వలస బతుకుల పిల్లల్లో విద్యా దీపాలు వెలిగిస్తున్న సిపి సన్ ప్రీత్ సింగ్

 

     

వరంగల్ సిపి సన్ ప్రీత్ సింగ్

నాగబెల్లి జితేందర్ సామ్రాట్
ఎడిటర్ ఇన్ చీప్
పుడమిటివి న్యూస్ &ఎంవిఆర్ మానవ వికాస రచనలు పబ్లికేషన్స్

7799071177

చిదిమేయబడుచున్న బాల్యాన్ని అక్షరాలతో అక్కున చేర్చుకొని, వలస కూలీల పిల్లల్లో విద్యాదీపాలు వెలిగిస్తూ ఏళ్లకు ఏళ్ళు ఎవరు తొంగి చూడని ఓ మానవ సమాజాన్ని చూసి చలించి పోయి ఈ దేశానికి మనమందించేది జ్ఞాన సంపదమాత్రమే నంటూ ఓరుగల్లు గడ్డపై వలన కూలీల పిల్లలను బడిలో చేర్పించాలని సిపి,సన్ ప్రీత్ సింగ్  కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. 

కన్నతల్లీ లాంటి ఊరిని వదిలి పల్లెలు పట్నాలు దాటుతూ పొట్టకూటి కోసం వేలకీలోమీటర్లు దాటి శ్రమ తప్ప వేరే ప్రపంచం తెలియని వలస బతుకులను పట్టించున్న వారు కరువే. రాత్రింబవళ్ళు కష్టపడి బుక్కెడు బువ్వతో సేద తీరే వాళ్ళ జీవితాలమీద స్థానిక నేతలకు అవసరం లేకపోవచ్చు ఎందుకంటే వాళ్ళు వీళ్ళ ఓటు బ్యాంక్ కాకపోవడమే కారణం కావచ్చు, వాళ్ళను పని మనుషులుగా తప్ప మనుషులుగా గుర్తించని సమాజం వుందనేది జగమెరిగిన సత్యం, సంవత్సరాల తరబడి ఇక్కడే జీవిస్తున్న వాళ్ళ పిల్లలు ఏమి పాపం చేసారని మూడు దశబ్దాలుగా చదువుకు దూరమై మళ్ళీ వలస కూలీలుగా మారిపోయి జీవితాలను కొనసాగిస్తున్నారు.

                 

వరంగల్ ఏనుమాముల మార్కెట్ సమీపములో కోల్డ్ స్టోరేజ్ లు, చిన్నతరహా పరిశ్రమలు మార్కెట్ పనులల్లో వందలాది మంది వలస కూలీల కుటుంబాలు జీవిస్తున్నాయి, కుటుంబమంత పనులకు వెళ్ళితే పిల్లలు దుబ్బలో ఆడుకుంటూ చింపిరి జుట్టుతోకనిపిస్తారు. ఇతర రాష్ట్రల వాళ్ళు కావడం మాతృభాష కాకపోవడం వారికి కనీస పౌష్టిక ఆహరం అందక పోవడం గుర్తించిన ఏనుమాముల సిఐ జువ్వాజీ సురేష్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. అక్కడి పిల్లల దీన స్థితిని చూసి చలించిపోయిన సిపితక్షణమే ఆ పిల్లలను పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చదువు చెప్పించాలనే ఆలోచనకు శ్రీకారం చుట్టారు.

ఏనుమాముల మార్కెట్ చుట్టుపక్కల నివశిస్తున్న పిల్లలను గుర్తించి రెండు వందల మందికి పైగా పిల్లలను బడిలో చేర్పించెందుకు ఏర్పాట్లు చేశారు. ఇతర రాష్ట్రాలకు సంబందించిన వారిలో చదువుకున్న వారిని గుర్తించి ఉపాధ్యాయులుగా నియమించారు.స్వచ్చంద సంస్థల సహకారంతో పిల్లలకు యూనిఫామ్స్, పుస్తకాలు పంపిణి చేశారు సిపి సన్ ప్రీత్ సింగ్ ప్రత్యేక చొరవతో జిల్లా కలెక్టర్, విద్యాశాఖధికారితో సంప్రదింపులు జరిపి వారికి ఏనుమాములలోని ఎన్ టి ఆర్ ప్రభుత్వ పాఠశాలలో వసతులు కల్పించి వారికి మెరుగైన విద్యాబోధనకు ఏర్పాట్లు చేశారు.

సిపి ఆదేశాలతో ఏనుమాముల సిఐ సురేష్ మరింత చొరవతీసుకొని తన స్వంత డబ్బులతో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్న తీరుపై
సిపి అభినందసిస్తున్నారు. నిజంగా సురేష్ పిల్లలపై చూపిస్తున్న ప్రేమ వాళ్ళ కుటుంబాలకు ఇస్తున్న గౌరవం ఒక పోలీసులో సామాజిక స్పృహ కలిగిన సంఘసంస్కర్త కనిపిస్తారు.

ఒక్క ఏనుమాముల మార్కెట్ నే కాదు కమిషనరేట్ పరిధిలో ఇటుక బట్టీల్లో ఇతర రంగాలలో పనిచేస్తున్న వలస కూలీలు నివశించే ప్రాంతాలను గుర్తించి వారి పిల్లలకు విద్యాబోధన చేయాలని పోలిస్ శాఖ స్వచ్చంద సంస్థల సహకారంతో వలస కార్మికుల పిల్లలను బడి బాట పట్టిస్తున్నారు.ఖిలా వరంగల్ మండలం గుంటూరుపల్లి పరిసర ప్రాంతాలల్లో ఇటుక బట్టీలల్లో పనిచేస్తున్న 120మంది పిల్లలను బడిబాట పట్టించారు.

సంచలనాలకు సామాజిక సేవకు వరంగల్ పోలీసులది ప్రత్యేకత వుంటుంది. నేరాలను తగ్గించడంలో ముందు వరసలో నిలబడే వరంగల్ పోలీసులు యువతకు, విద్యార్థులకు నేరాలపాలు కాకుండా డ్రగ్స్ లాంటి మహమ్మారిలకు బలికాకుండా చైతన్యవంతం చేసే కార్యక్రమాలను నిర్వర్తించడం, ఫ్రెండ్లీ పోలీస్ విధానంతో ప్రజలకు దగ్గరవ్వడం, నేరస్థులపట్ల కఠినంగా వుండటం, నేరాలను, మిస్టరీలను చేదించడంలో వరంగల్ పోలీసులు విక్టరీ పోలీసులుగా నిలబడ్డ చరిత్ర వున్నది.

చట్టప్రకారం విద్యను అందించాలని, ఇటుక బట్టీలు ఇతర రంగాలల్లో బాల కార్మికులను బడికి పంపించకుండా పనిలో పెట్టుకుంటే ఓనర్లు, ఇతరులు, ఎవరైనా పిల్లల్ని పనిలో పెట్టుకున్నట్లైతే జీవనల్ జస్టిస్ యాక్టివ్ మరియు ఇతర చట్టాలప్రకారం శిక్ష పడుతుందని, ఇటుకబట్టిలు నిర్వహించే యజమానులు బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించుటకు సహకరించాలానేది పోలీస్ శాఖ కోరుకుంటుంది

ఆదిమమానవుడి నుండి ఆర్ట్ ఫిషియల్ ఇంటలిజెన్సీ వరకు ఎదిగిన మన స్వతంత్ర భారతదేశంలో వజ్రోత్సవ వేడుకలు జరుపుకున్న ఈ నేలమీద లక్షలాది మంది పిల్లలు కనీసం బడిబాట పట్టక పోవడం అందులో వలస కార్మికుల కుటుంబాలల్లో ఇంకా విద్య అందని జీవితాలు వుండటం ఏ కోణంలో చూద్దామో ఆలోచించాలి,

బాల్యజీవితానికి ఒక చిరునామా ఉండాలి అది అక్షరవనంలో వికశించాలి అనే సంకల్పంతో ఖాకీ చేతుల్లో లాఠిలు తుపాకులే కాదు కలాలు కవాత్ చేస్తాయి పసిపిల్లలు హృదయంలో అక్షరాలను మొలకెత్తిస్తాయి పసిహృదయాలను గుండెలకద్దుకొని జ్ఞాన సంపన్నులుగా తయారు చేస్తూ దేశ శక్తులుగా మార్చేసంకల్ప దీక్షతో ముందుకు సాగుతూ, పసిపిల్లలుముఖంపై,చిరునవ్వులను పూయిస్తున్న వరంగల్ పోలీసు కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ కు ఏనుమాముల సిఐ జూవ్వాజీ సురేష్ కు పోలీస్ శాఖకు పుడమి టివి వినమ్రంగ నమస్కరిస్తుంది అభినందిస్తుంది సెల్యూట్ చేస్తుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *