాగాడం ఏ ఐ సిసి నేతగా ఎదగడం దివంగత వై ఎస్ ముఖ్యమంత్రి గా వున్నా కాలంలో సురేఖ కాంగ్రెస్ పార్టీలో గొప్ప శక్తి గా నిలబడింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొండా మురళి ఎదుగుదలకు తనవంతు సహకారం అందించారు.వైఎస్ మరణం తర్వాత కొండాకు గడ్డు పరిస్థితులు ఏర్పడ్డ జంకకుండా నిలబడ్డారు
తన స్వంత పార్టీలో అంతర్ యుద్దాన్ని ప్రత్యర్థి పార్టీతో అనేక ఇబ్బందులు తట్టుకుని ఓటములను ఎన్నో చవి చూసినప్పటికీ అనేక బెదిరింపులకు బెదర కుండా ఎవరికీ వెన్ను చూపని నేతగా ప్రజలకు వెన్నుదన్నుగా ఉందనేది ప్రజల నమ్మకం. ఎంత స్థాయిలో వున్నా ఆమేలోని సాధారణ సంప్రదాయజీవితమే ఆమెను మహిళా నేతగా నిలబెట్టింది.
కేబినెట్ మంత్రిగా కొండా సురేఖ తన శాఖపరమైన విధులను సమర్థవంతంగా నిర్వహిస్తున్న క్రమంలో తమ ఓఎస్డి సుమంత్ వ్యవహారశైలి ఆమెను ఇరకాటంలో పెట్టడానికి ఒక కారణమని చర్చ సాగుతుంది. సుమంత్ నేరుగా అనేక ప్రభుత్వ అంతర్గత విషయాలలో జోక్యం చేసుకోవడం, పలువురిని బెదిరించడంపై స్వయంగా ముఖ్యమంత్రి అడ్డుకట్ట వేయమని చెప్పిన పెడచెవిన పెట్టి వెనకేసుకుని రావడం వల్లనే కాంగ్రెస్ పార్టీలో, తన శాఖలో ఇబ్బందులు ఏర్పడ్డాయి, కేబినెట్ మంత్రి గా హోదా వున్నా సిఎంఓ కార్యాలయం కనుసైగలతోని తన శాఖలోని అనేక ఫైల్లు తనకు తెలవకుండ ముందుకు సాగడం మంత్రి ని అవమాణించినట్లేననే అభిప్రాయం కొందరు కేబినెట్ మంత్రులల్లో సీనియర్ నేతల్లో వుంది. ఇది గతకొంత కాలం నుండి అంతర్గత చర్చసాగుతుంది.
ముఖ్యమంత్రి పై కొండా సురేఖ కూతురు సుస్మిత పటేల్ మాట్లాడిన తీరుపై కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకున్నప్పటికీ అధిష్టానం అనేక అంశాలు పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం. గడిచిన రెండున్నరెళ్ల కాలంలో తెలంగాణలో జరుగుతున్న అనేక అంశాలను తమ పార్టీ ఇంటిలిజెన్సీ ద్వారా సమాచారం తీకున్నట్లు సమాచారం. కొండా సురేఖపై వేటు వేస్తె పార్టీకి జరగబోయే నష్టాన్ని, పరిణామలని కూలంకషంగా చర్చించినట్లు తెలుస్తుంది.
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేతో కొండా సురేఖ మాట్లాడిన తర్వాత బుధవారం రాత్రి వరకు కాంగ్రెష్ అధిష్టానంతో చర్చలు జరిగాయి . సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కాంగ్రెస్ వాదులు,కొండా సురేఖకు అండగా నిలబడి అధిష్టానానికి తమ వాదనలు వినిపించినట్లు సమాచారం. కొండా సురేఖ బిసి సామాజిక వర్గం నాయకురాలు కావడం,ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా కుటుంబానికి వున్న ప్రజల మద్దతును దృష్టిలో పెట్టుకొని,నిర్ణయం తీసుకొవాలని బలమైన వాధన వినిపించినట్లు తెలుస్తుంది.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు తన తండ్రి పైన బి ఆర్ ఎస్ పార్టీ పైనమాట్లాడిన తీరు పై సైతం చర్చ సాగిందనేది పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ తన కూతురును కంట్రోల్ లో పెట్టాల్సిన బాధ్యత సురేఖ కొండా మురళి పైన వుందని . కాంగ్రెస్ పార్టీ నేతలు తమ అభిప్రాయాలను బలంగ వినిపించారు
కొండా సురేఖ గతంలో కాంగ్రెస్ పార్టీలో వున్నప్పుడు కొందరు వ్యక్తుల అభిప్రాయాలని పరిగణలోకి తీసుకొని మంత్రి పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో తమ సీనియార్టిని సిన్సియార్టీని కోల్పోయారానేది నగ్న సత్యం. మళ్ళీ కొన్ని తప్పిదాలు సరిదిద్దుకోక పోతే,ఇలాగే కొనసాగితే కొండా రాజకీయ జీవితం ప్రశ్నర్దాకంగ మారవచ్చు.
ఇంత చర్చ జరుగుతున్న గత కొంత కాలం నుండి తన శాఖలో జరుగుతున్న అవమానాలని భరించిన కొండా సురేఖ తమ కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలకి కట్టుబాట్లకు విరుద్ధంగా వెళ్ళలేదు. కాంగ్రెస్ పార్టీని వీడెందుకు ఇష్టపడలేదు అధిష్టానం ముందు గతంలో తాను కాంగ్రెస్ పార్టీని వీడి తప్పు చెశానని. మళ్ళీ అలాంటి తప్పిదాలు చేయలేనని చెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
మరోక అంశం సైతం చర్చకు వచ్చిందని తెలుస్తుంది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కేబినెట్ లో కొనసాగుతున్నప్పటికీ రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి పైన కాంగ్రెస్ పార్టీ పైన అనేక సార్లు మాట్లాడిన ఇంత రచ్చకాలేదని, ఉన్నత సామాజిక వర్గం కావడమే కారణమని అదే సురేఖ విషయంలో మీడియా, సొంత పార్టీ వాళ్ళు రచ్చరచ్చ చేశారని ఇది బిసిలను అవమానిస్తున్నారనే చర్చ జరిగింది.సురేఖ పై చర్యలు తీసుకుంటే రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగ బిసి ఓట్లపై కాంగ్రెస్ పార్టీపై ప్రభావం పడే అవకాశం వుందనే విషయం చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది.
స్వంత పార్టీలో,ప్రతి పక్షాలల్లో ప్రజల అందరి మధ్య జరుగుతున్న చర్చ సురేఖ మంత్రి పదవి పోతుంది. త్వరలో ప్రకటన రావచ్చు అనేది అందరిలో జరుగుతున్న చర్చ దానికి అధిష్టానం సున్నితంగా తెరదింపింది ముఖ్యమంత్రి హోదానుతగ్గియ్య కుండా, రేవంత్ రెడ్డి గౌరవానికి భంగం కలగకుండా సురేఖను భాద్యతయుతంగ వ్యవహారించాలని సీరియస్ గా మందలిస్తూ,మంత్రి పదవిని తొలగించకుండా తమ అధినేత్రి సోనియా గాంధీ నిర్ణయం మేరకు అధిష్టానం సమస్యను పరిష్కరించిందని సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు.
రక్తసంబంధం కాకపోయినా, అక్క తమ్ముళ్ల బంధాన్ని ఎవరు వేరు చేయగలుగుతారు, ఇంత చర్చలో రాఖీపండుగ రావడం దీన్ని అధిష్టానం పరిస్కారానికి వేదికగా మార్చి అక్క తమ్ముళ్లను కలిపింది, ఇది అనేక మంది మెదళ్లకు అంతుబట్టని అంశంగామారిపోయింది. బ్రేకింగ్ లు ఇయ్యాలని హన్మకొండ కొండలోని సురేఖ ఇంటిముందు, మంత్రులక్వాటర్స్ దగ్గర కాంగ్రెస్ భవనం దగ్గర నిరంతరం పనిచేసిన నిఘానేత్రాలకు అప్పటికే వార్త మసాలాలను కలిపి పెట్టుకున్న,మీడియాకు ఆశవాహుల ఆలోచనలపై నెత్తిమీద తాటిపండు పడ్డట్లయ్యింది. సురేఖ మంత్రి పదవి సేఫ్ అనేది సున్నితంగా అధిష్టానం చెప్పకనే చెప్పినట్లు అయ్యింది. దీనిమీద రచ్చ చేసిన వాళ్ళ,బెట్టింగ్ కట్టిన వాళ్లు తేరుకోలేని షాక్ గురైఅయ్యారని కాంగ్రెస్ వాదులు అంటున్నారు.
ఎక్కువ స్వేచ్ఛ ఉంటుందనుకున్న కాంగ్రెస్ పార్టీలో అధిష్టానం బలోపీతం, స్ట్రాంగ్ నిర్ణయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతిస్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీలో చెల్లదు ఇక అనే సంకేతం ఇచ్చినట్లు వుంది.

