కులం నా ఆస్తిత్వమే కాదు

పుడమిటివి జన సాహిత్యం

సామ్రాట్ పలుకులు

నాగబెల్లి జితేందర్ సామ్రాట్
ఎడిటర్ ఇన్ చీఫ్ పుడమి టివి ఎం వి ఆర్ పబ్లికేషన్స్

కుల కుంపటీలో
తక్కువని అవహేళన చేసే
ఎక్కువని విర్రవీగే తలపొగరు వెధవలకు
సమాధానమవ్వాలి
ఉత్పత్తి వృత్తులే కులాలై అల్లుకుపోయిన

మన దేశనిర్మాణంలో నా కులం
వారసత్వ వైద్యం
ఉపాధ్యాయ లోకం
జర్నలిజం కవికులం
పరిశీలన పరిశోదన
నిత్య విద్యార్థి తత్త్వం
ప్రకృతి ప్రేమికులం
పని కులమైనప్పుడు
ప్రతి వృత్తి ఉద్యోగం
కొత్తకులానికి పురుడుబోస్తూనే వుంటుంది
నాలో తప్పులు లోపాలు లేవంటే నేను మనిషిని ఎట్లయిత
సరిదిద్దు కోకుంటే మనిషిగా
బతికినట్లు ఎట్లయిత
కులం మతం నా ఆస్తిత్వము కాదు
నా దేశ పౌరసత్వమే కాదని
పంచభూతాలను నమ్ముకున్న
నన్ను నేనుగా ఇష్టపడే
ఓరుగల్లు త్యాగలను
గుండెల నిండా ప్రేమించినోన్ని
నిక్కచ్చిగా నిలబడే
తెలంగాణ మట్టిబిడ్డను
మూలవాసుల పరంపరను
నా దేశ భూమి పుత్రుడిని
ప్రపంచపౌరుడిని
విశ్వంలో సంచరించే
అక్షరయుద్దాన్ని

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *