హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఈ నెల 12 న సమాచార హక్కు సదస్సు

 

 

ఈ సదస్సుకు సంబంధించిన కరపత్రాన్ని నల్గొండ జిల్లా కలెక్టర్ గౌరవ *బి. చంద్రశేఖర్, విడుదల చేశారు.

 

.

ఎలకంటి నరేష్ తెలంగాణ బ్యూరో చీఫ్ పుడమిటివి

 

సమాచార హక్కు పరిరక్షణ సమితి,ఎలక్షన్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులుముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సమాచార హక్కు చట్టం ఆవిర్భావ దినోత్సవ సదస్సు ఈ నెల 12 న * ప్రెస్ క్లబ్, సోమాజిగూడ, హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు
సమాచార హక్కు పరిరక్షణ సమితి ప్రకటించింది

 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, సంస్థ చేస్తున్న సేవలను మెచ్చుకుంటూ, సమాచార హక్కు చట్టం మరియు ఓటర్లను చైతన్యం చేయడానికి కృషి చేస్తున్న డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్ చేస్తున్న కార్యక్రమాలను ప్రశంసించారు.

జిల్లా కలెక్టర్ కు ధన్యవాదాలు తెలుపుతూ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు మాట్లాడుతూ, హైదరాబాద్‌లో జరగనున్న సదస్సుకు కార్యకర్తలు బాధ్యత వహించి, పలువురు ప్రముఖులు అందరూ హాజరయ్యే విధంగా కృషి చేసి సదస్సును విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సంస్థ ముఖ్య సలహాదారుడు కోట్ల రామలింగయ్య, పుట్ట విజయ్ కుమార్, కర్నాటి యాదగిరి, కాసుల అజయ్ కుమార్, మేకల శ్రీహరి, తాటి నిరంజన్, మామిడి యాదయ్య, గండి రాము, కారింగు శ్రీకాంత్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *