పుడమిటివి న్యూస్
టి ఆర్ ఎస్ పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత
ఎలకంటి నరేష్ పుడమి టివి తెలంగాణ బ్యూరో చీఫ్ -9010451307
అడవిలో తామే పులులమని అందరూ చెప్పుకుంటారు.. వారిని బంధించే వేటగాడు వచ్చాడనే విషయం గుర్తు పెట్టుకోండని టి ఆర్ ఎస్ పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత అన్నారు.టీఆర్ఎస్ రాజధాని రణభేరి సభ”లో రణభేరి మోగించి మాట్లాడారు.
మానవత్వంతో కూడిన మార్పు హైదరాబాద్ లో రాలేదని టిఆర్ ఎస్ పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత అన్నారు కనీసం తాగునీళ్లు ఇవ్వలేనోళ్లం విశ్వనగరం అని ప్రచారం చేసుకుంటున్నామని అన్నారు
గ్రేటర్ లోని మూడు కార్పొరేషన్లలో టీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని అన్నారుఫేక్ ఎంవోయూలతో వేల కోట్ల పెట్టుబడులు తెచ్చామని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందిని అన్నారు
గతంలో జరిగినకాన్వెస్ట్మెంట్ సమ్మిట్ లలో ఎన్ని పెట్టుబడులు వచ్చాయో శ్వేతపత్రం విడుదల చేయాలి
లేకుంటే డిసెంబర్ లో జరిగే గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ ను అడ్డుకుంటామని హెచ్చరించారు.
నేను ఏదో టైమ్ పాస్ కోసం మనం పార్టీ పెట్టలేదు. ప్రజలకు మంచి చేయాలన్న సంకల్పంతో పెట్టామని అన్నారు రాజకీయాల్లో బీఆర్ఎస్ మేము జంగిల్ కా షేర్ అని అనుకుంటే…కాంగ్రెస్ బబ్బర్ షేర్ అనుకుంటుంది.. బీజేపీ ఇంకేదో అంటుందని హెద్దేవా చేశారు
ఏ రాష్ట్రానికైనా రాజధాని అంటే గుండెకాయలాంటిది. మన రాష్ట్రానికి కూడా హైదరాబాద్ గుండెకాయలాంటిదని అన్నారు అందుకే తెలంగాణ ఉద్యమ సమయంలో హైదరాబాద్ ను యూనియన్ టెరిటరీ చేస్తామంటే ఒప్పుకోలేదని చెప్పారు
మన రాజధానికి 4 వందల ఏళ్ల చరిత్ర ఉంది. చరిత్ర తెలుసుకుంటేనే భవిష్యత్ ను నిర్మించగలమని అన్నారు మన రాష్ట్రంలోని మూడో శాతం అంటే కోటి మంది ఇక్కడే ఉంటారని అన్నారు
ఈ కోటి మందికి మంచి చేసేందుకు టీఆర్ఎస్ పార్టీ ముందుకు వచ్చింది బల్కంపేట్ ఎల్లమ్మ, నాంపల్లి దర్గా, అత్తాపూర్ గురుద్వారా, సెయింట్ జార్జ్ చర్చ్ సాక్షిగా హైదరాబాద్ కు మంచి చేసేందుకు మనం సంకల్పం తీసుకోవాలని కోరారు
మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో సముద్రం ఉందని అనుకుంటున్నాడని కానీ సముద్రం లేని మన నగరాన్ని అప్పట్లోనే నిజాంలు పెర్ల్ సిటీగా మార్చారని చెప్పారు
ఒకప్పుడు పెర్ల్ సిటీగా ఉన్న హైదరాబాద్ ఇప్పుడు ఐటీ ఉద్యోగుల కృషితో ఐటీ సిటీగా మారిందని అన్నారు ప్రపంచంలో హైదరాబాద్ ను ఐటీ సిటీగా మార్చేందుకు ఐటీ ఉద్యోగులు పడిన కష్టాన్ని అభినందిస్తున్నామని అన్నారు కానీ ఏఐ కారణంగా వాళ్ల ఉద్యోగాలు పోయే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు మరి ఐటీ ఉద్యోగుల కోసం ఓ పాలసీ అంటూ ఉండాలి కదా అని అన్నారుమన దేశంలోనూ రాష్ట్రంలోనూ వాళ్ల కోసం ఒక పాలసీ అంటూ లేదని ఐటీ ఉద్యోగులకు మేలు చేసేందుకు మా పార్టీ కచ్చితంగా పోరాటం చేస్తుందని కవిత వెల్లడించారు.
రేవంత్ రెడ్డి ఇన్వెస్టర్స్ సమ్మిట్ అని పెట్టి ఆరున్నర లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెబుతున్నాడు.కానీ అవన్నీ ఫేక్ సమ్మిట్లు, ఫేక్ పెట్టుబడులు
ఈ డిసెంబర్ లో మళ్లీ ఇన్వెస్టర్ల సమ్మిట్ పెడతామని చెబుతున్నారని అన్నారు ఆ లోగా ఇప్పటి వరకు రాష్ట్రంలోకి వచ్చిన పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలి లేదంటే ఇన్వెస్టర్ల మీటింగ్ ను అడ్డుకుంటామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా మీ ఫేక్ పెట్టుబడులు, మీ ఫేక్ కంపెనీలు మాకు వద్దని అన్నారు
ఇండస్ట్రీస్ కోసం రైతులు ఇచ్చిన భూములను ముఖ్యమంత్రి తన సోదరులకు ఇస్తున్నాడు విశ్వనగరం అని చెప్పే మన హైదరాబాద్ లో కనీసం తాగటానికి నీళ్లు కూడా లేని పరిస్థితి ఉందని చెప్పారు ఓల్డ్ సిటీలో నీళ్లు నల్లగా వస్తున్నాయి. చాలా చోట్ల డ్రైనేజీలతో మంచి నీళ్లు కలిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు
మంచి నీళ్లు కూడా ఇవ్వలేని వాళ్లు విశ్వనగరం, న్యూయార్క్, లండన్ చేస్తారని ప్రశ్నించారు చెత్తను ప్రాసెస్ చేయటానికి సంబంధించి రామ్ కీ అనే సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చారుఆ సంస్థ సరిగా పనిచేయటం లేదు. జవహర్ నగర్ డంప్ యార్డ్ వద్ద వేస్తున్న చెత్తతో అక్కడ వాతావారణం కాలుష్యంగా మారుతోందని అన్నారు
ఇక చెత్త ఎత్తే బండ్ల వాళ్లను కూడా రేవంత్ రెడ్డి వదలటం లేదని అన్నారు హైదరాబాద్ లో 50 వేల మంది చెత్త ఎత్తే బండ్లతో జీవనం పొందుతున్నారువాళ్ల ఉపాధిపై కూడా రేవంత్ రెడ్డి కన్నేసి వాటిని దొంగతనం చేయాలని చూస్తున్నాడని చెప్పారు రామ్ కీ సంస్థకు కాంట్రాక్ట్ కోసం వీరిని బలి చేయాలని చూస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్లకు అన్యాయం జరగనివ్వం. వారికి ఏదైనా జరిగితే ముఖ్యమంత్రి ఇంటి ముందు చెత్త తీసుకెళ్లి వేస్తామని హెచ్చరించారు
వేరే పార్టీల మాదిరిగా కేవలం ప్రశ్నించి వదిలేయమని మనం జీహెచ్ఎంసీలో 3 వందల సీట్లలో పోటీ చేస్తున్నాం. జీహెచ్ఎంసీ సీటు గెలుస్తున్నామని చెప్పారురైతుల సమస్యలకు సంబంధించి సెక్రటేరియేట్ వద్ద వడ్లను పారబోసింది మేము అదే మాదిరిగా ప్రతి సమస్య విషయంలో ప్రశ్నిస్తాం, పోరాడుతాం, పరిష్కారం కూడా చెబుతామని అన్నారు అందుకే మాతో పెట్టుకోవద్దని ముఖ్యమంత్రికి హెచ్చరిస్తున్నా
హైదరాబాద్ లో కూరగాయలు రోడ్లపై చెప్పులను ఏసీ షోరూమ్ లలో అమ్ముతున్నారు కూరగాయలు, చేపలు అమ్మే వాళ్లకు కూడా ప్రభుత్వం ఏసీ వాహనాలను అందించాలి
జీహెచ్ఎంసీ కి రూ. 11 వేల కోట్ల బడ్జెట్ ఉంది. కానీ సిటీ అన్ని రోడ్లు గుంతలే ఉన్నాయివృద్దులు, గర్బీణిలు ఈ రోడ్లపై ప్రయాణం చేస్తే వారి ఆరోగ్యం ఏం కావాలిహైదరాబాద్ లో వీధి లైట్లు రేవంత్ రెడ్డి మాదిరిగానే ఎప్పుడు వెలుగుతాయో కూడా తెలియని పరిస్థితి ఉంది
బిర్యానీ, ఇరానీ ఛాయ్, ముత్యాలకు ప్రసిద్ధి గాంచిన మన హైదరాబాద్ ను దోమలకు నిలయంగా మార్చేశారు దమ్మాయిగూడలో దోమలు టవర్లు కట్టిన వీడియోలు వైరల్ గా మారాయికుక్కల భయంతో ఎక్కువగా ఉంది. వేలాది మంది సిటీలో కుక్క కాట్లకు గురవుతున్నారు హైదరాబాద్ లో మానవత్వంతో కూడిన మార్పు రాలేదు
10 వేలు జీతం వచ్చే వాళ్లు, లక్ష రూపాయలు జీతం వచ్చే వాళ్లు కూడా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు పెరుగుతున్న ధరల కారణంగా హైదరాబాద్ లో బతుకు భారంగా మారిందని అన్నారు రూపీ వ్యాల్యూ పడిపోయి అన్ని వస్తువుల ధరలు పెరుగుతున్నాయనీ
రైతులు ఇచ్చే భూములను సీఎం బ్రదర్స్ గ్రాబింగ్ చేసి ప్యూచర్ సిటీ అంటున్నారు కానీ ఇక్కడ పంటలు పండకపోవటంతో రేట్లు పెరిగే పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారుప్రతి విషయానికి సంబంధించి ఒక్కో దానికి ఇంటర్ లింగ్ ఉంటుందనీ
ఒకప్పుడు హైదరాబాద్ లో థర్మల్ స్టేషన్, ఎయిర్ పోర్ట్ ఉండేదని కానీ ఇప్పుడు పూర్తిగా పరిస్థితి మారిపోయింది. నగరంలో అన్ని కనీస సౌకర్యాలు లేకుండా చేశారని ఆరోపించారు
సీనియర్ సిటిజన్స్ కు భద్రత లేదు. వారికి మర్యాద ఇవ్వటం లేదు బస్తీ దవాఖానాల్లో డాక్టర్లు ఉండటం లేదు. ప్రతి డివిజన్ లో 24 గంటలు నడిచే హస్పిటల్ ఉండాలని కోరారు
హైదరాబాద్ లో కొత్తగా గవర్నమెంట్ స్కూల్స్ కట్టటం లేదు కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లేలా చేస్తూ కార్పొరేట్ స్కూళ్ల దందాను రాజకీయ నాయకులు చేస్తున్నారని అన్నారు
ఈ విషయాలన్నింటినీ మనం ప్రజలకు చెప్పాల్సి ఉంది ప్రజల కోసం సేవ చేద్దామని సంకల్పం తీసుకున్నందున ఎంత కష్టమైన వారికోసం సమయం కేటాయించాలిఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేటర్ల అవుదామనుకునే వాళ్లు నిత్యం ప్రజల్లో ఉండాని పిలుపు నిచ్చారు
ఎన్నికలప్పుడు మాత్రమే కాకుండా..వీళ్లతోనే మన సమస్యలు పరిష్కారమవుతాయని ప్రజలకు నమ్మకం కలిగించాలని కోరారు అందుకే ఇవ్వాళ్టి మీటింగ్ లో ఎంతమంది ఉన్న సరే వాళ్లంతా కమిట్ మెంట్ తో కూడిన కార్యకర్తలు ఉండాలని నేను కోరుకున్నా ఈ రాష్ట్రంలో మనం చేయాల్సిన చాలా పని ఉంది. అందుకోసం క్రమశిక్షణతో పనిచేయాలి
టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఉచిత విద్య, వైద్యం అందిస్తామని ప్రకటించారునగరంలో మంచి రోడ్లు, తాగే నీళ్లు, డ్రైనేజీ అన్ని సౌకర్యాలు కల్పిస్తాంఈ విషయాలను టీఆర్ఎస్ కార్యకర్తలు గల్లీ గల్లీకి వెళ్లి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని కవిత అన్నారు
విశ్వనగరం అంటే ప్రజలకు మంచి జరిగే విధంగా అన్ని సౌకర్యాలు ఉండాలియూత్, మహిళలు కచ్చితంగా రాజకీయాల్లోకి రావాలని కోరారు ముఖ్యంగా మహిళలు రాజకీయాల్లోకి రావాలని చేతులు జోడించి కోరుకుంటున్నా
మన యూత్ కు ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు మేము అధికారంలోకి వచ్చాక వారిని వ్యాపారవేత్తలుగా తయారు చేసేందుకు రూ. 2 లక్షల నుంచి రూ. 20 కోట్ల వరకు వారికి రుణం ఇస్తామని అన్నారుమహిళలు కోటి మందిని కోటీశ్వరులను చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి మోసం చేసిండు?ముస్లింలను అన్ని రాజకీయ పార్టీలు ఓట్ల కోసం వాడుకోని మోసం చేశాయి?వారికి మేము మంచి చేస్తాం. అందుకే మా పార్టీలోకి రావాలని వారిని ఆహ్వానిస్తున్నామని అన్నారు
?పాతబస్తీలో ఉండే రాజకీయ నాయకులు ముఖ్యమంత్రికి గులామ్ కాకుండా ప్రజలకు గులామ్ లు గా ఉండండి
?పాతబస్తీ ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చండి?టీఆర్ఎస్ పార్టీ కొత్తగా వచ్చింది. కనుక మనం వేరే పార్టీలతో పోల్చుకుంటే పది రెట్లు ఎక్కువ కష్టపడాలిఅందుకే ప్రజల కోసం మనం పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు
?మనం పార్టీ పెట్టాక మొదటిసారిగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీకాంత్ గౌడ్ కు మనమంతా అండగా ఉండాలి?హైదరాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా మనం సమాయాత్తం కావాలని కవిత కోరారు.

