లింగాల కేదారి కుటుంబానికి సిఎం పదిలక్షల సహాయం

పుడమి టివి

 

 

సిఎం రేవంత్ రెడ్డి                           

 

 

నాగబెల్లి జితేందర్ సామ్రాట్ ఎడిటర్ ఇన్ చీఫ్ పుడమి టివి ఎంవిఆర్ మానవ వికాస రచనలు

 

వేలాది మందికి అన్నం పెట్టిన చేతులు అప్పుల పాలై ఆస్తులను అమ్ముకొని మానసికంగా కుంగిపోయి తమను తాము చంపుకున్నసంఘటన అందరిని కదిలించింది కన్నీళ్లు తెప్పించింది.

యాభై రూపాయలకే భోజనం అందించి అన్నం వృధా చేస్తే జరిమాన విధించి కొత్త ఒరవడిని సృష్టించి తెలుగురాష్ట్రలల్లో ప్రత్యేక గుర్తింపు పొందారు

అదాలత్ సెంటర్లో లింగాల ఫుడ్ కోర్ట్ ద్వార ఎంతమందికి అన్నం పెట్టాడో… అమరవీరుల స్తూపం కాడికి వచ్చిన తెలంగాణ ఉద్యమకారుల ఆకలి పేగుల శబ్దం విని అన్నం పెట్టిన లింగాల కేదారి దంపతుల మరణం విని ఓరుగల్లు గొల్లున ఏడ్చింది అందరికి తెలిసిందే మన్కి బాత్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నోటా లింగాల కేదారి పేరు వినిపించింది. అలాంటి దంపతులమరణం. ఇవాళ తెలంగాణ ప్రభుత్వాన్ని కదిలించింది. కొంతమేరకు చేయుత నందించేందుకు పదిలక్షల రూపాయలను సిఎం రేవంత్ రెడ్డి ఆకుటుంబానికి అందించడానికి అధికారులను ఆదేశించారు.
సిఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ, ఓరుగల్లు ప్రజల తరపున పుడమి టివి కృతఙ్ఞతలి చెపుతుంది.

సి ఎం ఆదేశాలు మన పుడమి టివి పాఠకుల కోసం…

తెలంగాణ మలిదశ ఉద్యమంలో అంకితభావంతో సేవలందించిన దివంగత లింగాల కేదారి, ఆయన భార్య దివంగత, పుష్పలత కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుంచి రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో లింగాల కేదారి, పుష్పలత అంకితభావంతో అందించిన సేవలను ముఖ్యమంత్రి గారు గుర్తు చేసుకున్నారు. కేదారి దంపతులు ఒక సాధారణ హోటల్ నడుపుతూ, అన్నం పరబ్రహ్మ స్వరూపమని, వృథా చేయకూడదని అవగాహన కల్పిస్తూ, సమాజం పట్ల ఎంతో బాధ్యతగా నడుచుకున్నారు. ఉద్యమ సమయంలో వీరు ఉచితంగా భోజనం, టిఫిన్లు, టీలు అందించారు.

హనుమకొండలోని శాంతినగర్, పోస్టల్ కాలనీకి చెందిన లింగాల కేదారి 2026 సెప్టెంబర్ 9న, ఆయన భార్య పుష్పలత 2026 సెప్టెంబర్ 10న విషాదకర సంఘటనలో మృతి చెందారు. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి సిఎంఆర్ ఎఫ్ నుంచి సీఎం ఓఎస్డీ రూ. 10 లక్షల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేశారు.

మంజూరైన ఆర్థిక సాయాన్ని అర్హులైన చట్టబద్ధ వారసులు, కుటుంబ సభ్యులకు అందించేలా చర్యలు తీసుకోవాలని హనుమకొండ కలెక్టర్‌ను ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *