పుడమి టివి జనసాహిత్యం
శ్రీను సర్ పలుకులు
తాటికొండ శ్రీనివాస్ -మానసిక సైన్స్ విద్యావేత్త
మెడికల్ &హెల్త్ విభాగం
పుట్టుకతో వచ్చిన జీవితాన్ని భారంగా మోసుకుంటూ సాగిపోవడం కాదు… దానిని వరంగా మార్చుకుని వెలుగులా నిలవాలి.
కడుపు నింపుకోవడం, ఇల్లు కట్టుకోవడం వరకు అది సాధారణ జీవితం… కానీ తన కోసం మాత్రమే కాదు, ఇంకొకరి కోసం కూడా బ్రతికిన రోజు నుంచే జీవితం అర్థవంతమవుతుంది.
ప్రతి మనిషి గుండెల్లో ఒక నిశ్శబ్ద ప్రపంచం ఉంటుంది… ఆ ప్రపంచానికి ఆడంబరాలు, నకిలీ నవ్వులు అవసరం ఉండవు. అదే మన అసలైన రూపం.
రోజులు గడపడం జీవితం కాదు… ఒకరి కన్నీరు తుడిచిన క్షణం, ఒకరి కష్టానికి అండగా నిలిచిన సమయం… అవే శాశ్వత గుర్తులు.
నీ లోపలి వెలుగును నువ్వే వెలిగించుకోవాలి… బయట ఎంత వెలుగు ఉన్నా, మనసులో చీకటి ఉంటే దారి కనిపించదు.
చివరికి మనిషి వెంట వచ్చేది డబ్బు కాదు… ఆస్తులు కాదు… ఎంత మంది హృదయాల్లో స్థానం సంపాదించాడో అదే నిజమైన సంపద.
వయసు పెరగడం సహజం… కానీ విలువ పెరగడం… అదే అసలైన జీవితం.
మీ రోజు ఆనందంగా… ఆత్మవిశ్వాసంతో… అందరికీ ఉపయోగపడేలా సాగాలి.
