నూరేళ్లు జీవిస్తావు మధు అన్న

పుడమిటివి జనసాహిత్యం

గాడిపల్లి మధు  సీనియర్ జర్నలిస్ట్

నాగబెల్లి జితేందర్ సామ్రాట్

ఎడిటర్ ఇన్ చీఫ్ పుడమిటివి ఎంవిఆర్ మానవవికాస రచనలు

అక్షరాలకు పదును పెట్టి
నిజాంపై ఎక్కుపెట్టిన
సాహితి యోధుడు దాసరథి
నడియాడిన నేల
పసిపిల్లలనవ్వుల వెలుగులై
పచ్చని ప్రకృతి అందాలను
అల్లుకున్న పల్లె చిన్న గూడూరు మట్టిలో పుట్టి
కలం యోధుడిగా ఎదిగి
అందరికి ఆత్మీయుడివై
కుట్రలు ఎరుగని నేస్తమై
సాగుతున్న నీ జీవన ప్రయాణంలో
ఎంత క్షోభ అనుభవించినవు
రక్తబంధం కోల్పోయి
ఉబికివస్తున్న కన్నీళ్లను దిగమింగి చిరునవ్వువై
ఉదయిస్తున్నవు
ఎందరికో జన్మజన్మల బంధమై
సాగే నీ జీవన గమనంలో
ఆరోగ్యాంగా సంతోషంగా
ఈ క్షణం లాగే ప్రతి క్షణం
నిత్యయవ్వనంగా
పసితనమై నిండు నూరేళ్లు
జీవిస్తావు ఇలాంటి పుట్టినరోజులు

మళ్ళీ మళ్ళీ జరుపుకోవాలని కోరుకుంటూ
జన్మదిన శుభాకాంక్షలు మధన్న

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *