పుడమి టీవీ న్యూస్

ఎలకంటి నరేష్ పుడమి టివి బ్యూరో చీఫ్

జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు వేగవంతంగా నిర్వహించి, కొనుగోలు చేసిన వడ్లను వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు.
శుక్రవారం జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన సమీక్షలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, అదనపు కలెక్టర్ జి.సంధ్యారాముగర్లతో కలిసి రైస్ మిల్లర్లు, కాంట్రాక్టర్లు, మండల ఏపీఎంలు (డీఆర్‌డీఏ), నోడల్ అధికారులు (డీసీఓ)లతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకు సకాలంలో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని సూచించారు.
కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని, రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మిల్లర్లు ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలని ఆదేశించారు.
రైతులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా ఓపీఎంఎస్ ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధిత ఇన్‌చార్జ్‌లకు సూచనలు చేశారు.
జిల్లాలో ఎక్కడా గన్ని సంచుల కొరత, రవాణా వాహనాల కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో జడ్పి సీఈఓ రామ్ రెడ్డి, వరంగల్ నర్సంపేట ఆర్డీవోలు సుమా ఉమారాణిలు, జిల్లా రవాణా శాఖ అధికారి శోభన్ బాబు, డీఎంసీఎస్ సంధ్యారాణి, డీసీఎస్ఓ, కిష్టయ్య, తహసీల్దార్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
సమావేశం అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, అదనపు కలెక్టర్ జి సంధ్యారాణి సంబంధిత అధికారులు బొల్లికుంట పిపిసి కెంటర్ ను తనిఖీ చేశారు.
పీపీసీలో నిల్వ ఉన్న ధాన్యం బస్తాలను రేపటిలోగా మిల్లులకు తరలించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా సంబంధిత శాఖ అధికారులు రైతులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.