పుడమి టివి న్యూస్
జిల్లా కలెక్టర్ శ్రీ భోర్కడే హేమంత్ సహదేవరావు, ఐ.ఏ.ఎస్.
ఎలకంటి నరేష్ పుడమి టివి తెలంగాణ బ్యూరో చీఫ్ -9010451307
ములుగు జిల్లా ఆయుష్ విభాగంలో జాతీయ ఆయుష్ మిషన్ (NAM) కింద పొరుగు సేవల ప్రాతిపదికన 7 పోస్టులను భర్తీ చేసేందుకు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా ఎంపిక కమిటీ ద్వారా నియామక ప్రకటన జారీ చేసినట్లు జిల్లా ఎంపిక కమిటీ నోడల్ అధికారి డా. E. సునీత ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ నియామక ప్రక్రియలో 4 ఆయుష్ వైద్యాధికారులు, 1 ఫార్మసిస్ట్, 1 యోగా ప్రొఫెషనల్, 1 సైకోసోషియల్ కౌన్సిలర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు.
పోస్టుల వారీగా పారితోషికం వివరాలు:
– ఆయుష్ వైద్యాధికారి – 4 పోస్టులు: నెలకు రూ.40,000
– ఫార్మసిస్ట్ – 1 పోస్టు: నెలకు రూ.15,000
– యోగా ప్రొఫెషనల్ – 1 పోస్టు: నెలకు రూ.28,000
– సైకోసోషియల్ కౌన్సిలర్ – 1 పోస్టు: అవసరమైనప్పుడు సేవలు అందించే ప్రాతిపదికన ఒక్కో సందర్శనకు రూ.500. సంవత్సరానికి కనీసం 200 సందర్శనలు ఉండేలా నిబంధనలు వర్తిస్తాయి.
అభ్యర్థులు 01.07.2026 నాటికి 18 నుంచి 44 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన వారికి వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయని తెలిపారు.
దరఖాస్తుల స్వీకరణ
అర్హులైన అభ్యర్థుల నుంచి 26.10.2026 నుంచి 31.10.2026 వరకు, ప్రభుత్వ పని దినాల్లో ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించబడతాయి.
దరఖాస్తులను ములుగు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (IDOC)లోని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలోని ఆయుష్ విభాగంలో సమర్పించాలి.
అభ్యర్థులు దరఖాస్తు ఫారం, అర్హతలు, అవసరమైన ధ్రువపత్రాలు, ఇతర పూర్తి వివరాలను ములుగు జిల్లా అధికారిక వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
“ములుగు జిల్లా అధికారిక వెబ్సైట్” (https://mulugu.Telangana.gov.in)
అభ్యర్థులు నోటిఫికేషన్లో సూచించిన విధంగా స్వయంగా లేదా రిజిస్టర్డ్ పోస్టు ద్వారా దరఖాస్తులను సమర్పించాలి. నిర్ణీత గడువు ముగిసిన అనంతరం అందిన దరఖాస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ పరిగణనలోకి తీసుకోబడవని నోడల్ అధికారి తెలిపారు.
నియామక ప్రక్రియకు సంబంధించిన పూర్తి సమాచారం, అర్హతలు, దరఖాస్తు విధానం, అవసరమైన ధ్రువపత్రాలు తదితర వివరాలను నోటిఫికేషన్లో పరిశీలించాలని సూచించారు.
మరిన్ని వివరాలు మరియు సందేహాల నివృత్తి కోసం ఆయుష్ నోడల్ అధికారి డా. ఈ సునీత – 99084 31655ను సంప్రదించవచ్చని తెలిపారు.

