ఎంవిఆర్ భవనం నుండి
పుడమిటివి జనసాహిత్యం
నాగబెల్లి జితేందర్ సామ్రాట్
ఎడిటర్ ఇన్ చీఫ్ పుడమిటివి ఎంవిఆర్ మానవవికాసరచనలు
పటాకుల నుండి వెనక్కి రెండు అడుగులు వేసిండో లేదో గట్టిగా పిలిచింది
వీరు యాడికి పోతున్నావు ఆగు,
ఈశ్వరీ ఇంట్లోకిపో నన్ను పోనియ్యి.. మళ్ళి వస్తా…
చెయ్యి గట్టిగా పట్టుకున్న తులసమ్మ చెయ్యిని విడవమంటుంది.
బాపమ్మ యిడువు చెయ్యి, ఆగవే ఊరోళ్లు సూత్తే ఇంకేమైనా వున్నాద..
గవన్ని నాకు తెల్వదు,
చేయ్యిని వదిలించుకొని పరిగెత్తి వీరును కవగలించుకుంది.
నన్ను వదిలి వెళ్లకు వీరు, ఎక్కడికైనా తీసుకుపో
వద్దు ఈశ్వరి.. ఇప్పడికిప్పుడు ఎక్కడికి పోతాము ఎక్కడికైన తీసుకపో
వీరుకు ఏమి చేయాల్నో సమదైత లేదు మనసుల అనుకొ బట్టిండు గీ పొల్ల ఎంత సెప్పిన ఇంటలేదాయే ఎట్లా జేయాలే వాళ్ళ అయ్యేమో గానీ, మా అయ్యకు తెలిస్తే ఇగ సంపకొడుతడు.
గీ సిక్కుఏందీ దేవుడా..ఎట్లైనా ఈశ్వరిని ఇంట్లోకి పంపిస్తా
ఇగో ఈశ్వరి ఎందుకు భయపడుతాన్నావు.. ఎందుకా
బాపమ్మ, మా బాపుకు జరిగింది సెప్పుతది మా బాపు నిన్నేమైనా బతుకనిత్తడా బతకనియ్యడు … నీకేమైనా ఐతే నేను బతుకుతన. నేను సచ్చిపోతా…
మీ బాపు ఏమైన సేత్తడా మీ అయ్యకు గంతున్నదా మనకేమైనా అయితే మా తాత ఊకోడు మీ బాపుకు తెలుసు.
ఏమి తెలుసు మీతాతకు.. ఏమితెలుసా
గవన్ని ఇప్పుడు ఎందుకు నువ్వు ఇంట్లకు పో నేను జూసుకుంటా అంటూ ఈశ్వరి చేయి పట్టుకొని ఇంట్లోకి తీసుకెళ్లిండు..
తులసమ్మ ఇగో మీ మనవ రాలు నాతో వస్తా అంటుంది
తీసుకపోయి మనువు జేసుకువాల్నా..నేను సెప్పినట్టు ఇంటవా.
వద్దు బిడ్డా వద్దునువ్వు సెప్పినట్టే ఇంటా పొల్లను నువ్బు తీసుకపొతే ఇంటిల్లిరాళ్లు ఆగమైతరు.
ఈశ్వరిని తీసుకపోకు బిడ్డా నువ్వు తీసుకపొతే నా కొడుకు ఊరుకోడు మీ ఇల్లే కాదు ఊరు ఆగమైతది.
అయితే ఒక్క మాట సెప్పుతానా ఈశ్వరిని మనువు జేసుకునేది నేనే
, ఇగ గీ లొల్లి రాఘవులు దొరకు సెప్పినావనుకొ
ఏ అద్దమనాత్రి వచ్చి ఈశ్వరిని లేపుకపోత….. ఇగ నీఇష్టం
పమాణంగా సెప్పుతానా బిడ్డా
ఎవల మీద. నా మీదన.
.కాదు బిడ్డా పమాణంగా కాదు
నీ సెయ్యి నా సేతిలయేసి సెప్పు.
సరే బిడ్డా గీ ఇషయం నా కొడుక్కు సెప్పనే సెప్ప,సెప్పితే నేను సచ్చిపోయినట్టు
.సరే సరే పెద్దోళ్ళు పమాణం చేస్తే అబద్దం ఆడరని నిన్ను నమ్మి ఈశ్వరిని ఇక్కడే వదిలిపెట్టిపోతున్న
ఈశ్వరి ఇంట్లోకి పో.. నేను పోను వీరు
ప్రేమగా వెళ్ళు బంంగారం అంటూ పంపించిండు.
తెల్లారంగనే ఎడ్లను తీసుకొని పొలం కాడికి పోతాండు వీరు ఎదురుగా రాఘవయ్య దొర కనిపించిండు. ఇగ వీరుకు భయం జోచ్చింది, దొర పొద్దుగాల్నే బయటకు రాడుకదా సుట్టు మంది వున్నారు ఆ ముసల్ది సెప్పిందా! పక్క సందుల నుండి పోతా అని ఎద్దులను అటు వైపు తిప్పిండు అంతే
ఒరేయ్ వీరుగా ఎటు పోతానువరా నీ భూమి గిటుంటే గటుపోతానవేంది. ఇటురా అన్నడు రాఘవులు
లేదు దొర గీ ఎద్దులు ఒగ మానంగా యినయి. పక్క సందులకు పోయినయి ఇటే తిప్పుతానా అన్నాడు
ఏమిరా వీరుగా సాన పెద్దోని వైనావు, ఏందిరా నీబలుపు
ఏమి లేదు దొర పక్కనే వున్నా సాంబయ్యకు భయంజోచ్చింది. నిన్న పొద్దున జరిగిన యిసయం రాఘవులు దొరకు తెలిసింది కావచ్చు,వాన్ని ఏమైనా అంటే నా పని కూడా అయినట్టే..
ఒరే సాంబిగా దొర ఇగో ఏవైనకైనా సెప్పి కాసేపు ఎడ్లను సూడమని సెప్పు సరే దొర
అరేయ్ వీరుగా నా ఎంట ఇంటికి రా సరే దొర
దొర ముందు ఇద్దరు లంకకట్టెలు పట్టుకొని నడుస్తాళ్లు మధ్యన దొరతో పాటు వీరనాగులు నడుస్తాండు ఎనక ఓ పదిమంది వస్తాళ్ళు
ఒకడైతే గుడ్లు బయటకని సుత్తాండు.
దొర ఇళ్ళు వచ్చింది. ఎదురుగ ఈశ్వరి బాపమ్మ వున్నది. వీరు ముఖం చూసి కాసింత భయంతో వుంది.
అరేయ్ వీరుగా
నేమేమి సెప్పినాను నువ్వేమి చేసినవు
నేనేమి సెయ్యలేదు దొర
దొర మనుషులో ఒకడు ఏందిరా వీరుగా నోరు గట్టిగా పెకులతలేదు దొర ఏమి సెప్పిండో తెల్వదార
జుట్టు పట్టువడానికి వచ్చిండు
అరేయ్ ఆగురా
అరేయ్ వీరుగా ఇగో మా సుట్టపోళ్ల ఊరికి కథసెప్పడానికి పొమ్మన్న కదా అవును దొర
తులసవ్వ గా సిల్లర పైసలు తీసుకరా ఎందుకు బిడ్డా
గీ వీరుగానికి నాలుగు పైసలిచ్చి కథ సెప్పడానికి పంపిస్తా
తులసమ్మ కు అప్పటి దాకాభయం వుండే నేను సెప్పక పోయిన ఎవరైన సెప్పిల్లో నని కొంచెం ఊపిరి పీల్చుకున్నది.
పైసలసంచిల నుండి పైసలు తీసి రాఘవులుకు ఇచ్చింది.
పొద్దుగూకే కళ్ళ ఆ ఊరికి పోవాలే
సరే దొర
ముసల్దీ ఏడ సెప్పిందో అనుకున్న సెప్పలేదు
అనుకుంట ఎడ్లను తీసుకొని పొలం కాడికి పోయిండు.
గట్లపొంటి ఎడ్లను తీసుకపోకుంటా పాట అందుకున్నడు
ఓ సెట్టమ్మా నువ్వు సల్లగా సూడాలే
ఓ భూతల్లి నువ్వు సల్లగా ఉండాలే
ఆ పక్షిలెక్క నేను ఎగురుతే బాగుండు అంటూ
నోటికొచ్చిన పదాలను పాడుకుంటూ వీరనాగులు పొలంగట్లపొంటి నడుసుకుంటా పోతాండూ
గా గట్లపక్కనే ఈరమ్మ ఓ పీలగా ఏమో ఉషారుగా పోతానవు ఎవలకు తెల్వదనుకుంటాన్నావా ఏందీ
ఏంటిది వదినే
ఏంటిదా దొర బిడ్డతోని నువ్వేమి చేసినావో నాకుఎరుకలేదా
నాదగ్గర ఏమి దాయకు
వామ్మో ఇగ గీమకు ఏమిదేలిసిందో ఏమో కానీ
గీమ నోట్ల యిసయం పడితే ఊరంతా కాదు సుట్టు పదిఊళ్లకు తెలుత్తది.
ఓ వదినే ఏంటిదో జర సెప్పరాదు
ఏంటిదా దొరబిడ్డ ను లగ్గం జేసుకుంటనన్నవు కదా ఏదొర బిడ్డా
ఏమి ఇకమతు జెత్తనావు
తెల్వదా
ఏ ఊకో వదిన ఏ దొర బిడ్డా నేనేమి సేత్తాన,
ఏమి ఎరుగనట్టు ఉండకు.
అంత నాకు తెల్సు.
నిన్న దొర ఇంటికి రెండు సోలల జొన్నల కోసం వచ్చిన నీ ఎవ్వారమంత జూసిన
ఇగ అయిపోయింది గీమకు తెల్సింది అంటే అంతే ఎట్లా సెప్పాలే
ఇగో వదిన నువ్వేమో తప్పు పడుతానవు దొరబిడ్డకు ఓనగాయాలు తెంపిఇచ్చిన అంతే
సాలు సాలు నీ బొంకుడు
నీకు ఈపు ఎప్పుడో మోగుతది కుండా పగిలే దాకనే పగిలిన రోజు ఎట్లా ఉంటదొ తెలుసనుకుంటా పొలంలోకి పోయింది.
నాకళ్లు ఎవలున్న పసిగడుతాయి, దొర ఇంట్లకు వచ్చిన ఈమెను ఎందుకు సూడలేదు
ఏమో ఈమె నోరు మూఇంచ డానికి ఏమి సేయాలి తల గోక్కుంటా ఎడ్లను పొలంవైపు కు కదిలించిండు.
