బడిబాటలో పిల్లలు – డ్రగ్స్‌కు దూరంగా యువత

పుడమిటివి

 

 

వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో “విద్యా ప్రేరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

 

ఎలకంటి నరేష్ తెలంగాణ బ్యూరో చీఫ్ పుడమిటివి

“విద్యా ప్రేరణ” తో స్కూల్ డ్రాప్‌అవుట్ విద్యార్థులకు వరంగల్ పోలీసుల అండ పాఠశాల మానేసిన విద్యార్థులను తిరిగి బడిబాట పట్టించి, వారిని డ్రగ్స్, ధూమపానం మరియు ఇతర చెడు అలవాట్లకు దూరంగా ఉంచే లక్ష్యంతో వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో “విద్యా ప్రేరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

మాదకద్రవ్యాల వినియోగంపై నిర్వహించిన విశ్లేషణలో యువతలో డ్రగ్స్‌కు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించిన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

వరంగల్ సబ్-డివిజన్‌లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదువు మానేసిన 42 మంది విద్యార్థులను గుర్తించారు. వారిలో 22 మంది విద్యార్థులను కౌన్సెలింగ్, తల్లిదండ్రులతో చర్చలు మరియు అవసరమైన సహాయ సహకారాలతో విజయవంతంగా తిరిగి పాఠశాలల్లో చేర్పించారు.

ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు పుస్తకాలు, నోట్‌బుక్స్, స్టడీ మెటీరియల్ తదితర విద్యా సామాగ్రిని అందించి చదువు కొనసాగించేలా ప్రోత్సహిస్తున్నారు.

విద్యార్థులను తిరిగి పాఠశాలకు చేర్పించడంతో కార్యక్రమం ముగియదని, వారి పాఠశాల హాజరు, విద్యాభ్యాసం మరియు ప్రవర్తనను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన కౌన్సెలింగ్, ప్రోత్సాహం అందిస్తామని వరంగల్ పోలీసులు తెలిపారు. “ప్రతి పిల్లవాడిని బడిలో ఉంచడం – డ్రగ్స్‌కు దూరంగా ఉంచడం – వారి భవిష్యత్తును కాపాడడం” తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *