అక్షరాలతో ప్రజలను చైతన్యం చేస్తున్న పోలీస్ కలం

పుడమిటివి సామాజికం సాహిత్యం

దేశిని విజయ్ రచయిత  పోలీస్ అధికారి

అక్షరాలను పదునైన పదాలుగా కూర్చి మనుషుల తత్వంతో పాటు సకల జీవుల నైజాన్ని విశ్వఅంతరాలను తడిమి కవిత్వంగా మలచి మనిషిత్వపు కొస అంచులో శతక కవితలతో విజయ్ దేశిని సాహితి సమాజంలో చైతన్యపు అక్షరాల దివిటిగా నిలిచాడు.

అదిమమానవుడి నుండి ఆర్ట్ ఫిషియల్ ఇంటలిజెన్సీ వరకు ఎదిగిన మానవ సమాజం సాటి మనిషి పట్ల ప్రవర్తించే తీరు,సాంకేతికంగాఅరచేతిలోఅద్భుతాలు సృష్టిస్తూఅంతరిక్షాన్ని తమ గుప్పిట్లోబందించాలనుకుంటున్నమానవ సమూహాలూ మళ్ళీ తిరోగమనము అంచుల్లోకి దిగ జారీ పోతున్నయని కవి ఆవేదనతో అక్షరాలను సంధించి మనిషిగా బతకలేని సమాజం పై అసహనం వ్యక్తం చేస్తాడు.

పల్లె వాతావరణం కుటుంబ నేపథ్యం బడిపంతులుగా పాఠాలు బోధించి పోలీసుగా మారిన నేపథ్యం కావచ్చు దేశిని విజయ్ ఎంచుకున్న ప్రతి కవితా వస్తువు విభిన్నంగా ఉంటుంది పాము తన గుడ్లను తానే మింగినట్టు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తండ్రే కన్న కూతురిని కబలించిన అత్యంత దారుణమైన సంఘటన పతనమై పోతున్న మానవ సంబంధాలపై, ఆడపిల్లలకి రక్షణలేని వ్యవస్థపైన విజయ్ అక్షర యుద్ధం చేశాడు.

ప్రతి జీవి ఒక్క కణంతో మొదలై పోరాటం మొదలపెట్టి తన రూపాన్ని సంతరించుకుంటుంది, తల్లీ గర్భంలో అడుగు పెట్టక ముందే లక్షలాది శుక్రకణాలు అండాన్ని ఢీకొంటాయి, అందులో ఒక్క కణం అండం తో పోరాడి కలిసి జై గోట్ అయ్యి శిశువుగా తల్లీ గర్భగుడిలో రూపాంతరం చెందుతుంది.అంటూ కవి తన అక్షరాలతో,”జతకై లక్షల కణాలపోరులో లక్ష్యం చేరి తొలి విజేతవై జై గోటైనావు ‘ ఊపిరి లేక ముందే నువ్వు పోరాటం చేసి గెలిచినోడివి విజయం నీదే అంటూఅద్భుతంగా వర్ణిస్తాడు.

మారుతున్న కాలగమనంలో మనిషి ప్రేమబంధాలు అనుబంధాలకు దూరమై తనకు తానుగా ఒంటరై పోతున్న మనుషులను చూస్తున్న కవి నేను మనిషి నెట్లయిత అంటూ కనుమరుగవుతున్న మానవ సంబంధాలపై కలత చెందుతాడు మనిషిగా జీవించడమంటే సంఘ జీవిగా బంధాలు బంధుత్వాలతో జీవించడమని “ప్రేమ బంధాల ఊసే లేదు భౌతిక శారీరక సౌఖ్య సుఖం తప్ప….అంటూ చీకట్లు కమ్ముతున్న మానవ సంబంధాలపై అక్షరావెలుగులు పంచాడు.

సంస్కారం లేదు అనే మాట ప్రతి వ్యక్తి నోటి నుండి వస్తుంది, మాది సాంప్రదాయ కుటుంబం అంటుంటారు.అసలు సమాజంలో వావి వరుసలు కనుమరుగయి పోతున్నాయి. సమిష్టి కుటుంబ వ్యవస్థ కంటే వ్యక్తి గతమే గొప్పది అనుకుంటున్న రు, పెద్దలపట్ల గౌరవం వుండాలన్న భావనే కరువయ్యి పోయింది. ఇక సంస్కార వంతులు ఏడ కన్పిస్తరని సంస్కారపు వేదనను తన పదాల అల్లికతో సంస్కారానికి నోరుంటే అరచి అరచి చచ్చేది సాంప్రదయానికి కళ్ళుంటే రక్తం కార్చి ఏడ్చేది అంటూ బందాలను బంధీ చేస్తున్న సమాజమే సమాధానం చెప్పాలని కవి ప్రశ్నించాడు

బాల్యం ప్రతి ఒక్కరి జీవితంలో చదరని ముద్రవేస్తుందనేది సత్యం కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం సిరిసేడు గ్రామం మట్టినిముద్దాడిన దేశిని విజయ్ కి ఆ మట్టిపరిమళాలు ప్రకృతి అందాలు కులమతాలకు అతీతంగా జీవించే అక్కడి ప్రజల ఆత్మీయ బంధాలు బాల్యంలోనే కవిగా మార్చాయి
విజయ్ కి జన్మనిచ్చిన తల్లిదండ్రులు చొక్కయ్య కళావతి అంటే ప్రాణం తన ఇద్దరూ అక్కలు అరుణ, పావని పంచప్రాణాలు.

గీతకార్మిక కుటుంబములో పుట్టినప్పటికి తన తండ్రి చొక్కయ్య పోస్ట్ మాస్టర్ గా సేవలు అందించడం వల్ల సబ్బండ కులాలకు ఆ ఇల్లు తో అనుబంధం వుండేది క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన చొక్కయ్యను ఊరు తమ బిడ్డగా ప్రేమించింది అక్కున చేర్చుకున్నది. చొక్కయ్యకు విజయ్ అంటే ప్రేమ ఎందుకంటే అతను విజయ్ లో వాళ్ళ నాన్నను చూసుకున్నాడు కొడుకుగా ప్రేమను పంచాడు. తండ్రి మరణించిన నప్పుడు తన రక్తంలో ప్రవహించే ప్రతి కణం, జీవనశైలి గుర్తుకు వచ్చి కన్నీళ్లు దారగా నేలను తాకుతుంటే నాన్న పెంచిన పెంపకం ప్రేమ అక్షరాలై మొలకేత్తినాయి నాన్న పేరును ఎవరైనా పలకరిస్తే చాలు కన్నీళ్లు జలజల రాలుతాయి.

సిరిసేడు గ్రామానికి, మాజీ ప్రధాని దివంగత పీవి నర్సింహావుకు విడదీయలేని బంధం వుంది అతను పుట్టింది అక్కడే దేశిని విజయ్ శిరీషేడు లో పుట్టి పీవి స్వగ్రామంలో మొదట ఉపాధ్యాయ కొలువును చేపట్టడం అక్కడే పదేళ్ల పాటు పనిచేసి ఉపాధ్యాయవృత్తిని వదిలివేయడం జరిగింది

బాల్యంనుండి పోలీస్ యూనిఫామ్ అంటే విజయ్ కి ఇష్టం,ఉపాధ్యాయవృత్తిలో పిల్లలకు పాఠాలు బోదిస్తూనే క్లస్టర్ రిసోర్స్ పర్సన్ గా కొనసాగాడు. పోలీస్ ఉద్యోగం లో ఖమ్మం జిల్లా ముదిగొండ లో ఎస్సైగా బాధ్యతలు స్వీకరించాడు

యువతను మేలుకొలపే వివేకనందుడి భావజాలాన్ని పునికి పుచ్చుకొని కులమతాలు లేకుండాభారతావనిని సమానత్వంతో చూసిన అంబేద్కర్ ను గుండెకుహద్దుకున్నాడు శ్రీశ్రీ కవిత పదాల అలజడిని ప్రేమించాడు.

తన తండ్రి అందించిన క్రమశిక్షణ ఊరు అందించిన ప్రేమ ఉపాధ్యాయవృత్తిలో పెనవేసుకున్న జ్ఞానబంధం సమాజ రుగ్మతలపై పోలీసు అధికారిగా విధి నిర్వాహన ప్రతి రొజు క్షణం తీరిక లేని పని ఒత్తిడిలో అక్షరాలను అల్లుతూ వంద కవితల పుస్తకాన్ని సమాజానికి అందించాడు. ఇంతటి జీవన ప్రయాణంలో తన సహచరి జ్యోతి అందించిన మానసిక బలం విజయ్ ని కవిగా నిలబెట్టింది

కవిత్వం రాయడం అంటే ఒక విషయాన్ని చెప్పడం కాదు దేశిని విజయ్ లో గొప్ప కవి కన్పిస్తాడు, అక్షరాల అల్లికలో పదాల కూర్పులో చిక్కధనం అవి సమాజ చైతన్యాన్ని రగిలించే తొలిపొద్దు వెలుగులుగా కనిపిస్తాయి. కవుల సమూహంలో ఎక్కువగా కనిపించక పోయిన సామాజిక మాద్యమాలల్లో సమాజాన్ని కదిలించే అక్షర అన్వేషిగా కనిపిస్తాడు.

హాసన్ పర్తి పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న క్రమంలో పరిచయమైన విజయ్ కవితలు చదివాక తన సిరా చుక్కనుండి జాలువారే ప్రతి అక్షరం సమాజంలోని మనుషులను కదిలిస్తుందని చైతన్య వంతులను చేస్తుందని విజయ్ రాసిన అక్షరాలను ఒడిసి పట్టుకున్నప్పుడు అర్ధమయ్యింది.విజయ్ కవి నే కాకుండా మంచి నటుడుకూడా సినిమా రంగంలో కొన్ని సినిమాలాల్లో పాత్రలు పోషించాడు స్మార్ట్ పోలీస్, ఎందరో మహాను బావులు, బ్లాక్ బోర్డు-2 లాంటి చిన్న తరహా సినిమాల్లో పోలీస్ గా నటించాడు పోలీస్ శాఖలో సమర్ధవంతంగా విధులు నిర్వహించడంవల్ల డిజిపి చేతుల మీదుగా ప్రశంషలు పొందాడు మనిషత్వపుకొస అంచుల పుస్తకాన్ని సాహితి లోకంలో వదిలిన విజయ్ మరిన్ని రచనలతో పుస్తకాలతో నిలబడాలని కోరుకుంటూ దేశిని విజయ్ కి అభినందనలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *