సర్కార్ బడికి పంపిస్తే ఇంటిపన్ను మాఫీ.

పుడమిటివి పల్లె యోధులు

నాగబెల్లి జితేందర్ సామ్రాట్ ఎడిటర్ ఇన్ చీఫ్
7799071177

ఒక్కమనిషి తలుచుకుంటే చాలు వ్యవస్థను మార్పు చేయవచ్చు, ఆ మార్పు ప్రపంచ స్థాయిలో పల్లెను నిలబెడుతుంది. గ్రామ సర్పంచ్ గా ఎన్నికైన కొద్దినెలల్లోనే తనదైన ముద్రతో ముందుకు సాగుతున్నాడు సర్పంచ్ ఇంద్రదేవ్ విద్యావంతులు రాజకీయాల్లోకి వస్తే సమాజమార్పుకు బాటలు వేయవచ్చు, పాలన రంగంలో వుంటే అభివృద్ధి వైపుకు అడుగులు వేయవచ్చనేది ఇంద్రదేవ్ తీసుకుంటున్న నిర్ణయాలు కళ్ల ముందుంచుతున్నాయి. గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు అని చెప్పుకుంటున్న గ్రామస్వరాజ్యమే దేశ స్వరాజ్యమని గాంధీజీ కలలగన్న ఇన్నేళ్ల స్వతంత్ర  భారతములో పల్లెల అభివృద్ధి అనుకున్నంత జరుగలేదనేది వాస్తవం, విద్యావంతులు సామాజిక సేవకులు రాజకీయాలకు దూరంగ ఉండటం . పల్లెనుండి డిల్లి రాజకీయాల వరకు పాలన వ్యవస్థలో అసమర్దులే వుండటం ప్రధాన కారణం. పల్లెను అభివృద్ధి చేసిచూపించాలనుకున్న సర్పంచ్ ఇంద్రదేవ్ .ఊరి బడికోసం తీసుకున్న నిర్ణయం తెలుగు రాష్ట్రాలల్లో చర్చనియాంశంగామారింది.

చుట్టూ వాగులు వానకాలమొస్తే ఈత కొట్టుకుంటూ బడికి వెళ్లాల్సిన పరిస్థితి. సాధారణ రాకపోకలు సైతం నిలిచిపోయేది అలాంటి ఆ పల్లెల్లో ఇప్పుడిప్పుడే వాగులపైన బ్రిడ్జిలు నిర్మించడం జరిగింది కొన్ని వంతెన పనులు అర్దాంతరంగ నిలిచి పోయాయి.పచ్చని పంట పొలాలు చెరువులు పక్షుల రాగాలతో ఇప్పటికి పల్లెతనాన్ని నింపుకొన్న వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మైసంపల్లి గ్రామం    సామాజిక మాద్యమాలల్లో దేశవ్యాప్తంగా గుర్తింపు పొండింది.

ఒక్కవెలుగు వెలిగిన ఊరి బడి పిల్లలు రాక వెలవెలబోతుంది.పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ప్రతి సంవత్సరం పడిపోతుంది ఒకప్పుడు బడిలో ఎక్కువమంది పిల్లలు చదువుకునేది ఇప్పుడు పట్టుమని ఆరుగురు కూడా లేకుండా పోయింది. కొత్తగా ఎన్నికైన గ్రామపంచాయితీ పాలకమండలి ఊరి బడికోసం ముందుకు వచ్చింది. ప్రభుత్వ బడికి తమ పిల్లలలను పంపిస్తే ఇంటిపన్నును రద్దు చేస్తామని గ్రామసర్పంచ్ ఇంద్రదేవ్ చేసిన ప్రతిపాదనను పాలకమండలి ఆమోధించింది. ఈ నిర్ణయం సామాజిక మాద్యమాలు, మీడియాలో వైరలయ్యి తెలుగు రాష్ట్రాలల్లో ప్రభుత్వ పాఠశాలల బలోపితానికి ఇలాంటి నిర్ణయాలు అవసరమని చర్చకు వచ్చింది. సర్పంచ్ ఇంద్రదేవ్ నిర్ణయాన్ని తెలుగు ప్రజలు స్వాగతిస్తున్నారు.

       

రాజకియాల్లోకి రావలంటే ఆర్థికంగా, ఎదిగి వుండాలి, ఎవరైనా నేత సహాకారం వుండాలి. ఇంద్రదేవ్ కు ఆ రెండులేవు తండ్రి సారంగం ఊళ్ళో కారోబార్ తల్లీ వ్యవసాయ కూలీ కుటుంబ పోషనే కష్టంగా ఉండేది.ఇంద్రదేవ్ ను మాత్రం ఉన్నత విద్యను చదివించారు. ఎం ఏ,బిఈడి, ఎల్ ఎల్ బి పూర్తి చేసిన ఇంద్రదేవ్,చుట్టుపక్కల పల్లెల్లో విద్యావంతుడిగా మంచి గుర్తింపు పొందాడు

సాధారణంగా విద్యావంతులు రాజకీయాల వైపుకు రావడానికి ఆసక్తి చూపరు. విద్యార్థి దశలో విద్యార్థి ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న చాల మంది విద్యార్థులు కేరీర్ వైపు మళ్లుతారు ఉద్యోగాల వేటలో పడిపోతారు. ఇంద్రదేవ్ మాత్రం అలా చేయలేదు తాను చదువుకుంటున్న క్రమంలో చెలకాని సదానందం తో పాటుగాస్నేహ యూత్ ను గ్రామంలో ఏర్పాటు చేసి స్వచ్చందంగ గ్రామంలో అభివృద్ధి పనులకి యూత్ ద్వారా ముందుకు సాగారు.

తెలంగాణ సాధన ఉద్యమంలో విద్యార్ధి నాయకుడిగా కదిలారు.  రాజకీయాలు ఎవరి సొత్తుకాదని న్యాయవాదవృత్తిని వదిలివేసి పూర్తి స్థాయిలో రాజకీయాల వైపు మళ్ళారు. దుగ్గొండి మండలం యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగ రాజకీయ జీవితంలో అరంగేట్రం చేసిన ఇంద్రదేవ్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గా మూడు సార్లు కొనసాగారు. కాంగ్రెస్ పార్టీలో మంత్రులుగా కొనసాగిన బలరాం నాయక్, రెడ్యానాయక్ ల కొడుకులు యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా కొనసాగుతున్న క్రమంలో రాజకీయ నేపథ్యంలేని కుటుంబం నుండి వాళ్ళతో పాటే యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగారు.

రాజకీయాల్లోకి రావాలంటే కుటుంబనేపథ్యమే అవసరం లేదని మన బలమైన నిర్ణయాలే మనల్ని నేతలుగా నిలబెడుతాయనిఅర్థమైన ఇంద్రదేవ్ బలమైన నమ్మకంతో తనకు ఇష్టమైన రాజకీయాలవైపుకు స్వంత నిర్ణయాలతో కదిలారు.

ఇంద్రదేవ్ లోని చురుకుధనం నాయకత్వ లక్షణాలు చూసిన నర్సంపేట ఎంఎల్ఏ దొంతి మాధవ రెడ్డి తానున్నాననే ప్రోత్సాహన్ని అందించడంతో ఇంద్రదేవ్ కు దొంతి మాధవరెడ్డి రాజకీయ గురువయ్యారు . ఇంద్రదేవ్ రాజకీయంగ ఎదుగుదలకు తొడయ్యాడు.

ఒకప్పుడు కనీస సదుపాయాలు లేని మైసంపల్లి గ్రామంలో ఆర్యసమాజం ప్రభావం వుంది. ఆర్యసమాజం భావజాలం కలిగిన ఉపాధ్యాయుడు వెంకటయ్య గ్రామంలో విద్యా వ్యాప్తికి కృషి చేశారు బడికి అడుగులు వేయాల్సిన బాల్యం వ్యవసాయ కూలీలుగా, పశువుల కాపారులుగా పనిచేస్తుండటం చూసి చలించిపోయాడు వెంకటయ్య,పిల్లలను తల్లిదండ్రులను ఒప్పించి బడికి రప్పించారు. చదువుకు దూరమైన మైసంపల్లిని అక్షర వనంగా మార్చాడు.

నాలుగు వందల యాభై ఇళ్ళు ఇళ్ళు రెండు వేలజనాభ వెయ్యి మంది ఓటరలున్న మైసంపల్లిలో తొంబై శాతం మంది విద్యావంతులు వున్నారు.పేదరికం వున్నప్పటికీ కనీససౌఖర్యాలులేని పల్లె అయినప్పటికీ ఇద్రదేవ్ లాంటి వాళ్ళు పేదరికాన్ని అధిగమించి విద్యావంతులుగా నిలబడ్డారు.

మైసంపల్లి అభివృద్దే లక్ష్యంగ పనిచెస్తున్న ఇంద్రదేవ్ గ్రామంలో మొదటగా తనలాంటి వాళ్లలో అక్షరజ్యోతులు వెలిగించిన బడికి పూర్వ వైభవం తీసుకరావాలనుకున్నారు అందులో భాగంగానే సర్కారు బడికి పిల్లలను పంపిస్తే ఇంటిపన్ను మాఫీచేస్తామనే నిర్ణయాన్ని ప్రకటించారు. గ్రామంలోని సర్పంచ్ ఇంద్రదేవ్ తో సహా ఎనమిది మంది వార్డు సభ్యులు రద్దు చేసిన ఇంటి పన్నును తమ స్వంత డబ్బులతో గ్రామపంచాయితీ ఖాతలో జమ చేస్తామని ప్రకటించారు. గ్రామపంచాయితీ నిర్ణయాన్ని మైసంపల్లి ప్రజలే కాదు ప్రతి పల్లెనుకదిలించాయి.

ముద్దునూర్ గ్రామపంచాయితిలో ఆమ్లెట్ గ్రామంగ వున్న మైసంపల్లి 1 జూలై 1980న స్వంత గ్రామపంచాయితీగా ఏర్పడ్డది తొలి సర్పంచ్ గా లకిడే లింగరావు, రెండు పర్యాయలు పనిచెశారు. బొల్లపల్లి ఐలయ్య, దాసరి విజయ,ఈర కుమారస్వామి, సోలేంకి మల్లమ్మ, గంగారపు వనమాల, లు సర్పంచ్ లుగా కొనసాగి గ్రామాభివృద్ధికి తోడయ్యారు.

చిన్న గ్రామమైన అనేకమంది విద్యావంతులను అందించింది మైసంపల్లి ఈ దేశ సేవలో ఆర్మీ లో పనిచేస్తున్న సాయి,ప్రముఖ ఫిజీసియన్  డాక్టర్  మహమ్మద్ అజీత్ , పిల్లల వైద్యులు డాక్టర్   మంగ బాలక్రిష్ణ,  వ్యవసాయ విస్తీర్ణఅధికారులు,ఎనమిది మంది ఉపాధ్యాయులు, ఒకరు జర్నలిస్ట్ అనేక మంది ప్రైవేట్ బ్యాంకింగ్ ఇతర రంగాలల్లోనే కాకుండా రైతులుగా విద్యావంతులు పనిచేస్తున్నారు.

విద్యావంతులనుకన్న మైసం పల్లిలో సర్కారు బడికి ప్రాణం పోయాలకనుకున్న ఇంద్రదేవ్ కు ఊరు తన వెంట నడుస్తుంది. మైసంపల్లిని అక్షరవనంగామార్చేందుకు కృషి చేస్తున్నారు. గ్రామంలో పారిశుధ్య పనులు, మురికి కాల్వల నిర్మాణం, నిర్మాణం మొదలువ్వని నీరుకుళ్ళ మైసంపల్లి వాగుపై బ్రిడ్జి నిర్మాణం క్రీడా రంగం గ్రంధాలయం, అందరికి ఉపాధి కల్పించేవిధంగా ఇంద్రదేవ్ కృషి చేస్తున్నారు, ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న తన భార్య అనితదేవ్ ను తమ గ్రామానికి బదిలిచేపించిమరింత సేవలు అందించాలని చూస్తున్నారు. ఒక్క ప్రభుత్వ బడినే కాదు గ్రామస్వరూపాన్ని మార్చి దేశంలో మైసంపల్లిని ఆదర్శగ్రామంగ నిలబెట్టాలను కుంటున్న ఇంద్రదేవ్ కు పాలకులు అధికార యంత్రాంగం, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తే గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేయవచ్చు, బడికోసం నిలబడిన ఇంద్రదేవ్ సంకల్పం నెరవేరుతుందని మైసంపల్లి సర్కారీ బడి విద్యార్థులతో కళకళలాడుతుందని ఆశీద్దాం

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *