పుడమిటివి జన సాహిత్యం
సామ్రాట్ పలుకులు

నాగబెల్లి జితేందర్ సామ్రాట్
ఎడిటర్ ఇన్ చీఫ్ పుడమి టివి -ఎం వి ఆర్ మానవ వికాస రచనలు పబ్లికేషన్స్
గా దీనాలల్ల ఊరంటే కులాల కట్టడి
శ్రమజీవుల సెమట సుక్కల సందడి
పనిమీద జాస పశువులంటే పాణం
ఎవసమంటే ఎనలేని పేమ
ఇజ్జత్తక్కువోల్లు పనికి మాలినోళ్లు
ఊరిమీద పడి తిరిగేటోళ్లు
తాగిలొల్లి జేసే టోళ్లు,
వానికి వీనికి పుల్లలు పెట్టెటోళ్లు
కయ్యానికి కాళ్లు దువ్వేటోళ్లు
ఏళ్ల మీద లెక్క పెట్టె
టోళ్ళు వుండేది
బలిసినోడు రుబాబు చేసిన
ఎదిరించి అందరిని కదిలించే
యోధులు ఒక్కరైనా ఉండేది
కులం మతం ఏదైనా రత్త బంధం కాకపోయిన
ఐనోళ్ల లెక్క వాయి వరసలు పెట్టి
పిలుసుకునే పేమ వుండేది
పగోడు సచ్చిన పనికి మాలినోడు సచ్చిన
ఊరోళ్లకు పచ్చి నీళ్ళైనా గొంతులకు దిగేది కాదు
ఎవడికి కష్టమచ్చిన
ఇంటోళ్ళకే ఏదో అయినట్టు
ప్రతి గుండె సిన్న బోయేది
తక్కువ కులమని సూసే ఎక్కువ కులపొల్లకైన
కొంచెం భయం వుండేది
అచ్చరం రాని ఆగమైన బతుకులైన
ఊరి ముచ్చట హద్దులు దాటేది కాదు పచ్చటి సెట్టు కిందనే పరిష్కారమయ్యేది
గప్పుడు జర
ఓట్లప్పుడే లొల్లిలు అయ్యేది
ఎన్నికలు అయిపోగానే
అదంతా మాసిపోయి
ఎవలపనులల్ల వాళ్ళు పోయేది
పెళ్ళాం మొగల్ల మధ్య లొల్లి వత్తె వాళ్ళను ఎట్లైనా కలిపేటోల్లే ఎక్కువ
ఇడుపు కాయిదం అంటే
పాపం సేసినట్టు దూరంగా వుండేది
గీ దినాలల్ల కాలం మారింది
వీడు పోటు మొగోనిలెక్క
ఇద్దరిమధ్య దూరి ఎంగిలి కూడుకు ఆశపడి మాట్లాడుకుంటే పోయే ఇషయాన్ని పెద్దది చేసి
పచ్చని కాపురంలో నిప్పులు పోసి
ఆగం చేయబట్టే సంపబట్టే కొందరు ఎదవలు
ఇగ జర వాడు గల్లీ లీడరైనా వయసు పోరగాళ్లకు
తాగిచ్చి తినపిచ్చి
ఆ పార్టీ ఈ పార్టీలల్ల తిప్పి లేని అలవాట్లు నేర్పి
వాడో దిక్కు వీడోదిక్కు పోర గాళ్ళను
ఎంబడేసుకొని తిరిగి
రోడ్ల మీద వాళ్ళ రక్తాన్ని తడిపి
పానాలు తీయబట్టే
దోస్తుగాళ్ళ మధ్య లొల్లిలు కొట్లాటలు పెట్టించి
గా లీడర్ గాళ్ళు తెగసంబరపడిపోతున్నరు
పేగులు మాడో లివర్ కరాబయ్యో కోడె వయసు పోరగాళ్లు పాడెక్కి కన్నోళ్లకు కడుపుకోత మిగిలస్తుండ్రు
ఆ “సచ్చు’ నాకొడుకులు వాళ్ళ
పానాలమీద శవాలమీద
ప్రమాణం చేసి మంది ముందు
కడుపు తీపికంటే వీనికే పేమ ఉన్నట్టు
వాన్ని వీన్ని తిట్టి
సచ్చిన పోరగాళ్ళ ఉసురు తగులుతుందని కన్నోళ్ల కడుపుకోత శాపాలు పెట్టిన ఏ పాపం తగలకుండా లీడర్లుగా ఎదగబట్టే
ఇగ ఊళ్ళల్ల అందరూ సదువుకున్నోళ్ళే
పది గడపలు దాటితే ఓ బెల్టు షాప్ ఏడపడితే ఆడ మత్తు మందు పొలగాళ్లంత మత్తులో మునిగి
కొందరు అతి తెలివి మేధావులు
సెప్పిన మాటలకు కులం మీద, మతం మీద
ఎదుటోడు మనిషే కానట్టు
తెగపేమ పార్టీలమీద ఎనలేని పేమ సూపబట్టే
వాడు నావోడు కాదు
నీవోడు కాదని కొట్లాట
గీ దినాలల్ల అపదోచ్చిన మనిషి సచ్చిన
వాడు మనోడా కాదా
అని లెక్కలేసి
వీనికి వానికి చేసింది ఏమిలేకున్న లీడర్లయ్యి
గ్రూప్ లు కట్టబట్టీరి
పాణం అసోంటి ఊరిని
ఇడదీయబట్టీరి
మంచోణ్ణే బాండీ షాప్ ల కాడనో సాయ కొట్టుకాడనో
వాళ్ళ నోట్లో పురుగులు పడ్డట్టు మాట్లాడబట్టే
పైసల ముందు మంచి ఓడి పోబట్టే
పార్టీల జెండాల కింద కుల మతాల మత్తు నరనరాన ఎక్కించి ఓ ముసుగు కప్పి మనుషుల మాయం జేయబట్టే
ఇప్పుడు ఊరేట్లయిపాయె
బతికున్న మనుషుల శవాలదిబ్బల
కన్నోళ్లను సూడని ఏదవల బతుకుల
ఆస్తికోసము అయినోళ్లను సంపాలని సూసే రత్త బంధముల
తణువంత విషంపెట్టుకొని
పెదాల మీద సిరునవ్వులై
దృత రాష్ట్రుని కౌగిలల
బంధాలను బందించిన
మనుషుల మధ్య ఊరు
గోస పడుచున్నది
పుట్టిన నేల కోసం
పాణం అసోంటి పల్లె మళ్ళీ పచ్చని తోరణమవ్వాలని
పేమగళ్ల మనుషులు
ఊళ్ళో పుట్టిపెరగాలని
మనుషులుగా బతకాలని
మట్టితల్లీ ప్రసవ వేదన పడుచున్నది
రేపటి తరాన్ని కనాల