ఇండ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలు అరెస్ట్

 

నాగబెల్లి అరుణ్ కుమార్
పుడమిటివి క్రైం బ్యూరో

 

తాళం వేసిన ఇళ్లల్లో చోరిలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను హనుమకొండ పోలీసులు అరెస్ట్ చేశారు.వీరి నుండి పోలీసులు కుమారు పది లక్షల రూపాయల విలువ గల 35 గ్రాముల బంగారు ఆభరణాలు, రెండు లక్షల నగదు,టీవీలు, ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు, మొబైల్ ఫోన్లు, వాచ్‌లు మరియు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

 

అరెస్టైన నిందితులు:1.బింగి రఘు @ సోనూ (19 సంవత్సరాలు), కొత్తూర్ జెండా, హనుమకొండ. 2.మహమ్మద్ అసద్ (19 సంవత్సరాలు),బొక్కలగడ్డ, హనుమకొండ చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ వివరాలను వెల్లడిస్తూ. పట్టుబడిన నిందితులు ఇద్దరు
గంజాయి మరియు మద్యం అలవాట్లకు బానిసలై, వారి జల్సాల కోసం అవసరమైన డబ్బు ను సులభంగా డబ్బు సంపాదించాలని నిందితులు నూతనంగా నిర్మాణంలో ఉన్న ఇళ్లలో మరియు తాళం వేసి ఇండ్లలో చోరీ చేసేందుకు సిద్ధపడ్డారు.

దీనితో నిందితుల్లో ఒక్కడైనబింగి రఘు @ సోనూ గత సంవత్సరం జనవరి మాసంలో హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తూరు, కుమార్ పల్లి, సుబేదారి పరిధిలో శ్రీనగర్ కాలనీ తాళం వేసి వున్న ఇండ్లలో చోరీలకు పాల్పడి బంగారు నగలు, వెండి వస్తువులు మరియు నగదు చోరీకి పాల్పడగా, మరో నిందితుడు మహమ్మద్ అసద్ గత నెల మార్చ్ 23వ తేదీన కాజీపేట ప్రాంతంలోని బాపూజీ నగర్‌లో తాళం వేసి ఉన్న ఇంటిలో చొరబడి టీవీలు, ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు, మొబైల్ ఫోన్లు, వాచ్‌లు మరియు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను దొంగిలించాడు.

 

 

ఈ చోరీలపై అప్రమత్తమైన పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి పోలీసులకు అందుబాటులో ఉన్న టెక్నాలజీ వినియోగించుకొని నిందితుల కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు.

ఈరోజు ఉదయం హనుమకొండ బస్టాండ్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న సమయంలో పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు తాము పాల్పడిన నేరాలను అంగీకరించారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు

నిందితులను పట్టుకోవడంలో చాకచక్య ప్రదర్శించి ప్రాపర్టీ రికవరీ చేసిన హనుమకొండఇన్స్పెక్టర్ మచ్చ శివకుమార్, ఎస్సై పర్సురాములు మరియు క్రైమ్ పార్టీ అశోక్ మరియు రావుఫ్ లను సీపీ అభినందించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *