ఎంవిఆర్ భవనం నుండి
పుడమిటివి జనసాహిత్యం
నాగబెల్లి జితేందర్ సామ్రాట్
ఎడిటర్ ఇన్ చీఫ్ పుడమి టివి ఎంవిఆర్ మానవవికాస రచనలు
పొలంగట్లపైన ఎడ్లను వదిలిపెట్టి సెట్టు కింద కూసున్నడు వీరనాగులు,, ఈశ్వరి ఇంట్లో తెలిసిన ఏమో కానీ, ఈరవ్వనోట్లో యిసయం పడ్డది. ఇంకేమున్నది,గీ విషయం ఎటుబోయి ఎటు వత్తదొ, నెత్తికెక్కక వీరనాగులు రందిబోయి ఆలోచిస్తున్నడు. ఈశ్వరిని పెళ్లి సేసుకుంటే దొరలు బతకనిత్తర, నన్నే కాదు మావొళ్లను ఏమైనా జేత్తరేమో, పెళ్లిసేసుకోక పొతే ఈశ్వరి బతుకతదా.. అసలు ఈశ్వరి లేకపొతే నేను బతికి ఉంటన.
ఏమి సెయ్యాలే, ఇయ్యాల కాకపొతే ఎప్పుడైనా బయటపడుతది, ఎమన్నా గాని ఎట్లయితే గట్లయితది, ఇంటికాడినుండి తెచ్చుకున్న సద్దిమూటఇప్పిండు, సద్దిగిన్నెలవున్న బువ్వను తీసికలిపి నోట్ల ముద్దుపెట్టుకో బోయిండు, ముద్ద నోట్లోకి పోతలేదు ఏదో కోల్పోయినట్లు దిగులుతో వున్నాడు.
ఇంతలసెంద్రయ్యపొలంగట్లపొంటినడుసుకుంటావచ్చుకుంటా….ఒరేయ్ వీరనాగులు..
ఇనిపిత్తా లేదార..
ఓరీ వీరుగా….
అరే ఎంత పిలిసిన సప్పుడు జేత్తలేవేందిరా
గట్లమీద ఎడ్లున్నయి..
వీడేమో కాన రాకపోయే
ఏడున్నావురా వీరిగా..
అప్పటికే పరధ్యానంలో వున్నా వీరనాగులుకు
సెంద్రయ్య పిలిసేది సేవికెక్కడం లేదు.
పిలుసుకుంట పిలుసుకుంటా సెట్టుకింద కూసున్న వీరనాగులు దగ్గరకు వచ్చి ఒరేయ్ వీరు పిలిస్తే సప్పుడు సేత్తలేవేందిరా…
అన్నం ముద్ద అరచేతిలో పెట్టుకొని అట్లే బీరిపోయి కూసున్న వీరు సెంద్రయ్య వచ్చింది కూడ తెల్వకుంట వున్నాడు.
ఇగ సెంద్రయ్య ఏందిరా, “వీరు’ గట్లవున్నావు అని తలమీద సెయ్యి వేసిండు.
‘వీరు”ఎవలో వచ్చిళ్ళని అటుఇటు జూసిండు ఎనక సేంద్రయ్య,
ఒరేయ్ సెంద్రిగా మాట మాట్లాకుండా గిట్లవచ్చినావు ఏందీరా.
గంత గట్టిగా పిలుస్తాంటే సప్పుడు జేయ్యలె సరే సరే
ఏందిరా గట్లున్నావు
ఏమిలేదురా
గా రాఘవయ్య దొర పొద్దున్నే రెండు కుక్కల్ని తెచ్చి పెట్టిండు అవి ఎట్లున్నాయి అనుకున్నావు మీద పడితే మనిషి కండలు కండలు పీక్కతింటాయి,
కుక్కలు వుంటే ఏందిరా
ఏందా ఇగ దొర ఇంటికి ఎవరు పడితే వాళ్ళు పొతే కుక్కలే
వాళ్ళ సంగతి జూస్తాయి.
నువ్వు ఇగ ఈశ్వరిని కలుసుడు కట్టమేరా
పొద్దంత నువ్వు గీ పొలాల పొంటే ఉండాలే
అరేయ్ సెంద్రిగా నువ్వు సెప్పింది నిజమేరా
ఎనకటికి ఒకడు సెప్పిండంట,
కాసులు ఉన్నోడు, కుక్కల్ని కొని ఇంటి ముందు కాపలా పెట్టుకుంటాడంట.
కష్టం జేసేటోడు…. ఏమో
బర్రెల్ని, ఆవులను, మేకలను, ఎడ్లను కొంటాడు
కుక్కలైతే ఎవ్వడచ్చిన మోరుగుతయి, ఇంత,తినిఎంగిలి కూడు పడేత్తే సాలు కాపలా ఉంటాయి
పశువులయితే పంటలు పండిస్తాయి, పాలు ఇస్తయి
మనకు ఇంత బువ్వ పెడుతాయి.
కుక్కలు పెంచుతే ఏందిరా… నన్నెము జెస్తాయి ఇంత కూడు పడేసి నేను యాడ కనిపించిన తొడలు పీకుడు కాదు తోకఊపేటట్టు చేస్తా… ఇగ విను
ఈశ్వరి నాది,నాదిరా సెంద్రిగా
ఇగఏమైనా మాట్లాడితే సూడు బిడ్డా అని దబుక్కున లేసినిలబడ్డాడు.
వీని ఎవ్వారం ఎట్లనో వున్నదని నోరుమూసుకుని నిలబడ్డాడు సెంద్రయ్య
అరెయ్ వీరుగా కడుపుల పేగులు తెగ ఒర్రుతానయిరా అవ్వ ఏమి కూర వండిందిరా
ఏమి వండిందా
పచ్చిపులుసు
ఇంత మామిడికాయ తొక్కు
మీగడ పెరుగు
అబ్బా ఇయ్యాటికి సాలు అని కింద వున్నా సద్దిని తీసుకొని బండమీద కూసుండి సెంద్రయ్య తినడం మొదలుపెట్టిండు
వీరు మాత్రం ఈశ్వరి బాపమ్మ ఎమన్నా సెప్పిందా ఎన్నడూ లేనిది కుక్కలు ఎందుకు తెచ్చిండు
గిట్లఆలోచించుడు మొదలుపెట్టిండు
సెంద్రయ్య మీగడపెరుగును ఇష్టంగా తింటాండు
అరసెయ్యికి ఏళ్లకు నూనె పూసినట్టున్నది…
ఏమిజరిగిందో సెప్పురా అంటే పొద్దంత కొలుపుపెట్టిండంట ఎనకటికి ఒకడు నీఅయ్యా
ఇంకా ఆ మీగడ పెరుగు తినడం ఆపనట్టున్నది.. వీడు. ఎవ్వలు సూడకుండా అదోటి ఇదోటి తిని ఆకలైతాంది. ఇంత బువ్వ పెట్టమని, బువ్వ సిప్ప సేతికి రాంగానే తిన్నదంతా వాంతులు సేసుకున్నట్టు వీరిగాడు ఈశ్వరి కనిపిస్తలేదని, వచ్చిరాని ముచ్చట్లు సెప్పబడితివి సెప్పబడితివి… ఇది నిజమేనారా సత్తెపమాణంగా సెప్పురా… పచ్చని ఆకులు మీద పమాణం జేత్త అని పచ్చని ఆకులు తెంపి నెత్తి మీద పెట్టుకొని నేను ఏదైనా అబద్దం సెప్పితే సచ్చుడేరఅన్నడు. సెంద్రిగా గింత జరిగిన ఏమి సెప్పకపోతివి అన్ని దాస్తివి
మాకు తెల్వదంటే ఊళ్ళ ఎవలైన నమ్ముతారురా
వాడువత్తడో రాడో
ఏమైతతో తెల్వదు కానీ
అందరూ మనకు తెలిసే జరిగింది అనుకుంటారుకదరా అని
శివయ్య అన్నడు. పాముసెవుల కంటే ఎక్కువన్నట్లు సాంబయ్య ఒరేయ్ ఆగండిరా
అగో గా సెట్లల్ల ఏవరో వచ్చినట్లు ఇనపడుతాంది
మనుషుల అలికిడి అనిపిస్తాంది, అన్నడో లేదో
నాటుతుపాకి సేతుల పట్టుకొని ఓ ఇద్దరు ఎదురుగ నిలబడ్డారు.
(మరో ఎపిసోడ్ లో కలుద్దాం )
