లింగంపల్లి మరియు రామచంద్రపురం రైల్వే స్టేషన్ల తనిఖీ

దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ

దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ఈరోజు, అనగా 28 మార్చి, 2026న సికింద్రాబాద్ డివిజన్‌లోని లింగంపల్లి మరియు రామచంద్రపురం రైల్వే స్టేషన్లను తనిఖీ చేశారు. ఈ తనిఖీ సమయంలో ఆయనతో పాటు సికింద్రాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ డాక్టర్ ఆర్. గోపాలకృష్ణన్, ఇతర సీనియర్ అధికారులు మరియు బ్రాంచ్ అధికారులు ఉన్నారు.

శ్రీ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ లింగంపల్లి రైల్వే స్టేషన్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన వెయిటింగ్ హాల్, టికెటింగ్ సౌకర్యాలు, లిఫ్ట్లు , ప్లాట్‌ఫారాలు మొదలైన ప్రయాణీకుల సౌకర్యాలను సమీక్షించడంతో పాటు, స్టేషన్ పరిశుభ్రత ,స్టేషన్ ప్రాంగణాన్ని కూడా పరిశీలించారు. జనరల్ మేనేజర్ స్టేషన్‌లోని రైలు నిర్వహణ సౌకర్యాలను కూడా సమగ్రంగా పరిశీలించారు.

ట్రాక్‌ల పరిస్థితి, మౌలిక వసతుల అభివృద్ధి, భద్రతా ప్రమాణాలు మరియు కార్యకలాపాల సామర్థ్యాన్ని సమీక్షించి, రైల్వే సేవల సమర్థతను మరింతగా పెంచే విధానాలను పరిశీలించారు.ఈ తనిఖీ సందర్భంగా, డివిజనల్ అధికారులు స్టేషన్‌లో తదుపరి విస్తరణ మరియు అభివృద్ధి ప్రణాళికల గురించి జనరల్ మేనేజర్‌కు వివరించారు.

అనంతరం, జనరల్ మేనేజర్ రామచంద్రపురం రైల్వే స్టేషన్‌ను తనిఖీ చేసి, అక్కడ ప్రయాణీకుల సౌకర్యాలు మరియు ఇతర వసతులను సమీక్షించారు. ఆయన అధికారులతో తదుపరి అభివృద్ధి ప్రణాళికలపై చర్చించారు. ఈ తనిఖీ సందర్భంగా, జనరల్ మేనేజర్ మీడియా ప్రతినిధులతో కూడా మాట్లాడి, జోన్ వ్యాప్తంగా జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాల గురించి వారికి వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *