సమిష్టి కృషితో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు విజయవంతం : టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడు

పుడమిటివి న్యూస్

టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడు

 

 

నాగబెల్లి జితేందర్ సామ్రాట్
ఎడిటర్ ఇన్ చీఫ్ పుడమిటివి

తిరుమల తిరుపతి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను సమిష్టి కృషితో విజయవంతం చేశామని టిటిడి ఛైర్మెన్ బి ఆర్ నాయుడు,అన్నారు.ఎనమిది రోజుపాటు సాగిన సాలకట్ల బ్రహ్మోత్సవాలకు 5.76 లక్షల మంది భక్తులు శ్రీవారి దర్శనంచేసుకున్నారని అన్నారు.ఈ సందర్బంగా బ్రహ్మోత్సవాల వివరాలను ఆయన వెల్లడించారు.

బ్రహ్మోత్సవాల సందర్బంగా హుండీ కానుకలు రూ.28.94 కోట్లు భక్తులు సమర్పించున్నారని – 33 లక్షల లడ్డూల విక్రయం జరిగినట్లు చెప్పారు.

21.84 లక్షల అన్నప్రసాదాల పంపిణీ – 2.04 లక్షల మంది తలనీలాలు సమర్పణ జరిగిందని అన్నారు.

వాహనసేవలకు ముందు ఇప్పటివరకు లేనివిధంగా 20 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం నుంచి 295 కళాబృందాలకు చెందిన సుమారు 7,871 మంది కళాకారులు వివిధ కళారూపాలను ప్రదర్శించారని తెలిపారు

గరుడసేవ రోజున 14 రాష్ట్రాల నుంచి 32 కళాబృందాలకు చెందిన 916 మంది కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారని అన్నారు.

బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో సుమారు 60 టన్నుల పుష్పాలు, 4 లక్షల కట్‌ఫ్లవర్స్, 80 వేల సీజనల్ ఫ్లవర్స్ వినియోగించి పుష్పాలంకరణ చేపట్టామని వెల్లడించారు..

బ్రహ్మోత్సవాల సందర్భంగా 3,000 మంది పోలీసులు, 2,400 మంది విజిలెన్స్ సిబ్బందితో భద్రతా చర్యలు చేపట్టామని అన్నారు . గరుడసేవ రోజున అదనంగా మరో 1,000 మంది పోలీసులు విధుల్లో పాల్గొన్నారని అన్నారు

బ్రహ్మోత్సవాల్లో లక్షలాది మంది భక్తులకు సేవలందించేందుకు 4,000 మంది శ్రీవారి సేవకులు విశేష సేవలు అందించారని సాలకట్టు బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసిన ప్రతిఒక్కరికి టిటిడి ఛైర్మెన్ కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *