పుడమిటివి జనసాహిత్యం

నడిపి ✍️
బాయికాడి నర్సింలు
తాడ్వాయి కామారెడ్డి జిల్లా
పోన్ నెంబర్:- 9010781792
నన్ను అడిగింది నేలతల్లి
నా గాయాల లెక్క తెలుసా అని.!
నిశ్శబ్దంగా తలవంచాను
ఆ గాయాల్లో నా వాటా ఉందని!
నాకు చెబుతూ
కన్నీరు పెట్టుకుంది నేలతల్లి .!
తనకు గాయాలు చేస్తుంది పరాయివాళ్లు కాదని,
తన ఒడిలో ఆడే తన పిల్లలే అని
వాళ్లు ఎదగడం కోసం
తన పొత్తికడుపులో కత్తులు గుచ్చుతున్నారని!
నా బిడ్డలు ఎంత అమాయకులో అంటూ కన్నీరు చిందిస్తోంది
చెట్లు నరికి నీడలను వెతుకుతున్నారని!
మేం మనుషులం కదా మారలేమని
ఆ తల్లిని ఓదార్చిలేక
నా కన్నీలతో కవిత రాసుకున్న