పుడమిటివి ఆంధ్రప్రదేశ్ న్యూస్
నాగబెల్లి జితేందర్ సామ్రాట్ ఎడిటర్ ఇన్ చీఫ్ పుడమిటివి
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ కు, సీనియర్ జర్నలిస్ట్, టెక్నోక్రాట్ డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస వర్మ తాను రచించిన ‘స్థితప్రజ్ఞుడు’ పుస్తకాన్ని బహుకరించారు.
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ రాజకీయ జీవనయానం, ఆయన రాజకీయ ప్రస్థానంలోని వివిధ ఘట్టాలు, నాయకత్వ లక్షణాలను సమగ్రంగా సంకలనం చేస్తూ డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస వర్మ ఈ పుస్తకాన్ని రచించారు.
శ్రీ వైయస్ జగన్ను కలిసిన వారిలో రచయిత డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస వర్మతో పాటు ఆయన సతీమణి లక్ష్మీ రాధ, ఎంవీఎస్ నాగిరెడ్డి, రమేష్, కొవ్వూరి త్రినాథరెడ్డి, సుబ్బారావు తదితరులు ఉన్నారు.
