పుడమిటివి జన సాహిత్యం
సామ్రాట్ పలుకులు

నాగబెల్లి జితేందర్ సామ్రాట్
ఎడిటర్ ఇన్ చీఫ్ పుడమిటివి-ఎంవిఆర్ మానవవికాసరచనలు పబ్లికేషన్స్
తొడలు గొట్టబట్టే
లాగుల్లో తొండలు జోర్రిత్తమనబట్టే
కాళ్ళు రెక్కలు ఇరగొడుతాము పేగులు మెడకేసుకుంటాం
పాతిపెడుతాం పండబెట్టితొక్కుతాం
నోటికి ఎట్లత్తే అట్లా
బండబూతులు మాట్లాడ బట్టే
చిల్లర పోరగాళ్ళలెక్క
నోరు జారబట్టీరి
మాటబొనిచ్చు కుంటే ఎట్లా
మనం మనుషులం కదా
జ్ఞానం వున్న బుద్ది జీవులం కదా
మన కళ్ళముందు పాలించినోళ్లు
బద్ద శత్రువులైన
ప్రజలు ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడేది
మన భాషను యాసను
అవహేళన చేసిళ్లనే కదా
నిధులు నియామకాల కొసమనే కదా
ఒళ్ళంతా కాల్చుకొని
రైళ్లకు ఎదురెల్లి
ఉరి తాడును ముద్దాడి
నిండుపానాలను ఇడిసిరి
యవ్వనాన్ని ఉద్యమానికి త్యాగం చేసిరి
ఇరవైఏళ్ల పోరాటంలో
నడివయసుకొచ్చి
సదివిన సదువుకు అర్ధం లేక
ఆగమైన ఉద్యమకారుల
జీవితాలు గుర్తుంటే కదా
గది యాది మర్చి
ఉద్యోగాలు ఇయ్యకుంట
బతుకు దెరువు సూపకుంట
మీకు మీరు తిట్టుకునుడేంది
ప్రజల నోళ్లల్లో మన్నుకొట్టి
సదువుకున్నోళ్ల బతుకుల్ని ఆగం జేసుడేంది
తెలంగాణ తెచ్చినోళ్లమని ఏలినోళ్లనే
ఓటు ఓడగొట్టింది
పాలకపక్షం ప్రతిపక్షం
బజారోళ్లలెక్క
గాతిట్లదండకం ఎంది
హుందాతనం పంచండి
తెలంగాణమాటే పాణమాసొంటిదన్నట్టు
ప్రపంచంలో మనుషులలెక్క
మాట్లాడినట్టు
మీ మాటలు చేతలు
యువతకు ఉపాధి కల్పించి
బతుకుదెరువు చూపండి
తెలంగాణ ప్రజలకు జర
చైతన్యం ఎక్కువ
ఎవరిని పడగొట్టాలో
నిలబెట్టాలో బాగతెలుసు
గలీజ్ మాటలు మాని
మీమీద మీరే ఒట్టేసుకొండి
అమరుల కలల తెలంగాణకై
పాలన చేద్దామని
ప్రతి పక్షమైతే పోరాడుతామని
మాటను నిలబెట్టండి
గెలిపించండి బతికించండి
మాటతీరు మార్చండి
మనుషులలెక్క బతికినట్టయిన వుంటది