ఆడ పిల్లలను జన్మనిస్తుందనే సాకుతో భార్య ఇద్దరు పిల్లలను హత్య

 

నాగబెల్లి అరుణ్ కుమార్
పుడమి టివి క్రైం బ్యూర

 

రాష్ట్ర వ్యాప్తంగా సంచలంగా మారిన భార్య ఇద్దరు బాలికల హత్యకు సంబంధించి కేసులో హత్య గురైన మృతురాలి భర్తతో పాటు ఈ హత్యలకు పరోక్షంగా కారణంగా నిలిచిన మరో మరో తొమ్మిడి మందిని పోలీసులు అరెస్టు చేయగా, మరో ఇద్దరు నిందితులు ప్రస్తుతం పరారీలో వున్నారు.

పోలీసులు అరెస్టు చేసిన వారిలో ప్రధాన నిందితుడు వరంగల్ జిల్లా, పున్నెలు గ్రామానికి చెందిన యం.డి అజారుద్దీన్ (29)తో పాటు, నిందితుడి కుటుంబ సభ్యులు పున్నెలు గ్రామానికి చెందిన యం.డి చాంద్‌పాషా (49),యం.డి సలీహా (45), యం.షరోద్దీన్ (25)లతో పాటు బసిక స్రవంతి(32),కడిపికొండ, బాల్నె పార్ధు (47) నెక్కొండ, బొమ్మెర మనోహర్(39), గీసుగొండ, లింగాల నరేష్(37), కొండపర్తి, సాట్లరాజు (32),పున్నెలు, వాకుదోట్ భద్రు (60),ఎనుగల్లు చెందిన వారిని పోలీసులు అరెస్టు చేయగా, మరో ఇద్దరు నిందితులు డా. బాల్నె పూర్ణిమ, డా. ఎస్.రవళీ ప్రస్తుతం పరారీలో వున్నారు.

ఈ అరెస్టు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ మీడియాకు వివరాలను వెల్లడిస్తూ ఐనవోలు మండలం పున్నెలు గ్రామానికి చెందిన ప్రధాన నిందితుడు అజారుద్దీన్ ఇదే గ్రామానికి చెందిన మృతురాలు ఫరహాత్‌ను 2016 సంవత్సరంలో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి హుమేరా (09), ఆయేషా (06) జన్మనిచ్చారు. కాని నిందితుడి కుటుంబ సభ్యులకు కుమారుడు పుట్టాలని కోరిక వుండేది. 2021, 2022 సంవత్సరాల్లో మతురాలు గర్భం దాల్చడంతో తిరిగి అడ పిల్లకు జన్మనిస్తుందనే అపనమ్మకంతో ప్రధాన నిందితుడితో పాటు అతని కుటుంబ సభ్యులు పున్నెలు గ్రామానికి చెందిన మందుల షాపు నిర్వహిస్తున్న సట్ల రాజు,తో పాటు మిగితా నిందితులు ఆర్.యం.పి నరేష్, ల్యాబ్ టెక్నిషియన్ మనోహర్, కాజీపేటలోని సురక్షా హస్పటల్ డాక్టర్ రవళి, నర్సు స్రవంతి, నెక్కోండకు చెందిన ఉపేందర్ హస్పటల్ డాక్టర్ పూర్ణిమల సహకారంతో నిందితుడు మృతిరాలికి లింగా నిర్థారణ చేయించి పుట్టబోయేది ఆడ పిల్లయని నిర్థారించుకోని మృతురాలికి ఇష్టం లేకున్నా రెండు దఫాలు నిందితుడు మతురాలికి ఆబార్షన్ చేయించడం జరిగింది.

ఇదే సమయంలో నిందితుడి దూరపు బంధువైన మైనర్ బాలికపై ప్రేమ పెంచుకున్న నిందితుడు పెళ్ళి చేసుకుంటాను అని మైనర్ బాలికకు నిందితుడు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో నీకు ఇంటకు ముందే పెళ్ళి అయి ఇద్దరు పిల్లలు వున్నారు. నేను నిన్న పెళ్ళి చేసుకోనని మైనర్ బాలిక నిరాకరించడంతో, తనకు భార్య పిల్లలు వుండటం కారణంగానే మైనర్ బాలిక పెళ్ళి అంగీకరించడం లేదని భార్య పిల్లలపై కక్ష్య పెంచుకున్నాడు నిందితుడు. ఇదే సంవత్సరం మార్చ్ నెలలో మృతురాలు ఫరహాత్ గర్భం దాల్చడంతో తమకు తిరిగి ఆడపిల్ల జన్మనిస్తుందనే భయంతో నిందితుడుతో పాటు తల్లిదండ్రులు, తమ్ముడు అబార్షన్ చేయించుకోవాల్సిందిగా పలుమార్లు మృతురాలితో గోడవ పడేవాడు.

అలాగే తను ప్రస్తుతం ప్రేమిస్తున్న బాలికను పెళ్ళి చేసుకోవాలంటే భార్య,పిల్లలు బ్రతికుండగా సాధ్యం కాదని, వారిని చంపడం ద్వారా ఇది సాధ్యమని నిర్ణయించుకున్నాడు నిందితుడు.ఇందుకోసం నిందితుడు తాను అనుకున్న ప్రణాళిక ప్రకారం ఈ నెల 1వ తారీఖు రాత్రి సుమారు 7.50 గంటలకు ఐసు క్రీం తినిపిస్తానని భార్య పిల్లలను తాను నిర్వహిస్తున్న స్విమ్మింగ్ పూల్ వద్దకు కారులో తీసుకరావడం జరిగింది.

ప్రణాళిక ప్రకారం నిందితుడు ముందుగానే స్విమ్మింగ్ పూల్ వద్ద సిసి కెమెరాలు, కరెంటు నిలిపి వేయడంతో స్విమ్మింగ్ చేరుకున్న మృతులను నిందితుడు బలవంతంగా స్విమ్మింగ్‌లోకి నెట్టివేసిస్విమ్మింగ్ పూల్‌లో పడిపోయిన భార్య పిల్లలను బలవంతంగా వారు చనిపోయేవరకు వారిని నీటిలో ముంచి దారుణంగా హత్య చేసాడు.

ఈ ముగ్గురిని హత్య చేసిన అనంతరం నిందితుడు వీరు మరణించినట్లుగా నిర్థారించుకోని తన భార్య పిల్లలు స్విమ్మింగ్ పూల్‌లో పడి మృతి చేందారని ప్రచారం చెశాడు. మృతిరాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు తమకు అందుబాటులో వున్న టెక్నాలజీని వినియోగించుకోని నిందితుడు ఆజారుద్దీన్ తన భార్య పిల్లలలను దారుణంగా హత్య చేసినట్లుగా నిర్థారణకు వచ్చారు. పట్టుబడిన నిందితుల్లో స్రవంతి పై మూడు కేసులు, డా.పార్దు మీద నాలుగు కేసులు, ప్రస్తుతం పరారీ లో వున్న డా. పూర్ణిమ పై నాలుగు కేసులు ఉన్నట్లుగా పోలీస్ కమిషనర్ వెల్లడించారు.

ఈ హత్యలకు పాల్పడిన నిందితుడి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడంతో, నిన్న సాయంత్రం పోలీసులకు పట్టుపడటం జరిగిందని పోలీస్ కమిషనర్ తెలియజేసారు.

ఈ కేసును పరిష్కరించడంతో పాటు నిందితుడుని పట్టుకోవడం ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులు ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, మామూనూర్ ఏసీపీ వెంకటేష్ పర్వతగిరి సిఐ రాజగోపాల్, గీసుగొండ ఇన్స్ స్పెక్టర్ విశ్వేశ్వర్,మామూనూర్ ఇన్స్ స్పెక్టర్ శ్రీనివాస్, ఐనవోలు ఎస్., పర్వతగిరి, మామూనూర్ ఎస్.ఐ లు శ్రీనివాస్, ప్రవీణ్, శ్రీకాంత్, కానిస్టేబుళ్లు హేమకుమార్, శ్రీనివాస్ పోలీస్ కమిషనర్ అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *