తంబళ్లపల్లెలో జనసేన కార్యాలయంపై వైసీపీ దాడి అత్యంత హేయం -నాదేండ్ల మనోహర్ జనసేన నేత

 

నాదేండ్ల మనోహర్ జనసేన నేత

 

 

గాడిపల్లి మధు పుడమిటివి ఆంధ్ర తెలంగాణ ప్రతినిధి-7801088509

స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా అన్నమయ్య జిల్లా, తంబళ్లపల్లెలో ప్రజాస్వామ్య పద్ధతిలో, నిబంధనల మేరకు నామినేషన్లు దాఖలు చేయడానికి వెళుతున్న జనసేన పార్టీ నాయకులు, శ్రేణులను కవ్వించి వైసీపీ గూండాలు దాడులకు తెగబడటం అత్యంత హేయమని చర్య అని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు

. తంబళ్లపల్లె ఎంపీడీఓ కార్యాలయం సమీపంలోని జనసేన పార్టీ కార్యాలయాన్ని వైసీపీ వాళ్లు ధ్వంసం చేశారని అన్నారు. అక్కడే కొన్ని వాహనాలను నాశనం చేసి, అడ్డు వచ్చిన వారిపై మారణాయుధాలతో దాడులకు తెగబడ్డారని అన్నారు.ఎన్నికల వేళ రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య సృష్టించాలని, దౌర్జన్యాలు, గొడవలు చేయాలనే దురుద్దేశంతో వైసీపీ ఈ దుశ్చర్యలకి పాల్పడుతోందని అన్నారు రాష్ట్రంలో అశాంతి, అరాచకం, అలజడులు సృష్టించడం ద్వారా స్థానిక సంస్థల ఎన్నికలను నిలిపివేయాలనే వైసీపీ పన్నాగం దీనిలో స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికల్లో గెలవలేం అని తెలిసే వైసీపీ హింసకు దిగిందని ఆరోపించారు

ఎస్.ఈ.సి. కఠిన చర్యలు తీసుకోవాని కోరారు జనసేన పార్టీ ఇలాంటి గూండా చర్యలను చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు . జనసేన పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన వారి మీద, జనసేన శ్రేణులపై దాడులను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తీవ్రంగా పరిగణించి . కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు . పోలీసు యంత్రాగం కూడా ఈ దాడులకి పాల్పడ్డవారిని, వెనుక ఉన్నవారిని గుర్తించి తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు

జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ప్రజాస్వామ్యాన్ని పరిపూర్ణంగా గౌరవించే నాయకులు. రాష్ట్ర అభివృద్ధిలో స్థానిక సంస్థల పాత్రను పెంచాలనే బృహత్ ఆశయంతో ఆయన పనిచేస్తున్నారని అన్నారు. దీనిని కాలరాసేలా వైసీపీ చేస్తున్న దౌర్జన్యాలు, దాడులను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు . ప్రజాస్వామ్యవాదులు వైసీపీ చేస్తున్న ఈ అరాచక చర్యలను ఖండించాలని నాదెండ్ల మనోహర్ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *