ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన భారత మహిళల హాకీ జట్టుకు ప్రధానమంత్రి అభినందనలు

పుడమిటివి క్రీడా న్యూస్

 

                                                                                                                       ప్రధాని మోదీ

                                                               నాగబెల్లి జితేందర్ సామ్రాట్ -ఎడిటర్ ఇన్ చీఫ్ పుడమి టివి

నాలుగు దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన భారత మహిళల హాకీ జట్టును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

అద్భుతమైన నైపుణ్యం, సమష్టి కృషి ఫలితంగానే ఈ విజయం సాధ్యమైందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. జట్టు ప్రదర్శించిన దృఢ సంకల్పం స్ఫూర్తిదాయకమని ప్రధాని ప్రశంసించారు.

భారత మహిళల హాకీ జట్టు భవిష్యత్తు ప్రయత్నాలకు
మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయం దేశవ్యాప్తంగా హాకీ క్రీడకు మరింత ప్రజాదరణ తీసుకురావడానికి దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
.

‘‘భారత హాకీకి ఇది ఎంతో ప్రత్యేకమైన సందర్భమని ప్రధాని మోదీ అన్నారు.

నాలుగు దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఆసియా క్రీడల్లో ప్రతిష్ఠాత్మక స్వర్ణ పతకాన్ని సాధించి స్వదేశానికి అందించిన మహిళల హాకీ జట్టు విజయంపై భారత ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అద్భుతమైన నైపుణ్యం, సమష్టి కృషి ఫలితమే ఈ విజయం. వారి పట్టుదల ఎంతో స్ఫూర్తిదాయకం. హాకీ జట్టు భవిష్యత్తు ప్రయత్నాలకు నా శుభాకాంక్షలని ప్రధాని కొనియాడారు.

ఈ విజయం దేశవ్యాప్తంగా హాకీకి మరింత ప్రజాదరణ తీసుకురావడానికి దోహదపడాలని : ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ’’ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *