ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి- వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్ స్వేత

పుడమి టివి పోలీస్ న్యూస్

 

 

వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్ స్వేత

 

 

 

 

ఎలకంటి నరేష్ -పుడమిటివి తెలంగాణ బ్యూరో చీఫ్

వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో విధులు నిర్వహిస్తూ పదవీ విరమణ పొందిన నలుగురు పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్లకు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత, ఐపీఎస్, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారులను శాలువాలతో సత్కరించి, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు. పదవీ విరమణ పొందిన వారిలో సబ్ ఇన్స్స్పెక్టర్లు, ఎమ్.లక్ష్మీనారాయణ, పి.కొమురయ్య, సి.హెచ్.పర్శురాములు, బి.రమేష్ లు వున్నారు. అనంతరం జ్ఞాపికలు, బహుమతులు అందజేసి ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, పోలీస్ శాఖలో ఎంతో ఒత్తిడితో కూడిన విధులను సమర్థవంతంగా నిర్వహించి, సంపూర్ణ ఆరోగ్యంతో పదవీ విరమణ చేయడం ఎంతో గొప్ప విషయమని అన్నారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవీ విరమణ తప్పనిసరిగా ఉంటుందని, పోలీస్ శాఖకు వారు అందించిన సేవలు ఎంతో గౌరవనీయమైనవని పేర్కొన్నారు.

పదవీ విరమణ అనంతరం వారు తమ కుటుంబ సభ్యులతో సంతోషంగా సమయం గడుపుతూ, ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ఆకాంక్షించారు. వారు మరియు వారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని, వారి పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని పోలీస్ కమిషనర్ ఆకాంక్షించారు.

ఈ వీడ్కోలు కార్యక్రమంలో అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (పరిపాలన) ఆర్. ప్రభాకర్ రావు, అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏ.ఆర్.) సురేష్, ఏసీపి అడ్మిన్ (ఏ ఆర్ )-ఎస్. సురేంద్ర, ఆర్.ఐ. సతీష్, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు కె. కర్ణాకర్, పోలీస్ సిబ్బంది మరియు పదవీ విరమణ చేసిన పోలీస్ అధికారుల కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *