కేంద్ర ఎన్నికల సంఘం కమీషనర్ ను తొలగించాలి హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహా ధర్నా

పుడమి టివి

 

 

 

 

 

ఎలకంటి నరేష్

పుడమి టివి తెలంగాణ బ్యూరో చీఫ్

 

కేంద్ర ఎన్నికల సంఘంలో జరిగిన అంతర్గత కుంభకోణం, ఎస్ ఐ ఆర్,ఓటర్ల జాబితాలో ఏకపక్ష నిర్ణయాలు మరియు అక్రమ మార్పులకు (వోట్ చోరి) పాల్పడిన కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను తక్షణమే పదవి నుండి తొలగించి, అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ఆధ్వర్యంలోసోమవారం హనుమకొండలో భారీ మహా ధర్నా నిర్వహించారు

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి కడియం కావ్య, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, వరంగల్ పార్లమెంట్ ఇంచార్జ్ లు పల్లె శ్రీనివాస్ గౌడ్, దుద్దిల్ల శ్రీను బాబు అతిధులుగా పాల్గొన్నారు.

స్థానిక ఆర్ట్స్ & సైన్స్ కాలేజ్ ఆడిటోరియం నుండి హనుమకొండ కలెక్టరేట్ వరకు కాంగ్రెస్ శ్రేణులు భారీ నిరసన ర్యాలీ చేపట్టాయి. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని, కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్ష వైఖరికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట బైఠాయించి, తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు.

ధర్నా అనంతరం, ఓటర్ల జాబితాలో జరిగిన ఈ అక్రమ మార్పులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ హనుమకొండ జిల్లా కలెక్టర్ శ్రీమతి ఛాహత్ బాజ్‌పాయ్ ని కాంగ్రెస్ నాయకుల బృందం కలిసి అధికారిక వినతిపత్రం అందజేసింది.

ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి మాట్లాడుతూ… లోక్‌సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గతంలో ఈ భారీ “వోట్ చోరి” ప్రచారంపై లేవనెత్తిన బలమైన నిరసనకు పూర్తి నైతిక విజయం లభించిందని, ప్రస్తుత అధికార పక్షమైన బీజేపీకి అనుచితమైన లబ్ధి చేకూర్చేందుకు వీలుగా ఎన్నికల యంత్రాంగాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని, మానిప్యులేట్ చేస్తున్నారని మా నాయకులు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరియు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని నిరంతరం హెచ్చరిస్తూనే ఉన్నారు. ఎన్నికల సంఘాన్ని కేవలం ఒకే ఒక్కడి నియంతృత్వంగా మారుస్తూ, రాష్ట్ర అధికారులను క్రమపద్ధతిలో పక్కనపెట్టి, విస్తృతంగా ఎన్నికల అక్రమాలకు పాల్పడినట్లు ఇప్పుడు రికార్డుల పరంగా స్పష్టంగా నిరూపితమైందని, గత 10 నెలలుగా ఇద్దరు ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషిలు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఏకపక్షంగా, తప్పుడు పద్ధతుల్లో ఓట్ల చేర్పులు, తొలగింపులకు (SIR) పాల్పడ్డారని మండిపడ్డారు. అధికార బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకే ఈ భారీ “ఓట్ల దొంగతనం” (వోట్ చోరి) కుట్ర జరిగిందని ధ్వజమెత్తారు. ఈ అక్రమ మార్పులపై సమగ్ర విచారణ జరిపి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మరియు సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు.

ఈ నిరసన కార్యక్రమంలో ఎనుమాముల మార్కెట్ చైర్మన్ శ్రీమతి పులి ప్రియాంక, కమలాపూర్ AMC చైర్మన్ తౌటం ఝాన్సీరాణి రవీందర్, ఛైర్మన్, DCC మీడియా & కమ్యూనికేషన్ కమిటీ మార్క విజయ్ కుమార్, నమిండ్ల శ్రీనివాస్, టీపీసీసి సభ్యులు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఈ.వి. శ్రీనివాస్ రావు, బత్తిని శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ శ్రీమతి పుల్లా పద్మావతి, IYC జాతీయ కో-ఆర్డినేటర్ శ్రీమతి గొట్టిముక్కల సాగరిక రావు, ఐఎన్‌టీయూసీ కూర వెంకట్, డాక్టర్ సెల్ అధ్యక్షులు శ్రవణ్, స్టేట్ ఎస్సీ డిపార్ట్మెంట్ వైస్ ఛైర్మన్ గోవిందు శ్వేత, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కె.ఆర్. దిలీప్ రాజ్, మహిళా కాంగ్రెస్ చైర్మన్ బంక సరళ, సేవాదళ్ చైర్మన్ బొచ్చు చందర్, ఓబీసీ సెల్ చైర్మన్ బొమ్మతి విక్రమ్, మైనారిటీ సెల్ చైర్మన్ మీర్జా అజీజ్ ఉల్లా బేగ్, RGPRS ప్రెసిడెంట్ శనిగరం సుధాకర్, ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ అరూరి సాంబయ్య, NSUI ప్రెసిడెంట్ కాసుబోజుల వేణుచారి, మరియు అన్నీ మండలాల అధ్యక్షులు దూదిపాల బుచ్చి రెడ్డి, ముప్పు శ్రీనివాస్, పొచంపల్లి రాజి రెడ్డి, వాసాల శ్రీనివాస్, కొలపాక చేరాలు (చందు), ఒంటేరు శ్రవణ్ కుమార్, పర్నెం మల్లా రెడ్డి, రేవూరి జలేంధర్ రెడ్డి, దుబాసి రాజేందర్, మూరావత్ లక్ష్మణ్ నాయక్, పెసరు రమేష్, ఎన్. మోహన్ గౌడ్, ఆర్. అశోక్ మరియు అన్నీ డివిజన్ అధ్యక్షులు చిర్ర రాము గౌడ్, పుట్ట తిరుపతి, జక్కుల సదానందం, కర్ర హరీష్ రెడ్డి, వస్కుల శ్రీనివాస్, గడ్డం అరుణ్, కొంక హరి బాబు, దువ్వ శ్రీకాంత్, నేదునూరి సునీల్, గొర్రె కిరణ్, బాషబోయిన శ్రీధర్ యాదవ్, సోమ కరుణ శ్రీ, మహమ్మద్ అజామ్, పోలు లక్ష్మీ నారాయణ, సీత శ్యామ్, భీమ వినయ్, ఫిరోజ్ ఖాన్, ఎండి.సమద్, బొమ్మ సురేష్, తోట రాజ్ కుమార్, సత్తు రమేష్, దొంగల కుమార్, గొపనబోయిన చందు, నాగపురి కరన్, ఎండి.బషీర్, ఎండి.కరీం, తడుక సుమన్, యర్ర మహేందర్, దొనికెన సుమన్, ఎక్కటి అశోక్ రెడ్డి, తాళ్లపల్లి సుధాకర్, కేతిడి దీపక్ రెడ్డి, బుస్స నవీన్, అర్కవత్ లక్ష్మణ్ నాయక్, పాలడుగుల ఆంజనేయులు, సయ్యద్ విజయ శ్రీ రజాలితో పాటు వివిధ విద్యార్థి, యువజన విభాగాలు, పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, డివిజన్, మండల అధ్యక్షులు, ఆర్‌జీపీఆర్‌ఎస్ నాయకులు, మహిళా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని జిల్లా కాంగ్రెస్ పార్టీ మీడియా ఛైర్మెన్ విజయ్ ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *