పుడమిటివి న్యూస్

నాగబెల్లి జితేందర్ సామ్రాట్ ఎడిటర్ ఇన్ చీఫ్

చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడుతూ, సాధరణ ప్రజలను ఇబ్బందులకు గురిచేసే విధంగా వ్యవహరించే రౌడీ షీటర్ల పట్ల అణిచివేత ధోరణీతో వుండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారులను అదేశించారు.
నెల నేర సమీక్షా సమావేశంలో భాగం కిట్స్ కళాశాýలో శుక్రవారం వరంగల్ పోలీస్ కమషనర్ అధ్వర్యంలో నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్‌కు చెందిన పోలీస్ అధికారులు పాల్గోన్న ఈ సమావేశంలో పోలీస్ కమిషనర్ ముందుగా శాంతి భద్రతలకు సంబంధించి అంశాలను ప్రస్తావిస్తూ ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించే రౌడీ షీటర్లకు నిర్వహించే కౌన్సిలింగ్లో వంద శాతం రౌడీ షీటర్లు అందరు హజర్ కావాలని. ప్రతి నెల ఒకమారు స్టేషన్ అధికారులు వ్యక్తిగతంగా రౌడీ షీటర్ల ఇండ్లను సందర్శించి వారిని తనఖీ చేయాల్సి వుంటుంది. ఇదే సందర్బంగా వారి స్థితిగతులపై కుడా ఆరా తీయాలని, తనిఖీ సమయాల్లో లేని రౌడీ షీటర్ల కదలికలపై వివరాలను సేకరించాలని. నేరాల నియంత్రణలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా రాత్రి సమయాల్లో బెల్ట్ షాపులను మÖయించాలని, అలా చేయకుంటే వారిపై కేసులు నమోదు చేయడం లేదా బైండోర్ చేయాలని, అన్నారు

ముఖ్యంగా నిర్ణీత సమయాల్లో షాపులను మÖయించాల్సిన బాధ్యత సంబంధిత స్టేషన్ అధికారిపై వుందని. రాత్రి సమయాల్లో అధికంగా రద్దీ వుందే ప్రాంతాలను గుర్తించి అక్కడ ముమ్మరంగా పెట్రోలింగ్ నిర్వహించాలని, ఇకపై రాత్రి సమయాల్లో ఎవరైన రోడ్లపై జన్మదిన వేడుకలు జరుపుకునే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని,అన్నారు
చోరీల కట్టడికై ఇతర ప్రాంతాల నుండి వచ్చి ఇండ్లతో పాటు ఇతర వ్యాపార సంస్థల్లో పనులు చేసే వారి వివరాలతో పాటు హస్టల్స్ నిర్వహణకు సంబందించిన వివరాలు సైతం స్థానిక పోలీసులు సేకరించాలని.పోలీస్ కమిషనర్ అధికారులను అదేశించాను.
అధికారుల పనతీరుపై పోలీస్ కమిషనర్ పలు సూచనలు చేస్తూ ప్రతి పోలీస్ స్టేషన్ అధికారి తప్పని సరిగా ఉదయం 9 గంటల నుండి ప్రజలకు అందుబాటులో వుందాలని, నేరస్థుల అరెస్టు విషయంలో అధికారులు నిర్లష్యం వహిస్తే శాఖపరమైన చర్యలు తప్పవని, ద్విచక్ర వాహనాల చోరీ అయితే వెంటనే దానిపై కేసు నమోదు చేయాలని, క్షేత్ర స్థాయిలో పెట్రొలింగ్ వాహనాల పనితీరును అధికారులు సమీక్షా జరపాలని, మీ ఉద్యోగానికి మీరు న్యాయం చేస్తే ప్రజలకు న్యాయం చేసినట్లని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు.
అనంతరం పెండింగ్ కేసులు, నేరస్తుల అరెస్టు, కేసుల్లో కోనసాగుతున్న దర్యాప్తు తీరుతెన్నులు, నేర నియంత్రణకై స్టేషన్ పరిధిలో తీసుకుంటున్న చర్యలతో పాటు, ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకుగా అధికారులు చేట్టిన చర్యలపై పోలీస్ కమిషనర్ సంబంధిత అధికారులను అడిగితెలుసుకున్నారు.
ఈ సమావేశంలో డిసిపిలు అకింత్ కుమార్, దార కవిత, రాజమహేంద్ర నాయక్, అదనపు డిసిపిలు రవి, ప్రభాకర్ రావు, బాల స్వామి,సురేష్ కుమార్‌తో పాటు ఏసిపిలు, ఇన్స్‌స్పెక్టర్లు, ఎస్.ఐలు పాల్గోన్నారు.