పుడమి టివి న్యూస్
వై ఎస్సార్సిపి నేతల ఆరోపణ
గాడిపల్లి మధు ఆంధ్ర తెలంగాణప్రతినిధి -7801088509
టీడీపీ నేతలు గుండాల్ల అరాచకంగా ప్రవర్తిస్తున్నారని వైఎస్ ఆర్ సిపి నేతలబృందం విజయవాడలో ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠాక ఫిర్యాదు చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం వద్దే వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి, ఎంప్లాయిస్ అండ్ పెన్షనర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడారు.
ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాట్లాడుతూ :నామినేషన్ల చివరి రోజున కూడా వైయస్ఆర్సీపీ అభ్యర్థులను అడ్డుకున్న కూటమి ప్రభుత్వం. అడ్డుకున్నదని ఆరోపించారు- నామినేషన్లు వేయకుండా వైయస్ఆర్సీపీ నాయకులకు హౌస్ అరెస్టులు చేశారని అన్నారు.మరోవైపు అధికార పార్టీ నేతలకు యథేచ్ఛగా అవకాశం.కల్పించారని తెలిపారు- పోలీసుల్లో కొందరు, రెవెన్యూ అధికారుల్లో కొందరు తెలుగుదేశం కార్యకర్తల్లా పనిచేస్తున్న పరిస్థితివుందని అన్నారు –
నామినేషన్ పత్రాలు చించడం, అభ్యర్థులపై దాడులు చేయడం, కేసులు పెట్టడం.. ఇదేనా స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణ అని ప్రశ్నించారు.- సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత కూడా 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల సమస్యకు కేవలం నాలుగు ప్రాంతాల్లోనే పరిమిత పరిష్కారం కనిపిస్తుందని అన్నారు- నామినేషన్ వేయలేకపోయిన అభ్యర్థులకు చివరి గంటలో సర్క్యులర్ ఇచ్చి పోలీసు ఎస్కార్ట్ కల్పిస్తామనడం కంటి తుడుపు చర్యేనని చెప్పారు –
వైయస్ఆర్సీపీ తరఫున టీడీపీ వారే నామినేషన్లు వేయడం, వారే ఉపసంహరించుకోవడం.. ఫేక్ నామినేషన్లతో ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.- బీఫారాలు సమర్పించేందుకు కొత్త గడువులు పెట్టి అభ్యర్థులను గుర్తించి వేధించేందుకు అధికార యంత్రాంగాన్ని ఉపయోగిస్తున్నారని ఆరోపించారు- చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజినిని పోలీసులు నెట్టివేయడం.. ప్రతిపక్ష నేతలపై దౌర్జన్యాలకు నిదర్శనం.- ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలి..
కోరారు.పోలీసు ఎస్కార్ట్, రక్షణ కల్పించి అర్హులైన ప్రతి అభ్యర్థికి నామినేషన్ వేసే అవకాశం కల్పించాలి.డిమాండ్ చేశారు.
– ఎన్నికల అక్రమాలకు సంబంధించిన సాక్ష్యాధారాలతో ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు
– 2029లో వైయస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమాలపై విచారణ జరిపించి బాధ్యులను చట్టం ముందు నిలబెడతామని అన్నారు.
ఎన్నికల్లో గెలవాలంటే ప్రజలకు చేసిన మంచిని చెప్పాలి.. అడ్డదారులు తొక్కి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయకూడదని అన్నారు
– తెలుగుదేశం పార్టీని రద్దు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కోరామని తెలిపారు.
-మూడు రోజుల నామినేషన్ ప్రక్రియలో ఎదురైన అడ్డంకులను దృష్టిలో పెట్టుకుని నామినేషన్ల గడువు పొడిగించాలని కోరారు – ఎన్నికల కమిషన్ ఇప్పటికైనా స్వతంత్రంగా పనిచేయాలని డిమాండ్ చేశారు
సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత కూడా నామినేషన్ల అడ్డంకులు తొలగకపోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని అన్నారు – దాడులు చేసింది కూటమి నేతలు.. దెబ్బలు తిన్నది మా కార్యకర్తలు!అని అన్నారు నామినేషన్ పత్రాలు చించేశారు, అభ్యర్థులపై దాడులు చేశారు, పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నది మా వాళ్లే. అలాంటప్పుడు అధికారుల ఏకపక్ష నివేదికల ఆధారంగా ఎలా నిర్ణయాలు తీసుకుంటారని ప్రశ్నించారు – ప్రతిపక్ష నాయకులను హౌస్ అరెస్టులు చేసి, అధికార పార్టీకి స్వేచ్ఛ ఇవ్వడమేనా ప్రజాస్వామ్యమా – మా అభ్యర్థులు నామినేషన్లు వేయకూడదా అని నిలదీశారు.నామినేషన్ కేంద్రాల్లో పత్రాలు చించేవారిపై చర్యలు ఎందుకు ఉండవని అన్నారు
– నామినేషన్ కేంద్రాలనే రిగ్గింగ్ కేంద్రాలుగా మార్చేశారని అన్నారు వైయస్ఆర్సీపీ పేరుతో నామినేషన్లు వేయడం, వారే ఉపసంహరించుకోవడం వంటి ఫేక్ నామినేషన్ల వ్యవహారాన్ని ఎన్నికల కమిషన్ తక్షణమే అరికట్టాలి. – గంటన్నర ముందు సర్క్యులర్ ఇచ్చి ఎస్కార్ట్ కల్పిస్తామంటే ఎలా సాధ్యం? గ్రామాల నుంచి మండల కేంద్రాలకు చేరుకోవడానికి సమయం కావాలి. అభ్యర్థులకు ముందుగానే రక్షణ కల్పించాలని కోరారు..
– బాధ్యులెవరైనా చట్టం ముందు నిలబడాల్సిందే. ఎన్నికల అక్రమాలపై ఆధారాలు సేకరిస్తున్నాం. 2029లో వైయస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణ జరిపించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు – అడ్డదారుల్లో గెలవాలని చూడకండి. ప్రజలకు చేసిన మంచిని చెప్పి ఓట్లు అడగండి. బ్యాలెట్‌పై నమ్మకం లేక దౌర్జన్యాలకు దిగడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మండి పడ్డారు.
ఈ సందర్భంగా , ఎమ్మెల్సీ: కల్పలతారెడ్డిమాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో హింసాకాండ కొనసాగుతోంది. వైయస్ఆర్సీపీ అభ్యర్థుల నామినేషన్లు చించడం, అడ్డుకోవడం, అభ్యర్థులపై దాడులు చేయడం వెంటనే ఆగాలని కోరారు.- మహిళలపై దాడులు జరుగుతున్నా మహిళా హోంమంత్రి మౌనంగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు మహిళల చీరలు లాగడం, జుట్టు పట్టి ఈడ్చడం, కొట్టడం జరుగుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని అన్నారు
– సుప్రీంకోర్టు ఆదేశాలకే విలువ లేకపోతే ఎన్నికల కమిషన్ ఎందుకు? 19 మున్సిపాలిటీల్లో సమస్యలు ఉంటే కేవలం నాలుగు ప్రాంతాలకే నామినేషన్ల అవకాశం కల్పించడం ఏ విధమైన న్యాయమని అన్నారు
– చివరి గంటలో సర్క్యులర్లు ఇచ్చి న్యాయం చేసినట్లు చూపించలేరు. అభ్యర్థులకు సమయం, రక్షణ కల్పించి నామినేషన్లు వేయించే బాధ్యత ఎన్నికల కమిషన్‌దేనని డిమాండ్ చేశారు .
పోలీసులు ప్రేక్షకుల్లా నిలబడకూడదని . మహిళలపై దాడులు జరుగుతున్నప్పుడు చూస్తూ ఉండటం విధి నిర్వహణ కాదని పోలీసుల తీరుపై అనుమానం వ్యక్తం చేశారు . పోలీసులు చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యతను నిర్వర్తించాలని కోరారు
– న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదని అన్నారు ఎన్నికల కమిషన్‌కు ఆధారాలతో ఫిర్యాదులు చేస్తాం. బాధిత అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు న్యాయపోరాటం కొనసాగిస్తామని చెప్పారు.
నలమారు చంద్రశేఖర్‌రెడ్డి, ఉద్యోగులు, పెన్షనర్ల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు: మాట్లాడుతూ నామినేషన్ పత్రాలు చించేస్తుంటే అధికారులు చూస్తూ ఉండటమేంటి? ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను గుర్తించాలని కోరారు
-పోలీసులతో పాటు టీడీపీ కార్యకర్తలు అడ్డుకుంటున్నా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని అన్నారు అభ్యర్థులను ఒకచోట అడ్డుకుని, మరోచోట అడ్డుకుని, చివరకు గేటు వద్ద నిలువరించడం ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేయడమేనని న్నారు.
ఒక రాజకీయ పార్టీకి కొమ్ముకాసే అధికారులు జాగ్రత్తగా ఉండాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత పోలీసులకు, ఎన్నికల అధికారులకు ఉంది. చట్టవిరుద్ధంగా వ్యవహరించినవారు బాధ్యత వహించాల్సిందే.
–
ఎన్నికల కమిషన్ ప్రకటనలు కాదు.. క్షేత్రస్థాయిలో చర్యలు కావాలి. నామినేషన్లు వేయడానికి వచ్చిన ప్రతి అభ్యర్థికి అవకాశం కల్పించాలి. పత్రాలకు రక్షణ కల్పించి, అడ్డంకులను తొలగించాలని కోరారు
న్యాయంగా పనిచేయండి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ఎన్నికల ప్రక్రియలో జరుగుతున్న అక్రమాలను చూసీ చూడనట్లు వదిలేయడం వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం లేకుండా చేస్తుందని అన్నారు

