జాతీయ రహదారి 163జీ పనులపై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

పుడమిటివి

 

ఎలకంటి నరేష్ తెలంగాణ బ్యూరో చీఫ్

 

వరంగల్, అక్టోబర్ 24:

జాతీయ రహదారి 163జీకి సంబంధించిన పనుల పురోగతిపై వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద శనివారం జిల్లా కలెక్టరేట్‌లో సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జాతీయ రహదారికి సంబంధించిన పనుల ప్రస్తుత స్థితి, వివిధ శాఖల సమన్వయం, పనుల అమలులో ఎదురవుతున్న సమస్యలు తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. పనులను వేగవంతం చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

ఈ సమీక్ష లో జిల్లా ఫారెస్ట్ అధికారి నిఖిత, అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎల్ కిషోర్, డియార్వో విజయలక్ష్మి,వరంగల్ నర్సంపేట ఆర్డీవోలు సుమ ఉమారాణిలు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *