మైనర్ బాలికల అదృశ్యం కేసులో దర్యాప్తు కొనసాగుతోంది- ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్

పుడమిటివి క్రైం న్య

 

 

ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ వెల్లడించారు.

 

 

నాగబెల్లి జితేందర్ సామ్రాట్ ఎడిటర్ ఇన్ చీఫ్ పుడమిటివి

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఖానాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2026 సెప్టెంబర్ 29వ తేదీన ఇద్దరు మైనర్ బాలికలు వారి గ్రామం నుంచి అదృశ్యయిన ఘటనపై వారి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదే రోజు ఖానాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదుచేశామని,ప్రత్యేక బృందాలతో వారిని హైదరాబాద్ నుండి తీసుక వస్తుండగా వాంతులు చేసుకోవడంతో ఎంజిఎం కు తరలించి మెరుగైన చికిత్స అందించి కేసు దర్యాప్తు కొనసాగుతుందని
ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ వెల్లడించారు.

బాలికలను త్వరితగతిన గుర్తించి సురక్షితంగా తీసుకురావడానికి ప్రత్యేక పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టామని అన్నారు.
దర్యాప్తులో భాగంగా ఇద్దరు బాలికలు కూడా హైదరాబాద్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించా అనంతరం బాలికలను వారి తల్లిదండ్రుల సమక్షంలో హైదరాబాద్ నుంచి ఖానాపూర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువస్తుండగా, మార్గమధ్యలో కాజీపేట సమీపంలో ఇద్దరు బాలికలు వాంతులు చేసుకోవడంతో ఎస్కార్ట్ సిబ్బంది మరియు బాలికల తల్లులు బాలికలను విచారించగా, వారిద్దరూ కూడా గుర్తుతెలియని పురుగుల మందు సేవించినట్లు చెప్పినారు, వెంటనే వారిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించనట్లు తెలిపారు

ప్రస్తుతం బాలికలకు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందుతోంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. బాలికల అదృశ్యం ఘటనలో ప్రమేయం ఉన్న అనుమానిత వ్యక్తులను గుర్తించి వారిని పట్టుకోవడానికి పోలీసు టీం లను ఏర్పాటు చేయనైనదని చెప్పారు

అనుమానిత వ్యక్తులను గుర్తించి విచారణ అనంతరం వారి పాత్రను నిర్ధారించి, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ అన్నారు.మైనర్ బాలికల అదృశ్యం కేసు విషయంలో వదంతులు నమ్మవద్దని, కేసు విచారణ పారదర్శకంగా కొనసాగుతున్నదని ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *