
పుడమి టివి న్యూస్
అంగన్వాడీ కేంద్రాలకు ఒక పూట నిర్వహణ కోసం జీవో వెంటనే విడుదల చేయాలని కోరుతూ మహిళా అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖా మాత్యులు సీతక్క గారిని హైదరాబాదులోని ప్రజా భవన్ లో తెలంగాణ అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్( BRTU ) రాష్ట్ర అధ్యక్షురాలు నల్లా భారతి నేతృత్వంలో ప్రతినిధి బృందం కలిసి వినతి పత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రిగారు మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం జాయింట్ మీటింగ్ పెడతామని, ఎలాంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని తెలిపి సానుకూలంగా స్పందించారు.
ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు నల్ల భారతి మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాలలో 5 సంవత్సరాలలోపు పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్య అందిస్తున్నామని, ప్రభుత్వ పాఠశాలవలె అంగన్వాడి కేంద్రాలకు కూడా ఒక పూట నిర్వహించుకోవడానికి జీవో జారీ చేయాలని, మే నెలలో THR ఇవ్వడానికి అనుమతి ఇచ్చి మే నెల మొత్తం సెలవులు ఇవ్వాలని కోరారు. 2024, 25 సంవత్సరంలో రిటైర్మెంట్ అయిన టీచర్స్ అండ్ హెల్పర్స్ కు రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్స్ సౌకర్యం వెంటనే చెల్లించాలి అని , ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ అండ్ ఆయా పోస్టులను వెంటనే భర్తీ చేయాలని,రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ టీచర్స్ కి ఇచ్చిన మాట ప్రకారం 18 వేల వేతనం అమలు చేయాలని కోరారు. సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని మరోసారి విజ్ఞప్తి చేశారు.
మంత్రిగారిని కలిసిన అనంతరం మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో JD అడ్మిన్ అకేశ్వర్ రావు గారు, JD మోతి గారిని కలిసి సమస్యల గురించి చర్చించడం జరిగింది. మంత్రి గారిని అధికారులను కలిసిన వారిలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి V. రమా తార, కోశాధికారి M. వేదవతి, రాష్ట్ర నాయకులు ఎల్లమ్మ, రజిత, శిరీష ఉన్నారు.