పుడమి టివి కవిత్వం
పుడమిటివి సామాజికం సాహిత్యం

నాగబెల్లి జితేందర్ సామ్రాట్ ఎడిటర్ ఇన్ చీఫ్
కవి రచయిత
నా పుట్టినరోజు సందర్భంగా
బాపు అమ్మ పోసిన ప్రాణం
భూతల్లిని ముద్దాడిన క్షణం
పంచభూతాలు తోడై
సాగుతున్న జీవన ప్రయాణంలో
పుట్టుకొస్తున్న, అంతరిస్తున్న
కోటానుకోట్ల జీవరాసుల్లో
ఒకరినై…
మానవ సమూహంలో
అందరిలో కానరాని
ఇసుక రేణువై,
కొందరిలో ఒకరిగా,
కాసిన్ని పరిచయాల్లో
నాకు నేనుగా…
సముద్రంలో ఈదినట్టు
సాగె జీవన ప్రయాణం.
కాలం మారిన సాంకేతికంగా
ఎదుగుతున్నామనుకున్నా,
రామాయణం – మహాభారతం,
బైబిల్ – ఖురాన్ గ్రంథాల్లో
కనిపించే పగలు, ప్రతీకారాలు,
ఆగని యుద్ధాలు,
మారని మనిషి తత్వాలు…
కళ్లముందే కనిపించే
జీవిత సత్యాలు.
నా చుట్టూ ఉన్న ప్రపంచం,
నా అనుకున్న లోకం
అర్థమవ్వడానికి
కొంత కాలం దాటేసింది.
ప్రకృతిని అర్థం చేసుకుంటే
భూగోళమంతా నాదే కదా!
నన్ను నేను సంస్కరించుకోకుండా
నిందలేసే వాళ్ల కోసం
కాలాన్ని మింగేస్తే ఎలా?
కాలగమనంలో
కనుమరుగయ్యే వరకు
కళ్లముందు జరిగే
జీవిత సత్యాలను
అక్షరాల్లో పేర్చి
రేపటి తరాన్నై
జీవిస్తా…
భూతల్లి ఒడిలో
చివరి నిద్ర పోయేవరకు. 🌿