

నాగబెల్లి జితేందర్ సామ్రాట్
ఎడిటర్ ఇన్ చీఫ్
ఎం వి ఆర్ మానవ వికాస రచనలు పబ్లికేషన్స్
మనం మాట్లాడే స్వేచ్ఛ వేనుకఎందరి నెత్తురి తడివుందో మనం నడిచే దారి కోసం ఎందరు ప్రాణాలు ధారబోశారో ఎగురుతున్న మూడు రంగుల జెండ కోసం ఎన్ని తలలు తెగిపడ్డాయో మూడు వందల ఏళ్ల పరాయి పాలన విముక్తికోసం సమీదలైన లక్షలాది మంది త్యాగల చరిత మన చరిత్రల్లో రాయబడక పోవచ్చు, దేశం కోసం కొందరి పేర్లు చరిత్రలో నిలబడి పోవచ్చు వాళ్ళ త్యాగాలు ఉండవచ్చు, పేరుకోసం, పోరాటంలో అసలు కదలని వాళ్ళు కొందరు స్వాతంత్ర్య యోధులు కావచ్చు కులబలమో, ఆర్ధిక బలమో వాళ్ళను యోధులుగా నిలబెట్టవచ్చు, వాళ్ళ చరిత్రను వాళ్ళే గొప్పగా రాసుకోవచ్చు రాపించు కోవచ్చు

ఈ దేశవిముక్తి కోసం ప్రాణాలు అర్పించిన వేలాది మంది కిరీటీలు చరిత్రలో కనిపించలేదు ఎందుకంటే దేశం కోసం పోరాడే ప్రతి యోధుడు తన పేరు కిరీటి గానే కదిలాడు అక్కడ మతం లేదు కులం లేదు ఆ రెండులేని భరతదేశాన్ని కలలు గన్న వాళ్ళు నా దేశం ప్రజాస్వామిక రాజ్యాంగ నిలబడాలని కలలు కన్నవాళ్ళు కనిపించని ఆ కిరీటీలు స్వాతంత్ర్య పోరాట యోధులు
రెండు దశబ్దాల క్రితం చదివిన ఒక దేశ భక్తుడి జీవితం గుర్తుకు వచ్చింది డెబ్భతొమ్మిదేళ్లస్వతంత్ర నా భారత దేశం వేడుకల సాక్షిగా, బ్రిటిష్ వాళ్ళను ఈ దేశ ప్రజలపై నరమేదం సృష్టించిన రాజుల రాజ్యలను సమిష్టిగా కూల్చి సాగిన భారత యోధుల జీవిత గాధలు గుర్తుకు వచ్చాయిఈ దేశం కోసం వెన్నెముఖలై నిలబడి సమిధలై నింగి కేగిసిన కిరీటల జీవితాలు గుర్తుకు వచ్చాయి
దేశం కోసం పోరాడుతున్న యోధులు అండమాను నీకొబార్ దివుల్లో బందించబడి మృత్యువును ముద్దాడబోతున్న ఓ వీర యోధుడి వీర గాధ గుర్తుకు వచ్చింది.
ఓ తల్లీ తన కొడుకు కోసం జైలుకు వేళ్ళింది, అందులో హింసను భరిస్తున్న వాళ్ళ ముఖాలాన్ని వాడి పోయి వున్నాయి అక్కడ అందరి పేర్లు కిరీటిలే తన కొడుకు పేరున్న వాళ్ళు అక్కడ ఎవరు లేరు, ఆ వృద్ధ తల్లీ తన కొడుకు పేరుతో వేదికి వెదికి తళ్లడిల్లి సోమ్మశిల్లింది
తన తల్లిని గుర్తుపట్టిన ఆ యోధుడు ఆమెను దగ్గరికి తీసుకున్నాడు, తల్లీ మాత్రం కొడుకును గుర్తుపట్టలేని పరిస్థితి, ఆ యోధుడిని కన్న తల్లిది అమ్మ అని ఆమే వంక చూసి పిలిచాడు నా కొడుకే కావచ్చని ఆ కన్న పేగు తల్లడింది దగ్గరికెళ్లి గట్టిగా పట్టుకోంది తన కొడుకేనని ఇద్దరి కళ్ళల్లో కన్నీళ్లు
ఆ యోధుడు ఆ తల్లితో అమ్మ నా పేరు కిరీటి ఇక్కడి దేశం కోసం సాగే ప్రతి పోరాట యోధుడి పేరు కిరీటీనే నీకొడుకు నాకు తెలుసు ఇప్పటి వరకు అతను బతికే వున్నాడు దేశం కోసం చావడానికైనా సిద్దపడి సాగుతున్నాడు చిన్నప్పటి నుంచి నువ్వు పంచిన ప్రేమ తాను గుర్తుచేశాడు నీ లాంటి తల్లికి పుట్టడం ఈ దేశ విముక్తి పోరాటంలో సాగడం నాతల్లీ చనుబాల బలమని చెప్పాడు, ఒక వేల నీకొడుకు మరణిస్తే కన్నీళ్లు రాల్చకు ఈ దేశ విముక్తి కోసం మరో వీరుడికి నీ కొడుకు గురించి చెప్పమన్నాడు
అప్పటికే జైలు సిబ్బంది వచ్చారు. ఆ వీరుడు తల్లిని ప్రేమతో దగ్గరకు తీసుకొని వీడ్కోలు పలికాడు కన్న పేగు కదా తన కొడుకు కాదని చెప్పిన తన కొడుకేనని గుర్తించి ఈ దేశం కోసమే తన పేరు చెప్పుకోకుండా కిరీటీగా తన కొడుకు మారాడని అర్ధమైన తల్లీ గుండెనిండా ఈ దేశగడ్డ మీద మూడు రంగుల జెండా ఎగురుతుందని అక్కడి నుండి వేల్లిపోయింది
కొద్ది రోజులకే ఆ స్వాతంత్ర్య యోధులను దేశ ద్రోహులుగా నిర్ణయించి బ్రిటిష్ ప్రభుత్వం ఉరి తీయడానికి తీసుకెళ్లుతున్నారు అందులో జైలు అధికారి అడిగాడు మీరు మరణిస్తే మీ శవాలను ఎవరికీ అప్పగించాలి ఇప్పటికైన మీ పేరు మీవాళ్ళ చిరునామా చెప్పమని,అన్నాడు, ఏమయ్యా స్వంత తల్లీ వచ్చిన నువ్వు తన కొడుకువు కాదని పంపించావు అంటూ కిరీటిని అడిగాడు, ఆమే మా అమ్మ కాదు ఈ దేశ విముక్తి కోసం సాగుతున్న వీరులను కన్న తల్లులల్లో ఆమే ఒకరు మీరు ఉరి తీసిన వెంటనే మమ్మల్ని ఈ మట్టిలోనే కలిపేయండి ఎందుకంటే మేము ఈ మట్టి కోసమే పోరాడుతున్నామని సమాధానం ఇచ్చాడు ఆ అధికారికివాళ్ళు ఉరి తీయబడ్డారు ఈ దేశ మట్టిలో కలిసిపోయారు దేశాన్ని విముక్తి కల్పించిన యోధులుగా నిలబడ్డారు వాళ్ళ పేర్లు స్వాతంత్ర్య యోధుల పేర్ల జాబితాలో లేకపోవచ్చు కిరీటలుగానే జీవించారు దేశం కోసం జీవితాలను త్యాగం చేసి సాగారు అంతా నూనుగు మీసాల నవ యవ్వన శక్తులే వాళ్ళు

మేమంటే మేము ఈ దేశం కోసమని మాట్లాడుతున్న నేటి తరం రాజకీయ పార్టీలు మతం కోసం కులం కోసం దేశ రాజకీయాలను నడిపిస్తున్న వాళ్ళు, దేశభవిష్యత్ ను ముందు తరాలకు ఇప్పుడే గందరగోళన్ని సృష్టిస్తున్న వాళ్లకు ఈ దేశం కోసం త్యాగం చేసిన జీవితాలని ఒక్క సారి తడిమి చూస్తే బాగుండు కిరీటిలుగా బతికి పోరాడి అసువులు బాసిన యోధుల కలలు అర్ధమైతే బాగుండు మన దేశం ప్రపంచంలో ఒక కిరీటమై నిలబడేది
మన దేశ విముక్తి కోసము ప్రాణాలను త్యాగం చేసిన ప్రతి ఉద్యమ కిరీటకి, యోధుడికి ఈ మట్టి కన్నీళ్లు కారుస్తూనే వుంటుందిగ,స్వార్థం లేని దేశభక్తులని భూతల్లి తన ఒడిలోన చేర్చుకొని నా దేశ పంచభుతాలాల్లో మమేకమై దేశ జెండాలో అకాశం ఎత్తున రెఫరెఫ లాడుతూనే వుంటుంది.