సవరించిన రీఫండ్ తో అదనపు భారం పడదు

పుడమి టివి న్యూస్

టికెట్ రీఫండ్ విధానంలో పారదర్శకత తీసుకురావడంలో భాగంగా, రైల్వే శాఖ ప్రయాణికులకు ముందుగానే తమ టికెట్ కన్ఫర్మ్ అయ్యిందా లేదా తెలుసుకునేందుకు, రైల్వే చార్ట్ తయారీ సమయాన్ని 4 గంటల నుంచి 9–18 గంటల ముందుగా మార్చింది. దీని వల్ల దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ముందుగానే సమాచారం తెలుస్తుంది.

 

రైల్వే చార్ట్ తయారు చేసే సమయంలో చేసిన మార్పులకు అనుగుణంగా రీఫండ్ నిబంధనల్లో కూడా మార్పులు చేశారు. కానీ ఇందులో ఎలాంటి అదనపు ఛార్జీలు లేవు.ఇలా ముందుగానే సమాచారం ఇవ్వడం వల్ల అక్రమంగా టికెట్లు అమ్మే వాళ్లపై కూడా కఠిన చర్యలు తీసుకోవచ్చు.

ఇకపై ప్రయాణికులు ట్రైన్ బయలుదేరే ముందు 30 నిమిషాల వరకు తమ బోర్డింగ్ స్టేషన్ మార్చుకోవచ్చు. అలాగే ట్రైన్ లో సీట్లు ఖాలిగా ఉండే పక్షంలో రైలు బయలుదేరే 30 నిమిషాల ముందు వరకు కూడా క్లాస్ అప్గ్రడేషన్ అయ్యే వెసులుబాటు కల్పించబడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *