మదన్న మాట గాడిపల్లి మధు
సీనియర్ జర్నలిస్
ఈ కాలంలో అన్నీ పరిచయాలు మాత్రమే స్నేహాలు చాలా తక్కువ ఆ పరిచయస్తులను కూడా దూరం చేసుకోవద్దను కుంటే,వారి మధ్య ఇచ్చి పుచ్చుకోవడాలు మొదలు కావద్దు మొదలైనా సజావుగా సాగాలి…
సఫలం , వైఫల్యం ఈ రెండింటికి ఎక్కడా ముగింపు ఉండదు. కొన్ని సార్లు మనమనకున్న వాటిలో సఫలీకృతం ఐన తరువాత కూడా, కొన్ని కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. అప్పుడు మళ్లీ ప్రయత్నం అనేది కొత్తగా మొదలవుతుంది
మీరిచ్చే సలహాలకు ప్రాధాన్యత లభించాలంటే స్వీకరించే వారి అవసరానికి తగ్గట్టు, వారు కోరినప్పుడే ఇవ్వండి. మీ సలహా బాగుందని అసందర్భోచితంగా ఇస్తే అది మంచిదైనా కూడా వారు స్వీకరించక పోవచ్చు పైగా మీవిలువ కూడా కోల్పోతారు…
అవసరాల కోసం గోడల మీద,అవసరం తీరాక గోడల వెనుక ఉండే వారి వల్ల అనుబంధాలకుపగుళ్లు వస్తున్నాయి. పటిష్టమైన బంధాలు కూలి బలమైన గోడలు నిర్మాణమౌతున్నాయి…
నెంబర్ : 9440146261
